Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆరోగ్యకరమైన ఆహారాలు!

మొక్కలనుండి లభించే ఆహారం.2000 జాతుల వరకు పంటల రూపంలో వివిధ దేశాలలో రైతులు ఆహరం కోసం పండిస్తున్నారు. చాలావరకు గింజలు వివిధ రూపాలలో ఆహారంగా ఉపయోగపడతాయి. కారణం చెట్లకు మొలక దశలో కావలసిన ఆహాం విత్తనాలలో సంక్షిప్తం అయి ఉంటుంది కనుక వీటి ఉపయోగం ఆహారంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. పిండిపదార్ధాలను అందించే బియ్యము, గోదుమలు, ఇతర చిరు దాన్యాలు, మాంసకృత్తులనందించే కందిపప్పు , మినపప్పు, శనగపప్పు, పెసలు, అలసందలు మొదలైన పప్పుదాన్యాలు, కొవ్వుపదార్ధాలను అందించే వేరుశనగ, నువ్వులు, కొబ్బరి, ఆవాలు, పత్తిగంజలు, పొద్దుతిరుగుడుగింజలు మొదలైనవి, మసాలా దినుసులైన జీలకర్ర, సొంపు, గసాలు, దనియాలు, ఇంకా జీడిపప్పు, బాదం, పిస్తా మొదలైన బలవర్దక మైన ఆహారం గింజలనుండి వచ్చినవే.
పండ్లు మొక్కలలోని ఆకర్షణీయమైన భాగం వీటి ఆకర్షణలో పడి జంతువులు, పక్షులు పండ్లను తిని గింజలను దూర ప్రాంతాలలో వేస్తాయి కాబట్టి మొక్కల సంతానోత్పత్తి సులభంగా జరుగుతుంది. గుమ్మడి పండు, టమేటా కూరలలోనూ ఉపయోగపడతాయి. పండ్లను వాటి సహజమైన, మధురమైన రుచివలన నేరుగానే ఆహారంగా తీసుకుంటారు. ఇవి జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా రోగనివారణ శక్తిని పెంపొందిస్తాయి. తోటకూర, ఉల్లి, అరటి మొదలైన కాండములను కూడా ఆహారంగా తీసుకుంటాము. బచ్చలి, చుక్క, గోంగూర, తోటకూర మొదలైన ఆకులను ఆహారంగా తీసుకుంటాము. వంకాయ,బెండకాయ,కాకర, ఆకాకరకాయ మొదలైన కాయలను కూరలలో ఎక్కువగా వాడుతూ ఉంటాము. వేరు నుండి వచ్చే ఉర్లగడ్డ, చామగడ్డ, కందగడ్డ మొలైన వాటిని ఆహారంగా ఉపయోగిస్తాము.కాలిఫ్లవర్,కుంకుమపువ్వు, అవిసిపువ్వు, మునగపువ్వు, అరటి పువ్వు అరుదుగా వేపపువ్వు పూలరూపంలోనే ఆహారంలో ఉపయోగపడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications