Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యకరమా?
నేటి రోజులలో చాలామంది తెల్లటి బ్రెడ్ కంటే కూడా బ్రౌన్ బ్రెడ్ తినేందుకే ఇష్టపడుతున్నారు. దానినే ఎంపిక చేసుకుంటున్నారు. దానికి కారణం ఏమిటో మీకు తెలుసా? నేడు ప్రతి వారికి ఆరోగ్య జాగ్రత్తలు పెరిగిపోయాయి. ప్రపంచమంతా ఆరోగ్య జీవన విధానాలవైపు సాగిపోతోంది. కనుకనే అందరూ ఆరోగ్యకర తిండ్లు తినాలని భావించి బ్రౌన్ బ్రెడ్ వంటి వాటి వైపు మొగ్గు చూపుతున్నారను. మరి ఈ బ్రౌన్ బ్రెడ్ ఎలా తయారవుతుంది. దీనిలో ఏ రకమైన పోషకాలు ఉంటాయి? అనేది పరిశీలిస్తే, బ్రౌన్ బ్రెడ్ నను సాధారణంగా గోధుమలతో తయారు చేస్తారు. కనుక అది పుష్కలమైన పోషకాలు, పీచు కలిగి ఉంటుంది. గోధుమ బ్రెడ్ ఆరోగ్యకరం. అయితే వీటిలో కొన్ని సార్లు బ్రౌన్ రంగు రావటానికి కృత్రిమ రంగులు వాడతారు. అది కొనేముందు పరిశీలించండి. గోధుమ ప్రధానంగా కూడా ఉండాలి. అపుడే కొనుగోలు చేయండి.
గింజ ధాన్యాలు - బ్రౌన్ బ్రెడ్ లో వాడేది ముడి గింజలు కనుక వాటికి ఆ రంగు వస్తుంది. ముడిగింజలలో పోషకాలు అధికంగా ఉంటాయి. ముడి గింజలలో ప్రతి దానికి పైన తవుడు పొర ఉంటుంది. ఈ కారణంగానే బ్రౌన్ బ్రెడ్ ను ఆరోగ్యకరమంటారు. దీనిలో విటమిన్ ఇ మరియు అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి. బ్రౌన్ బ్రెడ్ తేలికగా జీర్ణం అవుతుంది. డైటింగ్ చేసేవారు దీనిని తినేందుకు అధిక ప్రాధాన్యతనిస్తారు. కొవ్వు కలిగించదు. సన్నపడేస్తుంది. కనుక బ్రౌన్ బ్రెడ్ తిని ఆరోగ్యంగా, సన్నగా, నాజూకుగా ఉండవచ్చు.

పోషకాలు - బ్రెడ్ లో పోషకాలు అధికం చేయటానికి తయారీదారులు ఎన్నో పద్ధతులు ఆచరిస్తారు. కాని దీనిలో పీచు లేదా ఫైబర్ మాత్రం పెట్టలేరు. అయితే, బ్రౌన్ బ్రెడ్ లో పీచు అధికంగా ఉండి మీ జీర్ణ వ్యవస్ధ పనితనాన్ని మెరుగుపరుస్తుంది. పీచు పదార్ధాలు ఉంటాయి కనుక కడుపు నింపుతుంది. ఆకలి వేయదు. జీర్ణ వ్యవస్ధ మెరుగుపడి మలబద్ధకం లేకుండా చేస్తుంది. బ్లడ్ షుగర్ స్ధాయిలపై కూడా బ్రౌన్ బ్రెడ్ ప్రభావం అధికంగా ఉండదు. తిన్న తర్వాత అది రక్తంలో కలవాలంటే చాలా సమయం పట్టి మేలు చేస్తుంది. ఈ రకమైన ముడి గింజల ఆహారాలు తినే వారికి గుండె జబ్బులు కూడా త్వరగా రావు. బ్రౌన్ బ్రెడ్ కొలెస్టరాల్ స్ధాయిలను తగ్గించి శరీరం ఫిట్ గా ఆరోగ్యంగా ఉండేలా కూడా చేస్తుంది.
బ్రౌన్ బ్రెడ్ తినటంలో హాని - నిస్సందేహంగా బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యకరమే. అయితే దానిలో వేసే కృత్రిమ రంగులు హాని కలిగించవచ్చు. బ్రెడ్ రంగు రావటానికి కాఫీ పౌడర్ కూడా వేసి రంగు తెప్పిస్తారు. సాధారణంగా బ్రెడ్ అనేది గోధుమలతోనే తయారు చేస్తారు. కనుక బ్రౌన్ బ్రెడ్ కొనే ముందు నూటికి నూరు శాతం అది గోధుమ గింజలదేనా అనేది చెక్ చేయండి.
బ్రెడ్ లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కనుక వీటిని అధికంగా తింటే అనారోగ్యం. కనుక బ్రౌన్ బ్రెడ్ అయినప్పటికి దానిని తగినంత మోతాదులోనే తిని ఆరోగ్యంగా ఉండండి. అయితే, బ్రౌన్ బ్రెడ్ లు తెల్లటి బ్రెడ్ కంటే కూడా మంచివి. మంచి రుచి కూడా ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications