Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
అతివల అందాలు పెంచే ఆహారాలు!

మన శరీరం సాధారణంగా కేలరీలు ఎంత తీసుకోవాలి? ఎంత వ్యయం చేయాలి అనేది బేలన్స్ చేస్తూనే వుంటుంది. అయితే, ఈ బేలన్స్ తిరగబడితే, బరువు తగ్గటం లేదా బరువు పెరగటం వంటివి ఏర్పడతాయి. కనుక బరువు తగ్గటం లేదా పెరగటం అధికంగా మీ శారీరక శ్రమ, ఆహారం తినటం పై ఆధారపడివుంటాయి. బరువున్నవారిలో కొవ్వు, కార్బోహైడ్రేట్లు అధికం. వీరు శరీరంలోని కొవ్వు కార్బోహైడ్రేట్ల నిల్వలు ఖర్చు చేయాలి. కననుక, వారి ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వు తక్కువగా వుండాలి. వారు అధికంగా పీచు, ప్రొటీన్లు కల ఆహారాలు తింటూ ఆకలిని నియంత్రించుకోవాలి.
బరువు తగ్గి, అందంగా కనపడాలంటే, పండ్లు, కూరగాయలు, ఓట్స్, గింజధాన్యాలు, కార్బోహైడ్రేట్లు సమపాళ్ళలో వుండా ఆహారాలు తినాలి. తినేటపుడు బాగా నమిలి తినాలి, ప్రతి మూడు లేదా నాలుగు గంటలకు కొద్ది మొత్తంలో తినాలి. ప్రతిరోజూ పాల సంబంధిత ఉత్పత్తులను తినాలి. ప్రతిరోజూ ఎనిమిది నుండి పది గ్లాసుల నీరు తాగాలి. ఆరోగ్యంగాను,చురుకుగాను వుండే వారిలో కొన్ని విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ల ప్రధాన పాత్ర తప్పక వుంటుంది.
కొన్ని ప్రత్యేక ఆహారాలు తప్పక తినాలి లేదా ఇంతవరకు మీరు తినేవాటి స్ధానంలో తినాలి. కాఫీ, టీలను మానండి. వాటికి బదులుగా మజ్జిగ, గ్రీన్ టీ వంటివి తీసుకోండి. విటమిన్ ఇ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిట్లు వున్న కారణంగా బాదం పప్పులు, చేప నూనె మీ చర్మాన్ని చిన్న వయసులా కనపడేలా చేస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications