Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
మహిళల హార్మోన్ సమస్యలకు ఆహారాలు!

హార్మోన్ సమస్యలకు ఆహారాలు -
1. బహిష్టు నొప్పులకు కాల్షియం - మహిళ బహిష్టు నొప్పులకు అనేక కారణాలుంటాయి. ప్రధాన కారణం అంటే, గర్భా శయంలో గోడలు విఛ్చిన్నం అయ్యే సమయంలో కలిగే కండరాల సంకోచ వ్యాకోచాలు అని చెప్పాలి. ఈ సమయంలో ప్రొస్టాగ్లాండిన్స్ అనే రసాయనం ఈ విచ్ఛిన్నంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. దీనికి మందుగా మీరు కాల్షియం అధికంగా వుండే ఆహారాలు తీసుకొని మీ నొప్పులను సగం మేరకు తగ్గించుకోవచ్చు. పాలు, పెరుగు, వెన్న, జున్ను వంటి కాల్షియం ఆధారిత ఆహారాలు, మీ గర్భాశయ కండరాలను నొప్పి లేకుండా నివారిస్తాయి.
2. రక్తస్రావం అధికంగా ఉంటే ఐరన్ - మహిళలకు తమ రుతుస్రావ సమయంలో కొన్ని సార్లు అధికంగా రక్తస్రావం అయిపోతుంది. ఈ అధిక రక్తస్రావం ఆమెలో ఐరన్ బాగా తగ్గినట్లు సూచిస్తుంది. హారన్మోన్ లెవెల్ పెరిగిన కారణంగా గర్భాశయంలో గడ్డలు ఏర్పడి కూడా అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. ఇపుడు అధికంగా రక్తం పోవటం మరింత ఐరన్ బయటకు పోయేట్లు చేస్తుంది. కనుక, ఐరన్ అధికంగా ఉండే, రెడ్ మీట్, చికెన్, గుడ్లు, పచ్చటి ఆకు కూరలు తినండి. కొద్ది నెలలు గడిస్తే, మీ బ్లీడింగ్ సాధారణ స్ధితికి వచ్చేస్తుంది.
3. శరీర ఉష్ణోగ్రతల మార్పుకు ఆహారాలు - మీరు కనుక మెనోపాజ్ దశకు చేరుతూంటే, పిరియడ్స్ సరిగా రావు. ఆ సమయంలో మీలోఉష్ణోగ్రతలను నియంత్రించే ఈస్ట్రోజన్ హార్మోన్ స్ధాయి నియంత్రణ తీవ్ర హెచ్చు తగ్గులకు లోనవుతుంది. ఫలితంగా, మీ శరీరంలో ఎంతో వేడి పుట్టి విపరీత ఉష్ణం పెరుగుతుంది. ఈ సమయంలో ఏం చేయాలి? మేయో క్లినిక్ నిపుణుల మేరకు మెనో పాజ్ దశకు ముందుగా మహిళలు ప్రతిరోజూ కొన్ని అవిసె గింజలు కనుక తింటే, ఈ హార్మోన్ సమస్య 66 శాతం తగ్గుతుందని తెలుస్తోంది.
4. నోరూరించే బంగాళ దుంప కుర్మా - చికాకు, కోపం, వంటి మనో భావనలు ఈ సమయంలో కలిగి ఉన్నారా? అలాగయితే, మూడ్ మార్చే ఆహారం బంగాళ దుంప బాగా ఉడికించి మీకిష్టమైన రీతిలో తినేయండి. ఇందులోని పదార్ధాలు మీ బ్రెయిన్ కి అవసరమైన సెరోటోనిన్ హార్మోన్ అందిస్తాయి. ఈ సమయంలో బ్రెయిన్ లో కనుక సెరోటోనిన్ తయారు కాకుంటే ఈ రకమైన మూడ్ స్వింగ్స్ వస్తాయి. బంగాళ దుంపలలో ఉండే ఎమినో యాసిడ్ సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి బాగా పనిచేస్తుంది. మసాఛూసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్ధ నిపుణుల మేరకు మంచి రుచిగల బంగాళ దుంపల కూర్మా, ఉడికించినది, లేదా వేయించినది, మిమ్మల్ని ఈ రకమైన ఆందోళన నుండి పది నిమిషాలలో బయటపడేస్తుంది. సాధారణంగా బంగాళ దుంప కూర్మా ఇష్టపడని వారుండరు. కనుక మీకు ఈ సమస్య వచ్చినపుడు ఇష్టమైన బంగాళ దుంప కూర వండుకు తిని ఆనందించేయండి.
మీలోని హార్మోన్ సమస్యలకు సహజంగా పరిష్కారం కొరకు ఈ సహజ ఆహారాలు తినండి. వచ్చే నెల పిరియడ్ నాటికి వీటిని మీ రిఫ్రిజిరేటర్ లో రెడీగా ఉంచుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications