Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చేతి వేళ్ళ జాయింట్లకు సులభ వ్యాయామాలు!

సాగతీయటం - వేళ్ళ నొప్పులు తగ్గించటానికి ఇది ఒక మంచి వ్యాయామం. పిడికిలి తెరచి వేళ్ళను సాగతీయండి. పిడికిలి మూయండి మరల తెరుస్తూ వేళ్ళను సాగతీయండి. వేళ్ళను వెనుకకు, ముందుకు కూడా వంచవచ్చు. వేళ్ళ కొనలను బయటకు చాచుతూ మరల ముడుస్తూ వుండాలి.
మణికట్టు చుట్టు తిప్పండి - వేళ్ళ కణుపుల నొప్పి, మణికట్టు నొప్పి రెండూ కలిసే వస్తాయి. అటువంటి నొప్పులు తగ్గటానికి, మీ మణికట్టు చూట్టూ తిప్పండి. చేతుల మణికట్టు లేదా రిస్ట్ భాగాన్ని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ దిశలలో తిప్పండి. ఈ వ్యాయామాలు ఎక్కడైనా, ఎపుడైనా ఎంత సమయమైనా చేసుకోవచ్చు.
వేళ్లతో నాట్యం - చిన్నపుడు మీ స్నేహితులను భయపెట్టేందుకు వేళ్ళను నాట్యం చేయించి వుంటారు. ఇపుడు అటువంటి పని చేస్తే మీ ఫింగర్ జాయింట్ పెయిన్ తేలికగా తగ్గిపోతుంది. రోజంతా టైప్ చేసి నొప్పి పొందటం సహజమే. కనుక మీ వేళ్ళతో కొంతసేపు ఆడండి. వివిధ రకాలుగా వేళ్ళను తిప్పండి. పైన చెప్పిన రీతిలో సాగతీయండి.
వేళ్ళను కలపండి - కొన్ని సార్లు వేళ్ళకు ఒత్తిడి కలిగినపుడు కూడా మీకు హాయి కలుగుతుంది. ఎందుకంటే కండరాలు ముడిచినా, సాగినా అది ఒక వ్యాయామంగా హాయినిస్తుంది. మీ రెండు అరచేతులు కలపండి వేళ్ళను ఒకదానిలో ఒకటి పెట్టి గట్టిగా ఒత్తండి. ఈ రకంగా ఒక 10 సెకండ్ల పాటు వుంచి రిలాక్స్ చేయండి. ఈ వ్యాయామం 4 లేదా 5 సార్లు చేయాలి.
ఈ సులభ వ్యాయామాలేకాక, ఇంటిలో మీ వేళ్ళను గోరువెచ్చటి నీటిలో కొద్దిసేపు వుంచటం వంటివి కూడా మీ వేళ్ళ కణుపుల నొప్పులు తగ్గిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications