Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
రుచిగా వుండే కొవ్వు తక్కువ ఆహారాలు!

మరి రుచిగా వుండి తక్కువ కొవ్వుకల ఆహారాలేమిటో పరిశీలిద్దాం
టోఫు - టోఫు అంటే రుచి పచి లేని కాటేజ్ ఛీజ్ అని భావిస్తారు. టోఫు కనుక సాస్, మసాలులు వేసి చైనీస్ వంటకంగా చేస్తే చాలా రుచికరంగా చేయొక్చు. టోఫు లో కొవ్వు తక్కువ, పీచు, ప్రొటీన్లు, కాల్షియం, కార్బోహైడ్రేట్లు అధికం. మంచి శక్తినిస్తుంది. పెరుగుతో కలిపి బ్రేక్ ఫాస్ట్ గా తింటే రోజంతా చురుకుగా వుంచుతుంది.
గోధుమ పస్తా - ఈఇటాలియన్ వంటకాన్ని లిమిట్ చేసేకంటేమీరు గోధుమ కలిపితింటే బాగుంటుంది. గోధుమపస్తా ఆరోగ్యం, కొవ్వు తక్కువ కూడా. కనుక బరువు ఎక్కుతామనే భయం లేకుండా దీనిని తినవచ్చు.
గింజధాన్యాల బిస్కట్లు - క్రీమ్ బిస్కట్లకంటేఇవి మంచివి. మీ టీ, కాఫీలతో ఇవి తప్పనిసరిగా వుండాలి. వీటినితింటే మీఆకలిబాగా నియంత్రించబడి అధికంగా తినాలనిపించదు. చాలా సేపు కడుపు నిండుగా వుంచుతుంది.
ఉడికించిన బంగాళదుంప - బంగాళదుంప వేయించినా, ఉడికించినా, ఎంతో రుచి. కట్లెట్, క్యూబ్, లుగా తినవచ్చు. సైడ్ డిష్ గా ఎందులోనైనా సరే బాగుంటుంది. నూనెలో వేయించేకంటే, ఉడికించి తినండి. బరువు తగ్గాలంటే ఇది మంచి ఆహారం.
బెల్లంతో చేసిన స్వీట్లు - వంటకాలలో బెల్లం తీపి బాగుంటుంది. బ్లడ్ షుగర్ గురించి మీరు ఆందోళన చెందుతుంటే, షుగర్ బదులు బెల్లం స్వీట్లు తినండి. ఇందులో వుండే కార్బోహైడ్రేట్లు, మినరల్స్, ఐరన్ వింటివి ఆరోగ్యం చేకూరుస్తాయి. బెల్లం శరీరంలోని మలినాలు తొలగించి, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది.
తేనె కలిపిన కార్న్ ఫ్లేక్స్- బ్రేక్ ఫాస్ట్ లో కార్న్ ఫ్లేక్స్ తినండి. కొవ్వు తక్కువ, అనేక పోషకాలు కలిగివుంటాయి. అయితే వీటిలో షుగర్ వంటి వాటికి బదులుగా తేనె కలుపుకొని తినండి. బరువు తగ్గించే విటమిన్లు, మినరల్స్ అందుతాయి. ప్రతిరోజూ రెండు నుండి నాలుగు చెంచాల తేనె కార్న్ ఫ్లేక్స్ లేదా ఓట్ మీల్ వంటి వాటిలో కలిపి తింటే ఎంతో ఆరోగ్యం, తక్కువ కొవ్వు.
బరువు తగ్గాలంటూ వివిధమందులు వాడకుండా ఈ చిట్కాలతో రుచికరమైన ఆహారాలు తిని సహజంగాబరువు తగ్గి ఆనందించండి. శరీర సౌష్టవాన్ని పొందండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications