Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
ఆరోగ్యం అందించే గొప్ప వ్యాయామం జాగింగ్!

1.జాగింగ్ షూస్ వేసుకొని వెంటనే గ్రౌండ్ కు వెళ్ళిపోవటం కాదు. దానికి ముందు కొద్దిపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు వామ్ అప్ వ్యాయామాలు చేయాలి. జాగింగ్ తర్వాతే స్ట్రెచింగ్ చేయాలనే భావన దూరం చేయండి. ముందుగా స్ట్రెచింగ్ చేస్తే...అది బెణుకులను లేదా గాయాలను కలుగకుండా చేస్తుంది. జాగింగ్ కు వెళ్ళే ముందే శరీరానికి తగిన ఉష్ణోగ్రత కల్పించాలి.
2. జాగ్ చేయాలంటే...ఉదయం వేళ మంచి సమయం. అది మీ జీవక్రియ పెంచి రోజంతా శక్తితో వుండేలా చేస్తుంది. జాగింగ్ చేసిన వెంటనే తగిన నీటిని కూడా తాగండి.
3. జాగింగ్ బాగా చేయాలంటే, జాగింగ్ షూస్ మరియు దుస్తులు వేసుకోండి.
4. కొత్తగా మొదలు పెట్టినవారు ఆరంభంలో మెల్లగా నడిచి, నడక వేగం పెంచుతూ, క్రమంగా జాగింగ్ కు రావాలి. జాగింగ్ సమయంలో మూడ్ బాగా వుండాలంటే, మ్యూజిక్ వినండి.నడక నుండి జాగింగ్ కు మారే సమయంలో అవసరమనుకుంటే శారీరక పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహా పొందండి.
5. కొత్తగా జాగ్ మొదలు పెట్టేవారు ఎత్తు, పల్లాలు లేని ప్రదేశాన్ని ఎంచుకోండి. కాళ్ళపై ఒత్తిడి లేకుండా వుంటుంది. వీలైనంత వరకు ప్రతిరోజూ ఒకే సమయంలో జాగింగ్ చేస్తే, శరీరానికి మంచి ఫలితాలుంటాయి.
6. బెణుకులు వంటివి లేకుండా వుండాలంటే...మెల్లగా మొదలు పెట్టి క్రమేణా వేగం పెంచాలి. అలసట లేకుండా ఎంత సమయం చేయగలిగితే అంతే చేయండి. అధికంగా చేసి శరీరానికి ఒకే రోజు శ్రమ కల్పించకండి.
7. జాగింగ్ కు వెళ్ళే అరగంట ముందు నీరు తాగండి. శరీరం డీహైడ్రేషన్ పొందకుండా వుంటుంది. నీరు అధికంగా తాగితే, వేగం తగ్గుతుంది.
8. ఫలితాలు బాగుండాలంటే, ఖాళీ పొట్టతో చేయండి. వేగంగా చేస్తే కేలరీలు బాగా తగ్గుతాయి.
9. మునికాళ్ళపై జాగ్ చేయాలి కాని మడమలపై కాదు.
10. జాగింగ్ చేసిన తర్వాత కూడా కొద్ది పాటి స్ట్రెచింగ్ చేయండి. ఈ చర్య అలసిన మీ కండరాలకు ఎంతో హాయినిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications