Latest Updates
-
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి
మధ్యాహ్నం చిరుతిండితో ఆరోగ్యం!
నేటి రోజులలో కార్యాలయాలలో ఉద్యోగాలు చేస్తున్నవారైనా సరే, లేదా కాలేజీలకు వెళ్ళే విద్యార్ధులైనా సరే లేదా, ఇంటిపని అంతా చేసుకునే మహిళలు, లేదా ఇతర వ్యాపారస్తులు ఎవరైనప్పటికి, పగటి పూట సమయం దొరకటం చాలా కష్టమైపోతోంది. అందులోనూ బయట తిరిగే వారికి, ఆహారం కొరకు కొంత దూరం కూడా వెళ్ళి రావలసి వస్తుంది. దానితో సమయం చాలా వృధా అయ్యే అవకాశం వుంటుంది. అటువంటపుడు మనం సాధారణంగా అనారోగ్యాలు కలిగించే చిప్స్, కుక్కీలు, కేకులు లేదా వేపుడు ఆహారాలు వంటివి తీసుకుంటూ అవసరాలు తీర్చేసుకుంటాం.

మధ్యాహ్నం అయ్యే సరికి మనలోని ఎనర్జీ స్ధాయిలు తగ్గిపోతాయి. పనిపై శ్రధ్ధ పెట్టలేము. అటువంటపుడు మరోమారు శక్తి పుంజుకోవాలంటే, మన శరీరానికి ఆహారం అందించాలని పోషకాహార నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా తెలుపుతూనే వుంటారు. కాని మనం మాత్రం ఒకవైపు ఆకలి మరోవైపు, మన డైటింగ్ వంటి ఆహార ప్రణాళికలు వాటితో ఏది ఆరోగ్యం ఏది కాదు అంటూ ఇబ్బందులు పడుతూంటాం. కనుక మధ్యాహ్నం వేళ ఏ ఆహారం పడితే అది తినకుండా, తేలికగా మంచి పోషకాహారాలు కలిగి, ఆరోగ్యాన్నిచ్చే ఆహారాలు తీసుకోవాలి. ఆ తినేది తేలికగా మీకు జీర్ణం అయి మీ పనిలో ఏకాగ్రతనిచ్చేదిగా వుండాలి. అటువంటి ఆహారాలు ఏమిటో పరిశీలిద్దాం.
1. తేలికగా తినేయదగిన ఫ్రూట్ సలాడ్ - పండ్లు మనకు గరిష్ట ప్రయోజనం ఇస్తాయి. మంచి పోషక విలువలు కలిగి తక్కువ కేలరీలతో వుంటాయి. కనుక మధ్యాహ్నం అయ్యే సరికి, రెండు లేదా మూడు రకాల పండ్లు మీ వద్దే వుంచుకోండి. ఆఫీస్ లేదా కాలేజ్ ఎక్కడున్నా సరే, మీ పాకెట్ నైఫ్ తో వాటిని కోసుకొని తినేయండి. యాపిల్, అరటిపండు, పియర్స్, ఆరెంజస్ వంటివి తినవచ్చు. కొద్దిపాటి ఉప్పు, మిరియం పొడి కూడా వుంచుకుంటే, మీ సలాడ్ అద్భుత రుచినిస్తుంది. లేదా వాటిపై కొద్దిగా తేనె వేసి తియ్యగా తినేయండి. తేనె మీకు మంచి బలాన్ని కూడా ఇస్తుంది.
2. కేరట్, దోస ముక్కలు - కేరట్లు, దోసకాయ ముక్కలు ముందు రోజు రాత్రే మీరు కోసి ఫ్రిజ్ లో పెట్టి ఉంచుకోండి. మరుసటి రోజు మీరు వాటిని తీసుకొచ్చి ఎక్కడైనా సరే తినేయవచ్చు. కొద్దిపాటి, పెరుగు లేదా తేనె, లేదా సాల్ట్, పెప్పర్ వంటివి కూడా మీ వద్ద వుంచుకొని మీరు తినే కేరట్ దోస ముక్కలకు కలపి తినండి. చక్కటి ఆరోగ్యకరమైన ఆహారం తిన్నట్లు వుంటుంది.
3. కర కర మనే పాప్ కార్న్ - తినటం ఎంతో తేలిక, చూపులకు ఎంతో హాయినిచ్చే పాప్ కార్న్ ఇష్టపడనివారుండరు. ఎపుడూ మీరు స్టాక్ పెట్టుకోండి. దీనికి వెన్న లేదా తీపి కలిపి తింటే చాలా బాగుంటుంది. పాప్ కార్న్ పై సహజమైన సుగంధ ద్రవ్యాలు లేదా మసాలా వంటివి చల్లి తిన్నా బాగుంటుంది.
4. డ్రై ఫ్రూట్స్ - బాదం, పిస్తా, వాల్ నట్ వంటి ఎండు ఫలాలు ఎంతో బలంగాను ఆరోగ్యంగాను వుంటాయి. తేనె అందుబాటులో వుంచుకోండి కలిపి తింటే, మధ్యాహ్నం స్నాక్స్ మీకు తేలికగా తిన్నట్లే.
5. గింజధాన్యాల బిస్కట్లు - గడ్డ పెరుగులో బిస్కట్లు ముంచుకొని లేదా పెరుగులో దోస ముక్కలు వంటివి ముంచుకొని తినేయండి. పెరుగు కడుపు నింపుతుంది. ఆరోగ్యాన్నిస్తుంది.
6. ఓట్లు, మరియు పెరుగు - చక్కని రుచిగల ఆహారాలలో పెరుగులో ముంచిన ఓట్లు చాలా బాగుంటాయి. చేయటం తేలిక, కడుపు నిండిపోతుంది.
తేలికగా తయారు చేసుకోగల ఈ ఆహారాలను మీకు అధిక సమయం లేనపుడు, మధ్యాహ్నం వేళ తిని ఆరోగ్యాన్ని పొందండి. సమయం ఆదా చేసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications