Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నిద్రలేని రాత్రులు పట్టి పీడిస్తున్నాయా?

ఇంగ్లాండ్ లోని నార్తుంబ్రియా యూనివర్శిటీ పరిశోధకులు ప్రతిరోజూ రెండు సార్లుగా చెర్రీ జ్యూస్ ఒక వారం రోజులపాటు తాగితే ఇక వారికి నిద్ర ముంచుకు వచ్చేస్తుందంటున్నారు. అయితే, ఈ చెర్రీ జ్యూస్ ఉదయంవేళ పరగడుపున ఒకసారి, రాత్రి పడక సమయంలో ఒకసారి తాగాలట. ఈ రకంగా తాగిన వారి లో నిద్రించే పద్దతి కూడా మారిపోతోందట. అంటే రాత్రులందు అధికంగాను, పగలు తక్కువగాను నిద్రించటం, మొత్తంమీద తగినంత గాఢ నిద్ర పోవటం జరుగుతుందని పరిశోధకులు చెపుతున్నారు. ఇంత గాఢ నిద్రకు కారణం ఎర్రగా వుండే చెర్రీ పండులోని మెలటోనిన్ పదార్ధంగా చెపుతున్నారు. నిద్రించే విధానానికి మెలటోనిన్ ఒక యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుందని అధ్యయనకారులు తెలిపారు. అయితే, సుమారు 90 నుండి 100 చెర్రీలు జ్యూస్ గా తీసుకోవాలని అపుడే ఫలితం బాగా వుంటుందని తెలిపారు. పడక సమయంలో మెలటోనిన్ గల చెర్రీ జ్యూస్ మాత్రమే కాదు, వేడి పాలు లేదా డయాబెటిక్ రోగులైతే, పలుచటి మజ్జిగవంటివి కూడా నిద్రను అధికం చేస్తాయని పరిశోధనలు చెపుతున్నాయి.
రాత్రులందు ఆలస్యంగా భోజనం చేయడం లేదా మసాలా ఆహారాలు తినడం, నిద్రించేముందు వ్యాయామం చేయటం, హింసాత్మక సినిమాలు టి.వి.లో చూడటం, లేదా కంప్యూటర్ ఆటలు ఆడటం, కేఫైన్ కల కాఫీలు తాగం వంటివి కూడా రాత్రులందు నిద్ర లేకుండా చేస్తాయని పరిశోధన తెలుపుతోంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications