Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
వారంలో నరకం...వారాంతపు స్వర్గం...!
చాలామందికి వారాంతపు సెలవుల సమయం ఎంతో విలువైనదిగా వుంటుంది. ఆ సమయంలో వారు వారమంతా అనుభవించిన ఒత్తిడిని దూరం చేసుకుంటారు. కాని ఈ వారాంతపు సెలవులను ఎంతమంది సరిగ్గా ఉపయోగించుకుంటారు? ఎంతమంది నిజంగా తమ ఒత్తిడి దూరంచేసుకోవడానికి విశ్రాంతి తీసుకుంటారు? మీ వారాంతపు సెలవులను ప్రయోజనకరంగా, ఎలా గడపాలనేదానికి కొన్ని చిట్కాలు పరిశీలించండి.

మీ ల్యాప్ టాప్, మొబైల్ వంటి పరికరాలు దూరం పెట్టండి - వారాంతపు సెలవులలో కూడా పని తగులుతూనే వుంటుంది. ఫోన్లు వస్తాయి, ల్యాప్ టాప్ అవసరపడుతుంది. వీటిని ఉపయోగించటం మొదలు పెట్టకండి. వాటికి దూరంగా వుండండి. వారాంతంలో మీకు పూర్తి సెలవు, మరియు వశ్రాంతి కావాలి. పరికరాలు రిలాక్స్ అయ్యేందుకు వాడినప్పటికి వాటిని వినోదం కొరకు వాడండి.
మీ హాబీలో సమయం గడపండి - అందరికి తమ వ్యక్తిగత సంతోషం కొరకు పనులు లేదా హాబీలు చేసుకోవడం సాధారణం. అవిమీకు ఆనందం కలిగిస్తాయి. కనుక మీ హాబీలైన పెయింటింగ్, రచనలు, గార్డెనింగ్, డ్యాన్సింగ్ వంటివాటికి సమయం వారాంతంలో ఏర్పాటు చేయండి. హాబీ అనేది మీ మానసిక వికాసం. అది మిమ్మల్ని వారమంతా తాజాగా వుండేలా చేస్తుంది.
స్నేహితులతో సమావేశాలు చేయండి - స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి ఆనందించండి. వారిని కలుసుకోవటానికి ఇదే మంచి సమయం కనుక కలసి ఏదైనా రిసార్టు లేదా క్లబ్ వంటి వాటిలో ఆనందించండి. ఇది అందరిని దగ్గరకు చేయటమే కాక మీకు విశ్రాంతినిస్తుంది.
కొంత శారీరక శ్రమ చేయండి - వ్యాయామం, నడక వంటివి వారంలో కష్టమవుతుంది. కనుక వారాంతంలో మీ శరీరానికి అవసరమైన శ్రమను నడక, సైకిలింగ్, వ్యాయామం, డ్యాన్స్ వంటివి మీ స్నేహితులతో కలసి దగ్గరలోని పార్క్ లో చేయండి. లేదా టెన్నిస్ , బేడ్మింటన్ ఆడండి. ఇది మీరు హాయి భావించేలా చేస్తుంది.
ఏదైనా ఒక గ్రూప్ లో చేరండి. టీమ్ వర్కు చేయండి. మీ కిష్టమైన రంగంలో సామాజిక కార్యక్రమాలు చేయండి. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తుంటే మీరు హాయి భావిస్తారు. మీరు వివిధ రంగాలలో చేసే పనులు మీ వృత్తిలో కూడా ఉపయోగపడే అవకాశం వుంటుంది.
మనకందరకు వారాంతపు సెలవులు కావలసిందే. కాని వాటిని మనం సవ్యంగా ఉపయోగించుకొని ప్రయోజనం పొందాలి. కనుక, మీ వారాంతపు సెలవులను ముందుగానే చక్కని ప్రణాళిక చేసి పూర్తి ప్రయోజనం పొందండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications