Latest Updates
-
బంపరాఫర్..షూరిటీ లేకుండానే రూ.10 లక్షల లోన్..ఫుల్ డీటెయిల్స్ మీకోసం.. -
ఎండల వేళ దంపతుల మధ్య గొడవలు ఎందుకు? మీ బంధాన్ని కాపాడుకోవడానికి ఈ 7 విషయాలు తప్పక తెలుసుకోండి! -
గ్యాస్, ఎసిడిటీ సమస్యలకు చెక్.. ఉదయాన్నే ఈ సింపుల్ పనులు చేయండి చాలు! -
ఫైబర్, కాల్షియం వంటి పుష్కలంగా రాగి సమోసా..ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి -
ఇడ్లీ, దోశ, పెసరట్టు,అన్నం దేనికైనా అదిరిపోయే అల్లం మామిడి పచ్చడి..ప్లేట్లు ప్లేట్లు ఖాళీ చేస్తారు! -
తెలియని వ్యక్తులతో చాటింగ్ చేస్తున్నారా? హనీ ట్రాప్ ముఠాల వలలో పడితే జీవితమే నాశనం! -
బిర్యానీని మించిన రుచితో మటన్ కీమా రైస్.. ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టరు! -
వృషభం, కర్కాటక, సింహ రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 20 నుండి 26 మే 2026 వరకు -
రెస్టారెంట్ స్టైల్ మటర్ పనీర్ ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు లొట్టలేసుకుంటారు -
గ్రహాల కదలికలతో ఈ రాశుల వారికి నేడు అదృష్టం..అనుకోని ధనలాభం ఖాయం!
పరికరాలు లేని సిక్స్ ప్యాక్ వ్యాయామాలు!
ఆరోగ్యం కొరకు వ్యాయామాలు చేయాలంటే...జిమ్ కు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటిలోనే ప్రతిరోజూ చేసి ఆరోగ్యం పొందవచ్చు. కాని కొంతమంది వ్యాయామాలు అంటే వివిధ రకాల పరికరాలు ఉండాలని భావిస్తారు. వాటిపై ఎంతో వ్యయం చేస్తారు. కాని ఏ పరికరం లేకుండానే కూడా ఇంటి వద్ద వ్యాయామాలు చేసి బరువు తగ్గవచ్చు. శారీరక ఫిట్ నెస్ తేలికగా పొందవచ్చు. మరి పరికరాలు లేని వ్యాయామం ఎలా?

పుష్ అప్ లు - సాధారణంగా పుష్ అప్ లను పురుషులు ఇష్టపడతారు. చిన్నవయసు వారు తమ శారీరక సౌష్టత కొరకు వీటిని రెగ్యులర్ గా చేస్తారు. యువతులు సైతం తమ శరీర పై భాగం అంటే వక్షోజాలు బాగా పెరిగి ఆకర్షణీయంగా కనపడాలని వీటిని చేస్తారు. శరీర పై భాగ కండరాలు బలపడి మంచి ఆకారం సంతరించుకోవటానికి ఇంటిలోనే తేలికైన వ్యాయామాలు చేయవచ్చు. పుష్ అప్ లు ఛాతీ, చేతి కండరాలకు బాగా పని చేస్తాయి. పుష్ అప్ లు గోడకు చేతులు ఆనించి కూడా చేయవచ్చు. ఏ సమయంలో అయినా చేయవచ్చు. అయితే మీ పొట్ట ఖాళీగా ఉండే సమయంలో చేయాలి.
బస్కీలు తీయటం - బస్కీలు తీయటం అంత తేలికైన వ్యాయామం మరొకటి లేదు. కూర్చొనటం, పైకి లేవటం వేగంగా చేయాలి. ప్రతిరోజూ చేసే ఈ వ్యాయామాలు మీశరీరంలోని అధిక బరువును తొలగిస్తాయి. కాళ్ళకు, తొడ భాగాలకు, నడుముకు ఎంతో బలం చేకూరుతుంది. ఈ వ్యాయామం చేయటానికి ఏ పరికరాలు అవసరం లేదు. పొట్ట, తొడలు, నడుము మంచి షేప్ లోకి వచ్చేస్తాయి.
కాళ్ళు పైకి ఎత్తుట - వెల్లకిలా పడుకొని నడుము భాగం వరకు మీ కాళ్ళను వర్టికల్ గా గాలిలోకి పైకి లేపండి. మరల కిందకు దించండి. ఈ వ్యాయామం మీ కాళ్ళకు చక్కటి రక్తప్రసరణ కలిగిస్తుంది. నడుము భాగం, పొట్ట బాగా బలపడతాయి.కాళ్ళను తిన్నగా పైకి లేపటం కష్టమనిపిస్తే, మోకాళ్ళ వరకు వంచి పైకి లేపండి. కొద్ది సెకండ్లు దానిని నిలిపి ఉంచండి. మరల క్రిందకు దించి రిలాక్స్ అవండిప ఈ వ్యాయామం పది లేదా పదిహేను నిమిషాలపాటు ప్రతిరోజూ చేస్తే శారీరక ఫిట్ నెస్ చాలా బాగుంటుంది. పొట్ట కండరాలు బలపడి స్లిమ్ అయిపోతారు.
మెట్లు ఎక్కుట - ప్రతిరోజూ మెట్లు ఎక్కటం లేదా దిగటం వంటివి మనం చేసే పనే. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మెట్లు ఎక్కండి లేదా దిగండి. మీ జాయింట్ నొప్పులు తగ్గి అవి బలపడతాయి. భవిష్యత్తులో కీళ్ళు అరిగిపోయే సమస్య ఉండదు. రక్త ప్రసరణ బాగా జరిగి గుండె వేగంగా కొట్టుకొని ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి.
పొట్ట వ్యాయామాలు - సిక్స్ ప్యాక్ కొరకు ప్రయత్నిస్తున్నారా? ఏ పరికరం దానికి అవసరం లేదు. వెల్లకిలా పడుకోండి. మీ మోకాళ్ళను తీసుకు వచ్చి ఛాతీ భాగానికి తగిలించి వీలైనంత మేరకు పొట్టను ఒత్తండి. ఈ వ్యాయామంలో మీ పొట్ట, తొడ భాగాలు, వెన్నెముక, చేతులు ఎంతో బలపడతాయి.
జిమ్ కు వెళ్ళి ఎంతో సొమ్ము వ్యయం చేయకుండా, ఇంటిలోనే ఏ పరికరం లేకుండా, ఈ వ్యాయామాలు చేసి మీ శారీరక సౌష్టవం కాపాడుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications