Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
మతిమరపు తగ్గాలంటే తినాల్సిన ఆహారాలు!

చాక్లెట్ లు - చాక్లెట్ వంటి ఆహారాలు ఎపుడూ తినటానికి ఆనందంగానే వుంటాయి. చాక్లెట్ లు మీ బ్రెయిన్ పవర్ ను పెంచుతాయని రీసెర్చి చెపుతోంది. ప్రతిరోజూ ఒక చాక్లెట్ తింటే అది వయసు పైబడినందువలన వచ్చే మీ మతిమరపుపై సమర్ధవంతంగా పోరాడుతుంది. చాక్లెట్ లలో పాలీఫెనాల్స్ వుంటాయి. అవి మీలోని రక్తప్రసరణను బ్రెయిన్ దిశగా అధికం చేస్తాయి. అయితే, ప్రతిరోజూ పెద్ద చాక్లెట్ వంటివి తినకండి. బ్రెయిన్ బాగా పనిచేయాలంటే రోజూ 10 గ్రాముల చాక్లెట్ లంచంగా పెడితే చాలు ఇక ఏం చెప్పినా మీకు అది విషయాలన్నీ గుర్తుండిపోయేలా చేస్తుంది.
బ్లాక్ బెర్రీలు - బ్లాక్ బెర్రీ అంటే ఫోన్ అనుకునేరు సుమా? కాదు. నల్లటి బెర్రీలు తింటే, మీ కన్నీ గుర్తుంటాయి. మీ శరీరంలో కణాలు ప్రతి ఒక్కటి కూడా దేనికదే. ఒకదానితో మరొకటి మాట్లాడుకుంటూ వుంటాయి ఇవి తింటే. మాట్లాడుకుని చివరకు బ్రెయిన్ కు చేరవేస్తాయి. వయసు పెరిగితే ఈ ఈ ప్రక్రియ బ్రెయిన్ కు చేరేసరికి ఆలస్యమవుతుంది బ్లాక్ బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. అవి మీరు త్వరితంగా అవగాహన చేసుకునేందుకు తోడ్పడతాయి. మరి మధ్యాహ్నం అయ్యే సరికి స్నాక్స్ గా బ్లాక్ బెర్రీలు తింటే, శరీరమంతా సమాచార విస్తరణ బాగా జరుగుతుంది.
ఆలివ్ ఆయిల్ - ఆలివ్ ఆయిల్ మీ చర్మానికి ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలిస్తుంది. అదే మాదిరి మీ బ్రెయిన్ కి కూడాను. అల్జీమర్స్ వ్యాధికి వ్యతిరేకంగా బ్రెయిన్ సెల్స్ లో పనిచేస్తుంది. మతిమరపు రాకుండా తోడ్పడుతుంది. కనుక మీ వంటనూనెను ఆలివ్ నూనె కు నేడే మార్చి వేయండి.
బీట్ రూట్ - ఎర్రగా వుంటే బీట్ రూట్ మతిమరపు తగ్గించేందుకు బాగా పనిచేస్తుంది. అయితే మనలో చాలామంది బీట్ రూట్ తినటానికి ఇష్టపడరు. దీనిలోని నైట్రేట్స్ మీ రక్తనాళాలను బాగా తెరిచి అధిక ఆక్సిజన్ అందేలా చేస్తాయి. రక్తాన్ని బ్రెయిన్ కు బాగా పంపుతాయి. కనుక తియ్యగా వుండే బీట్ రూట్ ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తినండి లేదా జ్యూస్ తాగండి. రుచి మీకు నచ్చకుంటే, కొద్దిగా నిమ్మరసం, మిరియం వంటివి వేసి రుచిగా తాగండి. బ్రెయిన్ పవర్ పెంచుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications