Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
పుష్కలమైన రోగనిరోధక శక్తినిచ్చే...!

ఈ భూమిమీద మీకు ఆరోగ్యాన్ని హామీగా ఇచ్చే ఆహారం కూరగాయలు. పుష్కలమైన పీచు, శక్తి, యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా అనేక ఇతర పోషకాలుంటాయ. మరి ఇవి అంటే ఇష్టంలేని వారు ఏం చేస్తారు. అయితే వీరిలో కొందరు ఆకు కూరలంటే ఇష్టపడతారు. మరి కూరగాయలను మీకు రుచి తెలియకుండానే మీ ప్రతిరోజూ ఆహారంలో చేర్చటానికి కొన్ని చిట్కాలు చూడండి.
1. మీకు బాగా ఇష్టమైన వంటకాలలో లేదా ఆకు కూరలలో కేరట్లు, టమాటాలు వంటివి పెట్టి తినేయండి. లేదా మీకిష్టమైన ఆమ్లెట్ వంటి వాటితో కూడా కలిపి కొన్ని కూరలు తినవచ్చు.
2. సలాడ్లతో చేర్చి తినండి. ఉల్లిపాయ, ముల్లంగి, తురిమిన కేరట్, పలుచగా కోసిన దోస, కాళీ ఫ్లవర్, గ్రీన్ బీన్స్ వంటివాటితో చేర్చి తినండి. వీటిని సలాడ్లుగా తినాలంటే, కూరలను చాలా సన్నగా కోసి వాటిలో చేరిస్తే, మీకు తెలియకుండానే వాటి పోషకాలు మీ ఆహారంలో చేరతాయి.
3. రుచికరమైన సాస్ అంటే ఇష్టపడనివారుండరు. మరి కూరగాయలను అన్నింటిని సన్నగా తరిగి ఒక గిన్నెలో వేసి మాటిపై మీకిష్టమైన సాస్, లేదా హనీ, లేదా పెరుగు వంటివి వేసుకు తినండి.
4. కొన్ని కూరలు పచ్చివి కరకరమంటూ వుంటాయి. వాటిలో ఉల్లిపాయ, పెరుగు, లేదా ఛీజ్, వెన్న వంటివి కలిపి తినవచ్చు. లేదా ఆ ముక్కలకు కొద్దిగా ఉప్పు, మిరియం, ఒక స్పూన్ ఆలివ్ నూనె కలిపి మంచి రుచితో తినవచ్చు.
5. సాయంకాలం స్నాక్స్ గా వేడి వేడి శాండ్ విచెస్ మధ్య పెట్టి తినవచ్చు. వీటికి టమాటా, కేబేజ్ వంటివి కూడా చేర్చి తినవచ్చు. అయితే కూరగాయలను సన్నని ముక్కలుగా తరగాలి.
6. ఇంటిలో మామిడి, కేరట్ వంటి జ్యూస్ లు తయారు చేస్తూ వుంటాము. వాటిలో కూడా మీరు కూరగాయల ముక్కలను అతిసన్నగా తరిగి చేర్చి, లేదా కూరలనే రసంగా తీసి ఉప్పు, మిరియం వంటివి వేసి వెజిటబుల్ జ్యూస్ గాను తాగవచ్చు.
7. బాగా వండిన కూరగాయలను తినటానికి మీరు ఇష్టపడని వారైతే, మీ వంట విధానం మార్చండి. మీ కిష్టమైన సాస్ లో కలిపి తినండి లేదా, కొద్దిగా ఉడికించాలనుకుంటే, మైక్రోవేవ్ ఒవెన్ లో వేడిచేసి తినండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications