Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నాజూగ్గా తయారవ్వాలంటే ఫ్యాట్ లెస్ ఆహరం తినాల్సిందే..!

తేనె: పంచదారతో పోలిస్తే తేనెలో కెలొరీలు అధికంగా ఉన్నా..వేడినీటితో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకొన్న కొవ్వు కరుగుతుంది. క్రమంగా బరువూ తగ్గుతాం. అలాగే తేనె, నిమ్మరసం, దాల్చిన చెక్క...కలిపి తీసుకోవడం వల్ల శరీర బరువులో ఎంతో తేడా ఉంటుంది. ఊబకాయం ఉన్నవారు వంటకాల్లో బెల్లం, పంచదారకు బదులు తేనెను వాడితే మంచిది. అందుకు గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచా తేనె, కలిపి పరకడుపున తీసుకుంటే ఎంతో మార్పు ఉంటుంది.
గుడ్లు: శరీరానికి అవసరైన పోషకాలే కాదు..ఇందులోని విటమిన్ బి12’ కొవ్వు కారకాలతో పోరాడుతుంది. ఫలితంగా కొవ్వు కరిగిస్తుంది.
గ్రీన్ టీ: అధికబరువు తగ్గేందుకు ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకునేవారు గ్రీన్ టీ తప్పనిసరిగా తాగాలి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. శరీరంలో అధికకెలోరీలను తగ్గించడమే కాదు. దృడమైన ఆరోగ్యాన్నీ అందిస్తుంది ఈ గ్రీన్ టీ.
మొలకెత్తిన పెసలు: వీటిలో ఎ, బి, సి, ఇ, విటమిన్లు ఖనిజ లవణాలు, క్యాల్షియం, ఇనుము, పొటాషియం..మాంసకృత్తులు, పీచు..వంటివెన్నో పోషకాలు లభిస్తాయి. కొవ్వును కరిగించడంతోపాటు..శరీర బరువును అదుపులో ఉంచుతాయి. అలాగే చాలా త్వరగా జీర్ణమవుతాయి కూడా. పైగా వీటిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది. అందుకే వీటిని రోజూ తీసుకోవాలి.
క్యాబేజీ: ఉడికించిన క్యాబేజీలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉంటుంది. తరచూ క్యాబేజీ తినడం వల్ల శరీరంలో ఫ్రీరాడికల్స్ చేరవు. కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదమూ తగ్గుతుంది. కండరాల దృఢత్వమూ పొంతమవుతుంది. రక్తాన్నీ శుద్దిచేయడం..కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడం..ఇలా శరీరానికి ఎన్నో విధాల మేలు చేస్తుందీ క్యాబేజీ.
క్యారెట్: క్యారెట్ శరీరంలోని చెడుకొవ్వునిల్వలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కొలెస్ట్రాల్ శాతం అదుపులో ఉంచుతుంది. పీచుపదార్థాన్ని అందించే ఈ కాయగూరను వారంలో ఎక్కువసార్తు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు నేరుగా తినే ప్రయత్నం చేయాలి.
కరివేపాకు: కొవ్వు శాతాన్ని తగ్గించడమే కాదు..అదనంగా పేరుకోకుండా చేసే శక్తి కరివేపాకు రెమ్మల సొంతం. శరీరంలోని వ్యర్థాలనూ బయటకు పంపివేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ నూ కరిగిస్తుంది. అందుకే ఊబకాయంతో బాధపడేవారు రోజు కరివేపాకును ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా తీసుకోవాలి.
పసుపు: వంటకాల్లో ప్రతి నిత్యం వేసే చిటికెడు పసుపుతో కలిగే మేలు అంతా ఇంతా కాదు. యాంటీబ్యాక్టీరియల్ సుగుణాలున్న పసుపుతో శరీరంలో నిల్వ ఉన్న వ్యర్థ కొవ్వు కరుగుతుంది. అదనంగా కొన్ని రకాల క్యాన్సర్ల తీవ్రతను తగ్గించే గుణం పసుపుకే సొంతం. కాలేయంలో చేరిన వ్యర్దపదార్థాలను వెలుపలికి పంపించివేస్తుంది. రక్తనాళాల్లో రక్తప్రసరణ వేగవంతం అయ్యేందుకు తోడ్పడుతుంది. దాంతో గుండె ఆరోగ్యానికీ మేలు జరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications