Latest Updates
-
ఇడ్లీ, దోసె పిండి బాగా పులిసిపోయిందా? పారేయకుండా ఈ చిట్కాలతో ఫ్రెష్ గా మార్చేయండి! -
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపుని లైట్ తీసుకుంటున్నారా? పక్షవాతానికి ముందస్తు హెచ్చరిక? -
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే -
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Chanakya Niti: మహిళలు ఈ 5 విషయాలను రహస్యంగా ఉంచితేనే జీవితంలో తిరుగుండదు! -
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు.. -
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా?
విందు పొందు...మూడ్ మార్చు...!

మనకు ఆనందం ఇవ్వాలంటే, ఒక చిన్న చాక్లెట్ ముక్క చాలు అని మనలోప్రతి ఒక్కరూ భావిస్తారు. మరి ఈ రకంగా మనకు మూడ్ మార్చే ఆనందానికి, ఆహారాలకు మధ్య గల సంబంధం సైంటిఫిక్ గా వివరణ కలిగి వుంది. కనుక ఈ సారి మీరు విచారంగా వుంటే, ఆనందం కలిగించేందుకు కొన్ని మూడ్ మార్చే ఆహారాలు తినండి. అవేమిటో పరిశీలించండి.
అధిక కార్బోహైడ్రేట్లు కల ఆహారాలు, తక్కువ జిఐ తో -
గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా వుండి కార్బోహైడ్రేట్లు అధికంగా వుండే ఆహారాలు తినండి. ఈ ఆహారాలు సాధారణంగా చాలా సింపుల్ గా వుంటాయి. ఇంటిలో తయారు చేసే రొట్టెలు, గోధుమ లేదా వివిధ ధ్యాన్యాల బ్రెడ్, బస్ మతి రైస్ మొదలైనవి.
ఈ ఆహారాలు మీకు రోజంతా ఒకే స్ధాయి షుగర్ ను అందిస్తాయి. శరీరం తేలికగా పీల్చుకునే ఆహారాలు అంటే తియ్యటి పానీయాలు, మీ మూడ్ ను రక్తంలో షుగర్ స్ధాయిని ఒకే సారి పెంచేస్తాయి. అయితే, తర్వాత ఆ ఉత్సాహం తగ్గుతుంది. శక్తి క్షీణత భావిస్తారు. అయితే, బంగాళ దుంప, టోఫు వంటి కార్బోహైడ్రేట్లు మన షుగర్ స్ధాయిలను నియంత్రించి మనం తీవ్ర మూడ్ స్వింగ్స్ నుండి బాధపడకుండా చేస్తాయి. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే, ఉడికించిన జొన్నలు, వేయించిన పాప్ కార్న్ వంటివి తీసుకోవాలంటారు పోషకాహార నిపుణులు. ఇవి రెండూ కూడా అధిక పీచు కలిగి, తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ కల ఆహారాలు. వీటిని రోజంతా కూడా తినవచ్చు.
వాల్ నట్స్ - ఇటీవలి కాలంలో చాలామంది డ్రై ఫ్రూట్స్ లో వున్న లాభాలను గ్రహించారు. వీటిలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు వుంటాయి. వాల్ నట్స్ వంటి వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వుంటాయి. మెగ్నీషియం వుంటుంది. ఇవి శరీరంలో సెరోటోనిన్ స్ధాయి పెంచుతాయి. అందుకనే డిప్రెషన్ కలిగి వున్న వారికి మెగ్నీషియం అధికంగా వుండే విటమిన్లు, మినరల్స్ ఇస్తారు. ఈ సూక్ష్మ పోషకాలు నెగెటివ్ మూడ్ ను, నిద్ర సమస్యలను, సాధారణంగా వచ్చే చికాకు, కోపం వంటివాటిని తగ్గిస్తాయి.
కాల్షియం అధికంగా వుండే పెరుగు - ఈ ఆహారం ప్రత్యేకించి మహిళలకు నెలసరి పిరీయడ్స్లో సమస్యలకు మనోభావనల మార్పుకు బాగా పనిచేస్తుంది. పెరుగులోని కాల్షియం, శరీరంలోకి ఇతర ఆహారాలను బాగా పీల్చుకునేలా చేస్తుంది. మహిళలలో హార్మోన్ల మార్పు జరిగేటపుడు, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ బేలన్స్ మారుతుంది. దానితో జీవక్రియ తగ్గుతుంది. కాల్షియం కనుక చేరిస్తే అది హార్మోన్ల బ్యాలన్స్ కాపాడుతూ, సరైన రీతిలో వారి నరాల వ్యవస్ధను పనిచేయించి వారు మూడ్ స్వింగ్ లకు, ఏడ్పులకు దూరం వుండేలా చేస్తుంది.
అరటిపండ్లు - సాధారణంగా వైద్యులు ప్రతిరోజూ ఉదయం అరటిపండు తినమని చెపుతారు. ఈ ఆహారం రోజంతా మిమ్మల్ని మూడ్ స్వింగ్ లనుండి కాపాడుతుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు అధికం, పొటాషియం కూడా వుంటుంది. విటమిన్ బి 6 మరియు మెగ్నీషియం కూడా వుంటాయి. ఈ పోషకాలన్ని మీ నరాల వ్యవస్ధను నియంత్రించి అదుపులో వుంచుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications