Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బరువు తగ్గాలంటే వేసవికాలం మంచి సమయమా?

వేసవిలో బరువు తగ్గటం తేలికా?
1. చలికాలం పొడిబారి వుంటుంది. మన శరీరానికి డీహైడ్రేషన్ లేకుండా కొంత నీరు శరీరంలో వుండాలి. వేసవికాలంలో, మీరు చెమట బాగా కార్చి కొంత బరువు తగ్గించుకుంటారు. పైగా నీరు మీ శరీరంలో ఎక్కువసేపు వుండదు కూడాను. కనుక నీరు మీ బరువుకు కలుస్తుందన్న భయం లేకుండా తగినంత నీరు తాగేయండి.
2. చలికాలంతో పోలిస్తే వేసవిలో మనం ఆహారాలు తక్కువగా తింటాం. వేసవి వేడి మన జీవక్రియను తగ్గిస్తుంది. వేసవిలో ఆకలి కంటే కూడా మనకు దాహం ఎక్కువ. కనుక సహజంగానే తినే ఆహారం తక్కువగా వుంటుంది. ఈ చర్య మీరు వేగంగా బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది.
3. చల్లని వేసవి ఆహారాలు - వేసవిలో పెరుగు, కూరలు, పండ్లు రసాలు వంటివి శరీరానికి చల్లదనం ఇస్తాయి. అవి మీకు బరువు చేర్చవు. చలికాలంలో, మనం శరీరానికి అధిక వేడి కావాలంటూ కొన్ని ఆహారాలు తినేస్తాం. ఈ ఆహారాలు ఏవంటే...మాంసం, జున్ను మొదలైనవి. వీటిలో కేలరీలు అధికం. కాని వేసవిలో, ఈ రకంగా వేడి పుట్టే ఆహారాలు మానేస్తాం.
4. ద్రవాహారాలు మరియు బరువు తగ్గుట ....వేసవిలో వేడిని తగ్గించటానికి ద్రవాహారాలు అధికంగా తీసుకోవాలి. ద్రవాలు మీ కడుపు నింపుతాయి. కనుక మీరు ఎప్పుడు పడితే అపుడు ఆహారం తీసుకోడానికి ఇష్టపడరు. ఫలితంగా మీరు తక్కువ తినడం, వేగంగా బరువు తగ్గడం జరుగుతుంది. రెండవ ప్రయోజనంగా మీరు తీసుకునే ద్రవాహారాలు మీ శరీరంలోని మలినాలను, వ్యర్ధాలను బయటకు విసర్జిస్తాయి. ఇక అపుడు మీ జీవక్రియ రేటు పెరిగి మీరు ఆరోగ్యంగా వుంటారు. కనుక వేసవిలో మీరు బరువు తగ్గటం తేలిక.
5. వేడిలో వ్యాయామాలు అధికంగా చేస్తారు. చలిగా వుంటే మానవులైనా, జంతువులైనా, శరీరానికి పని కల్పించక ఎపుడూ బద్ధకంగా పడుకుని వుంటారు. వ్యాయామం తక్కువ చేస్తారు. కాని వేసవి వచ్చిందంటే ఏ రకమైన బద్ధకం లేకుండా వ్యాయామాలు చేస్తూ తమ బరువు తగ్గించుకుంటారు. వేసవిలో చెమట ఎటూ పడుతుంది కనుక ఎటూ చెమట పడుతోందిగా అంటూ వ్యాయామం మరింత చేసి కూడా బరువు తగ్గించుకుంటారు.
ఈకారణాలుగా వేసవి బరువు తగ్గేందుకు అనుకూలంగా వుంటుంది. కనుక ఈ చిట్కాలు పాటించి మీరు కోరే శారీరక రూపం సంతరించుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications