Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అనారోగ్యం దూరం చేసే పండ్లు, కాయలు!

కివి పళ్లు - కివిలో చెక్కర శాతం అధికంగా ఉంటుంది.ఇందులో ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. విటమిస్ ‘సి’ అధికం. కివీ పళ్ల ను మీ ఆహారంలో భా గం చేసుకుంటే మీ శరీరంలో షుగర్ శాతం అదుపులో ఉండటమేకాకుండా...మీలో నూతనోత్సాహం, శక్తి తిరిగి సంతరించుకుంటుంది.
పుచ్చ పండు - పుచ్చ పండులో ఉన్నన్ని నీళ్ళు మరే పండులోగాని, కాయలోగాని లేవు. పుచ్చకాయలో పొటాషియం ఎక్కువ ఉన్నది కాబట్టి మూత్రపిండాలు పనిచేయకుండా ఉన్నవారు పుచ్చకాయలు తినరాదు. కానీ మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారు మూత్రపిండాలలో, మూత్రకోశంలో చిన్న చిన్న రాళ్లు ఉన్నవారికి పుచ్చకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు పుచ్చకాయ రసంలో...స్పూన్ తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులు తగ్గిపోతాయి. వేసవిలో అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలు తగ్గాలంటే పుచ్చకాయ నివారిస్తుంది. అన్ని రకాల జ్వరాలలో, పుచ్చకాయ రసంలో తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి రోగికి స్వస్ధత చేకూరుతుంది. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం పోతుంది.
కొబ్బరి, కొబ్బరి నూనె - కొబ్బరి మాత్రమే కాదు, కొబ్బరి నూనె కూడా ఒక మంచి ఆహారమే. కేరళ రాష్ట్రంలో వంటలలో సైతం కొబ్బరి నూనె వినియోగిస్తారు. కొబ్బరి నూనెను మనం తరతారాలుగా తలపై పెట్టుకుంటున్నాం. కానీ తిండి పదార్థంగా వినియోగించము. నిజానికి కొబ్బరినూనెలో మంచి పోషక విలువలుంటాయి. థైరాయిడ్ పనితీరును మెరుగు పరచడానికి కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది. కొవ్వుని తగ్గించడాకి సహాయ పడుతుంది. మరి దీన్ని అలవాటు లేనివారు వినియోగించడం ఎలా అని ఆలోచిస్తున్నారా? మీరు తినే ఆహార పదార్థంపైన కొద్దిపాటిగా అలా అలా చిలకరించి టచ్ ఇవ్వండి అంతే. కొద్ది రోజులలో కొబ్బరి నూనెతో తయారు చేసే పిండివంటలకు సైతం అలవాటు పడతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications