Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వ్యాయామం మీకు ఒక అలవాటుగా ఎలా చేసుకోవాలి?

వ్యాయామం అలవాటుగా చేసుకునే మార్గాలు -
1. టార్గెట్ పెట్టుకోవద్దు - ప్రతిరోజూ వ్యాయామం చేయాలనుకుంటే, మీరు ఒక టార్గెట్ అనేది పెట్టుకోకండి. మూడు నెలల కాలంలో నేను 5 కిలోలు తగ్గాలి అని టార్గెట్ పెట్టుకుంటే, బహుశ మీరు అది నెరవేర్చగలరు. కాని ఒకసారి మీ ఈ లక్ష్యం నెరవేర్చుకున్న తర్వాత ఇక మీరు వ్యాయామం చేయరు.
2. మీ రోజును వ్యాయామంతో మొదలు పెట్టండి -
సాధారణంగా మనం రోజును మొదలు పెట్టటంలో ఎంతో విచక్షణతో ఉంటాము. కనుక వ్యాయామం మంచి పని కనుక రోజును వ్యాయామంతో మొదలు పెట్టండి. ఒకటి లేదా రెండు నెలలు వ్యాయామం చేసేసరికి మీరు ఎంతో హాయిగా భావిస్తారు. ఇక ఈ వ్యాయామ అలవాటు ప్రతిరోజూ మీరు ఉదయం వేళ కాఫీ తాగినంతగా అలవాటు అయిపోతుంది.
3. స్నేహితుడికి చెప్పండి - గంట అధికంగా నిద్రిస్తారా లేక ఒక గంట పరుగు పెడతారా? అంటే ప్రతి ఒక్కరూ మొదటిదే ఎంచుకుంటారు. అయితే, మీరు మీ స్నేహితుడితో ఉదయం పరుగులో లేదా జాగింగ్ లో చేరతానని కమిట్ అవ్వండి. అయిష్టంగానైనా సరే కమిట్ అవ్వండి.అది మీకు ఒక సోషల్ విధి కింద వచ్చి మీరు తప్పక చేస్తారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటారు.
4. మీకు ఏది ఇష్టమో అది చేయండి - మనలో చాలామంది వ్యాయామాలు ఆనందించరు. కనుక మీరు వ్యాయామాన్ని ఒక ఫన్ లేదా ఆనందం గొలిపేలా చేసుకోండి. చెవులకు మ్యూజిక్ పెట్టేసి మికిష్టమైన పాటలు వింటూ వర్కవుట్లు చేయండి. జిమ్ లో మీకు నచ్చలేదా? సమీపంలో వున్న పార్కుకు వెళ్ళి సహజ గాలి, వెలుతురు లో చేసి ఆనందించండి. అయితే, మీరు తోటి మనుషులతో కలసి చేయాలనుకుంటే జిమ్ లో చేసి త్వరగా బరువు కూడా తగ్గించుకోవచ్చు.
5. వ్యాయామం రొటీన్ చేయండి - మీరు ప్రతిరోజూ చేసే పనులలో వ్యాయామం చేయండి. సమయం లేదంటూ దానినుండి తప్పుకోకండి. ఇతర అలవాట్లకు ఎలా సమయం తీసుకుంటామో దీనికి గూడా సమయం తీసుకోండి. ముగించండి. లేదా సాయంత్రం వేళ ఆఫీస్ నుండి ఇంటికి బస్ లేదా ఇతర వాహనాలు నడిపేకంటే కాలినడకన ఇంటికి చేరండి. రాత్రికి బాగా నిద్ర కూడా పడుతుంది.
అన్నిరకాల ఆహారాలతోను, అన్ని రకాల వ్యాయామాలతోను మీరు మీ బరువును తగ్గించేసుకోవచ్చు. కాని అందుకుగాను మీ వ్యాయామం ఒక అలవాటుగా మీకు ఉండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications