Latest Updates
-
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.?
మామిడి పళ్ళు శరీర బరువు ఎలా తగ్గిస్తాయి?

ఆఫ్రికా మామిడిపండు సాధారణ మామిడిపండు కంటే భిన్నంగా వుంటుంది. అనేక దశాబ్దాలనుండి ఆఫ్రికా మామిడి పండ్లు బరువు తగ్గేందుకు సహజ ఆహారంగా వాడుతున్నారు. చాలామంది పోషకాహార నిపుణులు బరువు తగ్గేందుకు ఆఫ్రికా మామిడిపండ్లను తినమని సిఫార్సు చేస్తారు. తింటే ఇవి ఎంతో సురక్షితం, చెడు దుష్ప్రభావాలు అసలే వుండవు.
ఆఫ్రికా మామిడి పండ్ల ఆరోగ్య ప్రయోజనం ప్రధానంగా దాని విత్తనాలనుండి వస్తుంది. అంటే టెంకనుండి వస్తుంది. దీని టెంకలో కావలసినంత పీచు, కొవ్వులు వుండి అవి అధిక బరువు కరిగించేస్తుంది. ఆకలిని లెప్టిన్ అనే పదార్ధం ఎప్పటికపుడు నియంత్రిస్తుంది. అది దీనిలో వుండటం చేత, ఆకలి మందగించి, కేలరీలు అధికంగా ఖర్చయ్యేలా చేస్తుంది. కొల్లెస్టరాల్ దీనిలో చాలా తక్కువ. దీనిలో వుండే అడిపోనెక్టిన్ అనే పదార్ధం ఇన్సులిన్ ఉత్పత్తి అధికం చేస్తుంది. అది కొవ్వును శక్తిగా తక్షణమే మారుస్తుంది.
బరువును తగ్గించటమేకాక, వ్యాధులు రాకుండా చేస్తుంది. మనలోని జీవక్రియ వేగవంతం చేస్తుంది. కఠిన ఆహారం పాటించకుండా వర్కవుట్లు చేయకుండా బరువు తగ్గాలనే వారికి ఆఫ్రికా మామిడిపండ్లు తినటం మంచి మార్గం. ఏ మందులు వాడకుండా బరువు సహజంగా తగ్గాలంటే,ఆఫ్రికా మామిడిపండు ఎంతో ప్రయోజనం.
మామిడిపండ్ల ఆరోగ్యప్రయోజనాలు మరిన్ని.....
1. ఎసిడిటీ వుంటే మామిడిపండు సహజ నివారణ కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైములు వున్నాయి.
2. మొటిమలు తగ్గేందుకు ఒక మామిడిపండు రసాన్ని మీ ముఖంపై రుద్దితే చర్మంలోని రంధ్రాలు బాగా శుభ్రపడి మొటిమలు వెంటనే తగ్గుతాయి.
3. మామిడిపండు కొల్లెస్టరాల్ లెవెల్ తగ్గిస్తుంది. దీనిలో వుండే కరిగే పీచు, విటమిన్ సి మరియు పెక్టిన్ లు కొల్లెస్టరాల్ స్ధాయి నియంత్రిస్తాయి.
4. రెగ్యులర్ గా కనుక దీనిని తింటే, దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్, డయాబెటీస్, గుండెజబ్బులకు కారణమయ్యే క్రిములను తొలగిస్తాయి.
మంచి రుచి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కల ఈ మామిడిపండును తినటం నేడే ప్రారంభించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications