Latest Updates
-
ఇడ్లీ, దోసె పిండి బాగా పులిసిపోయిందా? పారేయకుండా ఈ చిట్కాలతో ఫ్రెష్ గా మార్చేయండి! -
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపుని లైట్ తీసుకుంటున్నారా? పక్షవాతానికి ముందస్తు హెచ్చరిక? -
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే -
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Chanakya Niti: మహిళలు ఈ 5 విషయాలను రహస్యంగా ఉంచితేనే జీవితంలో తిరుగుండదు! -
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు.. -
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా?
కాళ్ళు బలంగా వుండాలంటే? !

కాళ్ళ కండరాలకు సులభమైన వ్యాయామం!
కండరాలను బలపరచటానికి చేసే వ్యాయామం అంటే...స్ట్రెచింగ్. అంతే...ఎంతో తేలికైన వ్యాయామం. కాళ్ళ పిక్కల కండరాలు బలపడాలంటే ప్రతిరోజూ జిమ్ కు వెళ్ళాల్సిన అవసరం లేదు. వీటిని ఇంటిలోనే చేసుకొటూ ఆరోగ్యంగా వుండవచ్చు.మీరు చేసే వ్యాయామాలు అధికంగా కాలికండరాలకు సంబంధించినవై వుండాలి. కాలి పిక్కలు బలంగా వుంటే కాళ్ళు కూడా బలంగా వుంటాయి.
ప్రధానంగా రెండు రకాల స్ట్రెచింగ్ లున్నాయి. రెండూ కూడా ఏ పరికరాలు లేకుండానే చేయవచ్చు.
వాల్ స్ట్రెచ్ - గోడకు 10 అంగుళాల దూరంలో నించోండి. ఒక కాలిముందు మరోకాలు పెట్టండి. మీ మోకాలును తిన్నగా గోడవైపుకు వంచండి. మీరు కదలకుండా గోడవైపుకు మోకాలును పుష్ చేయాలి. మీ కాలిలో వచ్చే ఒత్తిడి కండరం బలపడటానికి చేసే వ్యాయామమని గ్రహించండి.
సిటింగ్ స్ట్రెచ్ - ఈ సాగే వ్యాయామానికి మీరు నేలపై కూర్చోండి. కాళ్లను మీ ముందుకు చాపండి. మీ పాదాల అరికాల్ళను అరచేతులతో పట్టుకోండి కాళ్ళను బయటకు నెడుతూ వుండండి. పిక్క కండరాల నొప్పులేమైనా వుంటే మాయమవుతాయి.
స్కిప్పింగ్ - చిన్నపుడు మనమంతా స్కిప్పింగ్ చేసిన వారమే. చాలా ఏళ్ళ తర్వాత మొదటి సారి చేస్తున్నట్లయితే, కాళ్లు విపరీతంగా నొప్పి పెడతాయి. అందరూ స్కిప్పింగ్ తేలికనుకుంటారు. ఆనందిస్తారు. కాని అది చాలా శ్రమతో కూడిన వ్యాయామం. ప్రతిరోజూ చేస్తూ వుంటే మీ పిక్క కండరాలు బలపడి శరీరమంతా తేలికవుతుంది. అధిక బరువు వున్నవారికి ఇది ఒక మంచి వ్యాయామం.
శరీరం చురుకుగా కదులుతూ ఆరోగ్యంగా వుండాలంటే, కాలి పిక్క కండరాలకు బలం పట్టటం ఎంతో ప్రధానం. ప్రతిరోజూ అధిక సమయం పాటు కూర్చుని పనులు చేయటంతో శారీరకంగా బలాన్ని సంతరించుకోవటం వెనుకబడిపోతోంది. కనుక. ప్రతిరోజూ ఉదయం వేళ లేక సాయంత్రాలు ఒక్క గంట ఏ పరికరాలు అవసరంలేని ఇట్టి వ్యాయామాలు చేస్తే శరీరం చక్కని ఫిట్ నెస్ సంతరించుకొంటుందనటంలో సందేహం లేదు. శరీరం ఎంత బలంగా వున్నప్పటికి ఆ శరీర బరువును మోసే కాళ్ళు కూడా ధృఢంగా వుండాలి. పై వ్యాయామాలతోపాటు ప్రతిరోజూ క్రమం తప్పకుండా వేగంగా పరుగు పెట్టినప్పటికి కాళ్లకు కొంత వ్యాయామం కల్పించినవారవుతారు. వ్యాయామంతో పాటు విటమిన్లు, లవణాలు కల సహజమైన బలవర్ధకమైన ఆహారం కూడా అవసరమని గ్రహించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications