Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
దగ్గు, జలుబు, జ్వరం లకు ఇంటి పరిష్కారం?

ఈ మొక్కనుండి తీసిన విత్తనాలను ధనియాలు అంటారు. ధనియాలను కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకు వాడతారు. ధనియాల కషాయం దగ్గు, జలుబుల కు చికిత్సగా మంచి పరిష్కారంగా ఆయుర్వేద వైద్యులు సూచిస్తారు. కొత్తిమీర వాసన ఎంతో బాగుంటుంది. పచ్చని, ఆకులు, పచ్చని పండ్లతో వుంటుంది అవి పక్వానికి వస్తే గోధుమరంగులోకి తిరుగుతాయి. ఈ మొక్క మెడిటర్నేనియన్ ప్రాంతంనుండి మన దేశానికి వచ్చింది. సాధారణంగా కొత్తిమీర, ఉష్ణ ప్రదేశాలలోని నల్ల రేగడినేలలో బాగా పెరుగుతుంది.
కొత్తిమీర ఆకులలో ప్రొటీన్లు, కొవ్వు, మినరల్స్, పీచు, కార్బోహైడ్రేట్లు, నీరు వుంటాయి. మినరల్స్, విటమిన్లు పరిశీలిస్తే వాటిలో విటమిన్ సి, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటీన్, ధయామైన్, రిబోఫ్లావిన్, నయాసిన్, సోడియం, పొటాషియం, ఆక్సాలిక్ యాసిడ్ లు వుంటాయి. కొత్తిమీర ఆకు ఎంతో ఉత్తేజాన్నిస్తుంది. టానిక్ ల వలే పనిచేస్తుంది. అవి పొట్ట గడబిడను దూరం చేస్తాయి. బలపరుస్తాయి. మంచి జీర్ణక్రియకు తోడ్పడతాయి.
మూత్ర సంబంధిత సమస్యలు, జ్వరం, వంటి వాటికి చికిత్సలో ఈ ఆకులను వాడవచ్చు. అంతేకాదు, మంచి కామోద్రేకాలు కలగాలంటే కూడా కొత్తిమీర ఆకులు, ధనియాలు వంటివి వాడతారు. సాధారణంగా చలికాలంలో శ్వాస కోశం, ఊపిరితిత్తులలో ఏర్పడే కళ్ళె కొత్తిమీర ఆకుల వాడకంతో తగ్గించుకోవచ్చు. ధనియాలు కషాయంగా వాడి, దగ్గు, జలుబు, జ్వరం వంటివి తగ్గించి శరీరానికి మంచి చల్లదన్నాన్ని కలిగించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications