Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
కొవ్వు తక్కువ ...రుచి అధికం కల ఆహారాలు!

మీ మెనులో చేర్చదగిన ఈ క్రింది సహజ ఆహారాలను తప్పక మీకిష్టమైనవిగా తీసుకోండి.
టోఫు - టోఫు తయారీలో రుచి లేని కాటేజ్ ఛీజ్ వేయనవసరంలేదు. టోఫు కనుక చైనీయుల పద్ధతిలో సాస్, మరియు మసాలాలు వేసి ఎంతో రుచికరమైన వంటకంగా చేయవచ్చు. టోఫులో కొవ్వు తక్కువ, పీచు, ప్రొటీన్లు, కాల్షియం, కార్బోహైడ్రేట్లు అధికం. ఎనర్జీ పెంచుతుంది. దీనిని పెరుగుతో కలిపి ఉదయంవేళ తింటే, రోజంతా చురుకుగా వుంటుంది.
గోధుమ పస్తా - ఎంతో రుచికల ఈ ఇటాలియన్ వంటకం పస్తా. ఇది కొవ్వుని ఇస్తుందని మానటం కన్నా గోధుమలతో తయారు చేయండి. చాలా ఆరోగ్యం, కొవ్వు తక్కువ. బరువెక్కుతామన్న భయం లేకుండా ఎంతైనా తినేయవచ్చు.
గింజధాన్యాల బిస్కట్లు - బిస్కట్లు లేకుండా...కాఫీలు టీలు తాగలేము. మరి గింజధాన్యాల బిస్కట్లు మీకు చాలా సమయం ఆకలిలేకుండా చేస్తాయి. నేడు మార్కెట్లలో, క్రీమ్ బిస్కట్లకంటే కూడా గింజధాన్యాల బిస్కట్లు విరివిగా దొరుకుతున్నాయి. వీటిని తిని మంచి పోషణ కలిగి వుండండి.
ఉడికించిన బంగాళదుంపలు - బంగాళదుంప వేపుడు అంటే అందరికి ఇష్టమే. వేపుడు హాని కలిగిస్తుంది. కనుక ఉడికించండి. కట్లెట్, క్యూబ్, మొదలైనవి తయారు చేసి సైడ్ డిష్ గా కూడా తినవచ్చు. నూనెలో వేయించేకంటే, ఉడికించి తినండి. బరువు తగ్గాలనుకునేవారు సాయంత్రంవేళ స్నాక్స్ గా ఉడికించిన బంగాళ దుంప తినవచ్చు.
బెల్లం తో స్వీట్లు -ఏ వంటకానికైనా తీపి కావాలనుకుంటే, షుగర్ బదులుగా బెల్లం వాడవచ్చు. బెల్లంలో కార్బోహైడ్రేట్లు, మినరల్స్, ఐరన్ వుంటాయి. జీర్ణ క్రియ మెరుగుపరుస్తుంది. శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. బ్లడ్ షుగర్ గురించి ఆందోళన చెందే షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా బెల్లం స్వీట్ అపుడపుడూ తినవచ్చు.
జొన్నపొత్తులలో తేనె - జొన్న పొత్తులు కొవ్వు తక్కువ, పోషకాలు అధికం కలిగి వుంటాయి. ఉదయం బ్రేక్ ఫా్ట్ గా వీటిలో తేనె కలిపి తింటే, మీకు కావలసిన విటమిన్లు, మినరల్స్ తేలికగా అందుతాయి. కనుక తక్కువ కొవ్వు వుండే బ్రేక్ ఫాస్ట్ గా తేనె కలిపిన జొన్న పొత్తులు తినండి.
కొవ్వు అధికంగా వుండే ఆహారాలు తిని మందులు మింగేకంటే, కొవ్వు లేని ఈ ఆహారాలను తింటూ ఆనందించండి. చక్కని శారీరక రూపం కలిగి వుండండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications