Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026
ఆహారంలో ప్రొటీన్లు అధికం అయితే?

కొవ్వు అధికం - కార్బోహైడ్రేట్లు ఎనర్జీని, కొవ్వును ఖర్చు చేస్తాయి. కాని మీరు కనుక ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలు తింటే, మీకవసరమైన కార్బో హైడ్రేట్లు అందవు. అపుడు కొవ్వు అధికంగా మీ శరీరంలో పేరుకుంటుంది. ఖర్చు కాదు. మీకు శక్తినిచ్చే కార్బో హైడ్రేట్లు అందవు. కనుక ప్రొటీన్లు మాత్రమే కాక, కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం కూడా మీరు తీసుకోవాలి.
పోషకాల లేమి - ఎపుడూ ప్రొటీన్ అధిక ఆహారం తింటే శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు కొరవడుతాయి. అంటే, కార్బో హైడ్రేట్లు, విటమిన్లు మరియు మినరల్స్ వంటివి ప్రొటీన్ ఆహారంలో ఉండవు. కనుక మీరు వాటిని పొందలేరు. ఆహారంలో పీచు కూడా అవసరమే, పీచు సరిగా లేకపోతే, మీకు మలబద్ధకం, ఇతర సమస్యలు వస్తాయి. అంతేకాక, ఇతర పోషకాలు అందకపోవటం వలన కూడా శరీరం రోగాల బారిన పడుతుంది.
వ్యాధులు కలిగిస్తుంది. - ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం, గుండె జబ్బులు, ఎముకల అరుగుదల, కిడ్నీ రాళ్ళు, డయాబెటిస్, కేన్సర్ మొదలైన వ్యాధులు కలిగేలా చేస్తుంది. మేయో క్లినక్ వారి సర్వే మేరకు ప్రొటీన్లు అధికం అయితే, అది కిడ్నీలను కూడా నష్టపరుస్తుంది. ప్రొటీన్లు శరీరంలో కరిగితే అవి కిటోన్స్ అనే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. కిటోన్లు శరీరంలో అధికం అయితే, కిడ్నీలు సరిగా పనిచేయవు. ప్రొటీన్ జీవప్రక్రియలో తయారయ్యే వ్యర్ధాలను మన శరీరం బయటకు పంపేందుకు చాలా కష్టపడవలసి వస్తుంది. కొల్లెస్టరాల్ మరియు శాట్యురేటెడ్ కొవ్వులు ఈ ఆహారం కారణంగా శరీరంలో పెరిగి మంచికంటే కూడా చెడు అధికంగా కలుగుతుంది.
బరువు తగ్గటం - చాలామంది ప్రొటీన్ ఆహారం తింటే బరువు తగ్గుతుందని భావిస్తారు. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలను సరిగా వాడితే ఫలితాలు బాగానే ఉంటాయి. ఉదాహరణకు సరైన ప్రొటీన్ ఆహార ఎంపిక అంటే, చేప, లీన్ మాంసం, చర్మం తీసిన చికెన్, పోర్క్, తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు మొదలైనవి. శరీర ఆరోగ్యానికి అన్ని రకాల పోషకాలు కల సంతులిత ఆహారం మాత్రమే సూచించదగినది. కనుక మీరు ఆహారాల ఎంపికలో మీ అవసరాలకు గాను వైద్యులను సంప్రదించి మాత్రమే నిర్ణయాలు చేయండి.
అన్ని పోషకాలు సంతులితంగా కలిగి ఉండటం అనేది ఆరోగ్య జీవిత రహస్యం. ఆరోగ్యకరమైన ప్రొటీన్ ఒకటే మీ శరీరాన్ని కాపాడలేదు. కనుక ఆహారాలను ఎంపిక చేసేటపుడు అవి మీకు అన్ని రకాలుగా పోషకాలను అందించాలి. అపుడే మీరు ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications