Latest Updates
-
ఇడ్లీ, దోసె పిండి బాగా పులిసిపోయిందా? పారేయకుండా ఈ చిట్కాలతో ఫ్రెష్ గా మార్చేయండి! -
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపుని లైట్ తీసుకుంటున్నారా? పక్షవాతానికి ముందస్తు హెచ్చరిక? -
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే -
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Chanakya Niti: మహిళలు ఈ 5 విషయాలను రహస్యంగా ఉంచితేనే జీవితంలో తిరుగుండదు! -
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు.. -
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా?
నిమ్మరసంతో ఆరోగ్య ప్రయోజనాలు!

నిమ్మకాయను వంటకాలలో రుచికి వాడతారు. నిమ్మరసం కొద్దిగా పిండితే చాలు పదార్ధాల రుచి మారిపోతుంది. ఇక చికెన్, మొదలైన ఆహారాలలో నిమ్మరసం వాడని వారుండరు. నిమ్మరసాన్ని నీటిలో కలిపి ఆరోగ్యకర పానీయంగా తాగుతారు. ప్రత్యేకించి ఉదయంవేళ ఈ నీటిని తాగితే ఆరోగ్యం మెరుగవుతుంది. పాలు లేకుండా టీ తాగేవారు కొద్దిగా నిమ్మరసాన్ని, తేనెను చేర్చి తాగుతారు.
ప్రతిరోజూ నిమ్మరసం తాగుతూ వుంటే... వచ్చే ప్రయోజనాలు పరిశీలించండి.
జీర్ణ వ్యవస్ధకు మంచిది - జీర్ణక్రియ సమస్యలు పరిష్కరించబడుతాయి. అజీర్ణం వలన ఏర్పడే, గుండెమంట, కడుపు ఉబ్బటం, త్రేన్పులు వంటివి రాకుండా వుంటాయి. పురాతన కాలంలో మీ తల్లులు అమ్మమ్మలు జ్వరం వచ్చినా లేక పొట్ట గడబిడ అయినా ఒక్క గ్లాసు నిమ్మరసంతో వాటిని తగ్గించేవారని మీరు వినే వుంటారు.
చర్మ కాంతి - నిమ్మరసం చర్మ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. దీనిలోని విటమిన్ సి చర్మాన్ని సంరక్షించి చర్మ కాంతిని కలిగిస్తుంది. నిమ్మరసం రోజూ తాగితే, ఆరోగ్యం మెరుగుపరచి వయసు కనపడనివ్వకుండా కూడా చేస్తుంది.
బరువు తగ్గేందుకు - చాలామంది బరువు తగ్గేందుకు ఉదయం వేళ నిమ్మరసంలో తేనె వేసి తాగుతారు.
గొంతు సమస్యలు - గొంతుకు వచ్చే ఇన్ఫెక్షనలకు నిమ్మ మంచి ఔషధం. దీనిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు గొంతునొప్పి, మంట, మొదలైనవి నివారిస్తాయి.
అధిక రక్తపోటు నియంత్రణ - గుండె జబ్బుల సమస్యలున్నవారికి నిమ్మ రసం నీరు, దీనిలోని పొటాషియం కారణంగా ఎంతో బాగా పని చేస్తుంది. అధిక రక్తపోటు, కళ్ళు బైర్లు కమ్మటం, వాంతి వికారాలు వంటివి పోగొట్టి మైండ్ కు శరీరానికి విశ్రాంతినిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications