Latest Updates
-
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ!
ఆరోగ్యంగా వుండాలంటే కొలెస్టరాల్ అవసరమే!

1. ఆకు కూరలు - వారంలో కనీసం మూడు రోజులు ఆకు కూరలను తప్పక తినాలి.
2. కాయగూరలు - ఆహారంలో తాజా కాయకూరలకు ప్రాధాన్యత పెంచాలి.
3, ముతక బియ్యం - బ్రౌన్ రైస్ లేదా పాలిష్ పట్టిన బియ్యాన్ని వాడాలి.
4. పప్పుల మార్పు - కందిపప్పు, పెసర పప్పులను మార్చి మార్చి వాడండి.
5. తాజా పండ్లు - పండ్లు తినాలి. జామ, అరటి, దానిమ్మ, బొప్పాయి, పుచ్చకాయ, బత్తాయి, కమల, ద్రాక్ష వంటి పండ్లు ఆయో సీజన్లలో దొరికేవి తినాలి.
6. పౌల్ట్రీ ఉత్పత్తులు - గుడ్లు అధికంగా తినండి. బ్రాయిలర్ కోళ్ళమాంసం తగ్గించండి.
7. సీ ఫుడ్స్ - తక్కువ నూనె వేసి వేయించిన చేపలను తినండి. వారంలో మూడు రోజులు చేపలు తీసుకోండి.
8. నూనెల వాడకం - వంట నూనెల విషయంలో వనస్పతి మినహా మిగిలినవి ఏవైనా ఒక తరహా నూనెకే పరిమితం అవవ్వండి. వంట నూనెలను అతి తక్కువ వాడండి.
ఈ ఎనిమిది జాగ్రత్తలు పాటిస్తే మీ శరీరంలో చెడు కొల్లెస్టరాల్ చేరకుండా వుంటుంది. మంచి కొలెస్టరాల్ ఎప్పటికపుడు పెరిగి ఆరోగ్యంగా వుంచుతుంది.
మరి మీరు తినే ఆహారం ఎలా వుండాలి?
- ఆహారంలో రెండు ఆమ్లెట్ లు, అతి తక్కువ కొవ్వు కల మాంసం బ్రెడ్ తో, కొవ్వు లేని పాలు చిన్న బాటిల్, మిక్సెడ్ ఫ్రూట్స్ ప్లేటు నిండా వుండాలి.
- ఎంత తిన్నా...10 అంగుళాల ప్లేటులో పట్టే ఆహారమే తినాలి. కొద్దిపాటి బఠాణీల వంటివి లేదా మాంసం ఒక కప్పు. వివిధ రకాల కూరగాయలు సలాడ్ చేసుకొని తినండి. కూరలు, మాంసం వంటివి ఒక కప్పు మించకుండా తినండి.
- సాయంత్రం వేళ తక్కువ కేలరీల స్నాక్స్. ఇందులో ఆపిల్, పుచ్చకాయ లేదా బెర్రీల వంటి పండ్లు తినండి. ఇవి చురుకుగా వుంచుతాయి. పొట్ట కూడా నిండుతుంది. ఈ పండ్లలో నీరు అధికం. కేలరీలు తక్కువ.
- రాత్రి భోజనంలో తేలికగా జీర్ణం అయ్యేవిగా వుండాలి. నెయ్యి, లేదా వెన్న మీగడ వంటివి ఒక టీస్పూను వేసుకోవాలి. సుమారుగా చిన్న బాటిల్ అంటే 300 మి.లీ. పాలు కూడా తాగండి.
ఈ ఆహారం తింటూ తగిన వ్యాయామాలు చేస్తే మీలోని చెడు కొల్లెస్టరాల్ నియంత్రించబడి, చక్కని బరువు నియంత్రణతో మీరు ఆశించే జీరో సైజుల ఫిగర్ తేలికగా పొందే అవకాశంవుంది. వ్యాయామాలే కాక, వాటి స్ధానంలో ఇంటిపని అయిన...దుమ్ము దులపటం, మాపింగ్, కార్ వాషింగ్, లేదా తోటపని వంటివి కూడా మీలోని అధిక బరువు తగ్గించటానికి తోడ్పడతాయి. అవకాశముండి...సన్ బేతింగ్ కూడా చేస్తే కండరాలు బలపడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
