Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆరోగ్య ప్రయోజనాలిచ్చే ఆకుకూర విలువలు!

మెంతికూరలో అతి విలువైన పోషకాలు వుంటాయి. మనదేశంలో మెంతులకంటే కూడా మెంతికూరను అధికంగా ఆహారంలో ఉపయోగిస్తారు. మనం దీనిని ఒక ఔషధంగా కూడా పరిగణిస్తాము. మెంతులను సువాసనా ద్రవ్యంగా పోపుల పెట్టె మసాలా దినుసులలో ఒకటిగా ఉపయోగిస్తాము. ఇక పచ్చటి మెంతి కూర ఆకు ఎంతో రుచికరంగాను ఔషధ విలువలు చేకూర్చేదిగాను వుంటుంది. ఈ ఆకులను ఎండబెట్టి కూడా కొన్ని ఆహార పదార్ధాలలో వాడవచ్చు. ఎండిన ఆకులుసైతం ఎంతో మేలు చేస్తాయి. తాజా మెంతి కూర కొద్దిపాటి చేదు వుంటుంది. దీనిని కందిపప్పుతో ఉడికించి మెంతికూర పప్పుగా కూడా తయారు చేస్తారు. గోంగూర ఆకు ఉడికించే రీతిలోనే దీనిని కూడా ఉడికించవచ్చు. మెంతి పరోటాలు రుచికరంగా వుంటాయి.
మెంతికూరలో అత్యధిక ఐరన్ వుంటుంది. అందుకనే మెంతి కూరను లేదా మెంతులను రక్తహీనత వున్న రోగులకు ఔషధపరంగా అధికంగా వాడతారు. తాజా మెంతికూర ఆకును జ్యూస్ గా తయారు చేసి ఉదయం వేళ తాగితే షుగర్ వ్యాధి వారికవసరమైన ఇన్సులిన్ నియంత్రణగా పనిచేస్తుంది. ఇది కాకరకాయ రసం వలే చేదుగా వున్నప్పటికి షుగర్ వ్యాధి నియంత్రణకు మంచి ఫలితాలనిస్తుంది. మెంతికూర....ఇతర ఆకుకూరలతోపాటు మార్కెట్లలో తేలికగానే లభ్యమవుతుంది. దీని ఖరీదు కూడా తక్కువగానే వుంటుంది. మహిళలకు ఈ ఆకుకూరతో వివిధ రకాల డిషిస్ చేయటం కూడా తేలికే.
గోంగూర వలే మెంతిలో కూడా విటమిన్ కె అధికంగా వుంటుంది. శరీరానికవసరమైన పీచు పదార్ధాలు కూడా ఇందులో వుంటాయి. కనుక మలబద్ధకం కలవారు మెంతికూర లేదా రసం తీసుకుంటే సమస్య తొలగిపోతుంది. మెంతి లో ప్రొటీన్లు, నికోటినిక్ యాసిడ్ కూడా వుంటాయి. ఇవి వెంట్రుకల చక్కటి ఎదుగుదలకు తోడ్పడతాయి. కనుక, కేశ సౌందర్యం కొరే మహిళలకు ఈ ఆకుకూర ఒక వరంగా భావించాలి. మెంతిని ఏ రూపంలో వాడినప్పటికి అది ఇచ్చే ప్రయోజనాలు అత్యధికమనే చెప్పాలి.
పచ్చటి ఆకు కూరలు, పండ్ల తర్వాత, కూరగాయల తర్వాత, అధిక ప్రయోజనాలు ఇస్తాయి. తాజాగా లభ్యమవుతాయి. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఇవి మరింత అందుబాటులో వుంటాయి. మంచి పోషకాహారాలు మనం తినే ఆహారాలలో వుండాలంటే, మెంతి, తోటకూర, గోంగూర, బచ్చలికూర, పుదీనా, కరివేపాకు వంటి ఆకు కూరలను కూడా తప్పక చేర్చాలి. ఆకు కూరలను పెరటి గార్డెన్ లో పెంచటం కూడా తేలికే. సాధారణంగా గింజలు చల్లితే, అతి త్వరగా మొక్క ఎదిగి, ఆకులు ప్రతి రోజూ వంటలలో ఉపయోగించే అవకాశం వుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications