Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మంచితింటే...మంచి - చెడు తింటే చెడు!

బ్యాడ్ మూడ్ తెప్పించే ఆహారాలు - మూడ్ చెడుగా వుంటే, మనం కార్బోహైడ్రేట్లు, షుగర్ వంటివి తినేసి తాత్కాలికంగా సంతోష పడతాం. షుగర్ తినేటపుడు సంతోషంగా వున్నా తర్వాత మూడ్ మార్చేస్తుంది. మరి వెంటనే మరోమారు తీపి తినేయాలనుకుంటాం. అధిక కొవ్వు పెంచేస్తుంది వ్యాయామం చేయనివ్వదు. ఈ రకంగా మరింత మూడ్ దిగజార్చేస్తుంది.
మూడ్ పెంచే ఆహారాలు చూడండి - ప్రతిరోజూ కనీసం రెండైనా సరే ఇవి తినండి.
చిలకడదుంపలు - వీటిలోని ఫోలేట్ మీ బ్లడ్ షుగర్ ఖచ్చితంగా వుండేలా చేసి ఆనందింపచేస్తుంది.
బఠానీలు - ఆందోళన పోగొట్టి ప్రశాంతంగా వుంచే సెలీనియం అనే పదార్ధం ఇందులో వుంది.
చేప నూనెలు - ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వుండే నూనెలు మీ ఏకాగ్రత పెంచుతాయి.
గుడ్లు - వీటిలో జింక్ అధికం. మెళకువగా వుండేలా చేసి శక్తినిస్తాయి షుగర్ నియంత్రిస్తాయి.
పెరుగు - ప్రొటీన్లు, కాల్షియం అధికం. డిప్రెషన్, ఆందోళనలను తరిమేస్తుంది.
ఆకు కూరలు - ఐరన్ అధికం. అలసట పోగొడతాయి.
మరి మానేయాల్సినవి మరికొన్ని చూడండి - బిస్కట్లు, కేకులు, చాక్లెట్లు, కూల్ డ్రింకులు వదలండి.
తెల్లటి కార్బో హైడ్రేట్ ఆహారాలు తెల్లబియ్యం, తెల్ల బ్రెడ్ వంటివి తినకండి.
కేలరీలు అధికమే కాక, మిమ్మల్ని డిప్రెస్ చేసే వైన్ జోలికి పోకండి.
వారానికి కనీసం 45 నిమిషాల చొప్పున మూడు నుండి నాలుగు సార్లు చక్కటి వ్యాయామం, సైకిలింగ్, స్విమ్మింగ్ లేదా వేగంగా నడవటం వంటివి చేయండి.
పై సూచనలు పాటిస్తే మీ మూడ్ ఎప్పటికపుడు మంచిగా వుండి మీరే కాక మీచుట్టుపక్కల వున్న
వారు కూడా ఆనందిస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications