Latest Updates
-
డేటింగ్ యాప్లో పరిచయం.. పెళ్లయ్యాక కట్నం కోసం వేధింపులు: ఆన్లైన్ సంబంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
వాట్సాప్లో పెళ్లి పత్రికల పేరుతో కొత్త మోసం… ఆ లింక్ క్లిక్ చేస్తే మీ జీవితమే తలకిందులు! -
ఇంట్లో కూరగాయలు లేవా? కేవలం 5 నిమిషాల్లో ఈ కరకరలాడే ఉల్లిపాయ భుజియా చేసి చూడండి! -
మిథున, తులా, కుంభ రాశుల వారికి ఈరోజు అదృష్టం..ఆర్థికంగా భారీ లాభాలు పొందే అరుదైన అవకాశం! -
మీ ఒంట్లో ఈ 7 లక్షణాలు కనిపిస్తే.. మీరు కరెక్ట్ గా నీళ్లు తాగుతున్నట్టే లెక్క! -
గురు పుష్య యోగం: ఈ రోజు బంగారం కొంటే మీ జాతకమే మారిపోతుందా? అదృష్టం మీ వెంటే! -
మంగళవారం పనులు మొదలుపెడుతున్నారా? ఈరోజు శుభ ముహూర్తాలు, రాహుకాలం తెలుసుకోకపోతే పనుల్లో ఆటంకాలు తప్పవా? -
రేవతిలో శని, రోహిణిలో బుధుడు: ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం! -
మిథునం, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. ఎవరికి ధన లాభం? - మంగళవారం, 19 మే 2026 -
నీట్ రద్దుతో మొదలైన గొడవలు.. మీ రిలేషన్షిప్ను కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
సైకిలింగ్ తో మీకు చేకూరే ప్రయోజనాలు?

సైకిలింగ్ చేయటం వలన వచ్చే ప్రయోజనాలు
కండరాలు బలపరుస్తుంది - సైకిలు తొక్కితే అది మీ శారీరక కండరాలను బలపరచి మంచి శక్తి కలిగిస్తుంది. ప్రత్యేకించి శరీరంలోని క్రింది భాగాలు అంటే, నడుము, తొడలు, పిరుదులు, పిక్కలు, పాదాలు లోని కండరాలు బలపడతాయి. బద్ధకంగా ఉందా? మీ సైకిల్ తీసుకొని ఒక రౌండ్ వేయండి. బద్ధకం వదిలిపోతుంది. మీరు తాజాగా ఉండటమే కాదు, శక్తిని కూడా పొదుతారు. దీనికి కారణం మీ శరీరంలోని జీవక్రియ పెరుగుతుంది.కండరాలు పటుత్వం సంతరించుకుంటాయి. ఈ వాహనంలో ప్రధానంగా గల ప్రయోజనాలు ఇవి.
శరీర బరువు తగ్గేటందుకు సహకరిస్తుంది - సైకిల్ తొక్కటం వలన బరువు త్వరగా తగ్గవచ్చు. అది మీలోని కేలరీలు ఖర్చు చేసి, కొవ్వు నిల్వలు కరిగిస్తుంది. వేగంగా కనుక సైకిల్ తొక్కితే, అసలు మీరు బరువు ఎక్కే ప్రసక్తి లేదు. కనుక సైకిల్ తొక్కే వారైతే, ఆహారం బాగా తగ్గించాల్సిన పని అసలే లేదు.
కీళ్ళ నొప్పులకు వ్యాయామం - కండరాలు బలపడటమే కాక, సైకిల్ తొక్కితే మీ కీళ్ళ నొప్పులు కరూడా మాయమవుతాయి. కీళ్ళ నొప్పులు తగ్గించాలంటే ఇది మంచి పరిష్కారం. మందులు వేయాల్సిన పనిలేదు. రెగ్యులర్ గా సైకిల్ తొక్కి దాని ప్రభావం చూడండి.
గుండె ఆరోగ్యానికి మంచిది - సైకిలు తొక్కటం గుండెకు మంచి వ్యాయామం అని కూడా చెపుతారు.
అది మీ శరీరంలోని రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. గుండె రక్తనాళాలలో బ్లాకేజీ లేకుండా చేస్తుంది. రీసెర్చి మేరకు, ప్రతిరోజూ 30 నిమిషాలు సైకిలింగ్చేస్తే అది గుండె జబ్బులను 50 శాతం వరకు నివారిస్తుందని వెల్లడైంది.
ఒత్తిడి తగ్గుతుంది - కొద్ది కిలోమీటర్ల పెడలింగ్ మీ శరీరంలో జీవప్రక్రియ అధికం చేస్తుంది. ఒత్తిడి, మానసిక వేదనలను తగ్గిస్తుంది. భాగస్వామితో భంగపడ్డారా? బాస్ తిట్టిపోశాడా? వెంటనే సైకిల్ ఎక్కి కొంత ప్రయాణించండి. ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ కొంత దూరం సైకిల్ తొక్కారంటే, మీలోని ఒత్తిడి, మరియు డిప్రెషన్ వంటివి దూరం అవుతాయి.
.
శ్వాస మెరుగుపరుస్తుంది - సైకిలింగ్ చేసేటపుడు మీరు అధికంగా గాలి తీసుకోవడం, వదలడం వంటివి చేస్తారు.గట్టిగా శ్వాస తీయడం, వదలడం మీలోని మలినాలను విసర్జిస్తుంది. వేగంగా సైకిల్ తొక్కితే అది మీ శ్వాసను పెంచి గుండెను కాపాడుతుంది.
సైకిల్ తొక్కటం వలన వచ్చే ప్రయోజనాలలో ఇవి కొన్ని. కనుక, మీ స్పోర్ట్ షూస్ వేసేయండి, సౌకర్యవంతమైన దుస్తులు ధరించండి, తేలికగా సైకిల్ పై ప్రయాణించండి.అయితే, సైకిల్ తోపాటు ఒక బాటిల్ నీరు, టవల్ కూడా వెంట పెట్టుకు వెళ్ళండి. ఎందుకంటే, సైకిలింగ్ లో చెమట అధికంగా పడుతుంది. పొట్టలో నీరు అధికంగా నింపవలసి వస్తుంది. కొత్తగా సైకిల్ తొక్కే వారికి కాలి పిక్కలు కొద్ది రోజులు నొప్పులు పెడతాయి. అటువంటపుడు తొక్కే దూరం తగ్గించండి. క్రమేణా దూరం, వేగం పెంచుతూ గట్టి శరీరాన్ని, ఆరోగ్యాన్ని కలిగి వుండండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications