Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మహిళల ఆరోగ్యకరమైన ఆహారాలు!

30 సంవత్సరాలు పైబడిన మహిళలకు ఆహారం!
ఐరన్ అధికంగా - మహిళ ప్రతినెలా తన శరీరంనుండి పిరియడ్ కారణంగా కొంత ఐరన్ నష్టపోతుంది. ఐరన్ తగ్గితే అది మిమ్మల్ని బలహీనపరచి శరీరంలో రక్తహీనత ఏర్పరుస్తుంది. ఐరన్ అధికంగా వుండే ఆహారాలు, అలసట పొగొట్టి, రక్తహీనత, జుట్టు రాలటం, తలనొప్పి వంటివి కలిగించకుండా వుంటాయి. పచ్చని కూరలు, ఆకు కూరలు, బచ్చలి, గోంగూర, బీన్స్ వంటి వాటిలో ఐరన్ అధికం. లివర్, టూనా చేప కూడా అధిక ఐరన్ కలిగి వున్నాయి.
పండ్లు - 30 సంవత్సరాలు పైబడిన మహిళకు పచ్చి లేదా తాజా పండ్లు మంచి పోషకాలనిస్తాయి. వీరికి ఐరన్, కాల్షియం రెండూ ప్రధానం. బొప్పాయి, బఠాణీ, ఆలివ్, స్ట్రాబెర్రీ, ఆరెంజ్, కేన్ బెర్రీలు జంక్ ఫుడ్ బదులుగా తినండి. ఆకలి, అలసటలను వదలాలంటే పండ్లు తినాలి
కాల్షియం - విటమిన్ డి, మెగ్నీషియంలతో ఇది వస్తుంది. 30 సంవత్సరాల పైన మంచి కార్బోహైడ్రేట్లు, కొవ్వులు మిమ్మల్ని రక్తపోటునుండి, గుండె జబ్బులనుండి కాపాడతాయి. కొవ్వు తక్కువగా వున్న పాల ఉత్పత్తులు, గోంగూర, బచ్చలి, వేపిన చేపలుసల్మాన్, టూనా, కొవ్వు తక్కువవుండే జున్ను, గుడ్లు, వెన్నతీసిన పాలు , గింజలు తినాలి. జంతు సంబంధిత ప్రొటీన్లు శరీరంనుండి కాల్షియం తీసుకుంటాయి. కనుక వీటిని తగ్గించండి. సాధ్యమైన మేరకు మొక్కల సంబంధిత ఆహారాలు తినాలి.
కొవ్వులు - చెడు కొల్లెస్టరాల్ తగ్గాలంటే మోనోశాట్యురేటెడ్ ఆహారాలు తినాలి. ఇవి గుండె జబ్బులు, రక్తపోటు, షుగర్ వ్యాధి రాకుండా చేస్తాయి. బాదంపప్పులు, జీడిపప్పులు, బీఫ్, ఓట్ మీల్, పస్తా, బ్రౌన్ బ్రెడ్, వాల్ నట్స్, నువ్వులు, గుమ్మడి గింజలు మొదలైనవి మోనో శాట్యురేటెడ్ కొవ్వులు కలిగి వుంటాయి. మొక్క సంబంధిత నూనెలు ఆలివ్ నూనె, కెనోలా నూనె, గ్రేప్ సీడ్ నూనె, అవిసె గింజల నూనె మొదలైనవి కూడా 30 ఏళ్ళ మహిళలకు మంచివే.
ఈ వయసు మహిళలు, ఆహారం ఒకటే తీసుకుంటే చాలదు. శారీరక సౌష్టవం కొరకు క్రమం తప్పకుండా కొంత సమయం రోజూ వ్యాయామం కూడా చేయాలి. తగినంత నీరు తాగి శరీరంలోని మలినాలు విసర్జించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications