Latest Updates
-
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే -
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Chanakya Niti: మహిళలు ఈ 5 విషయాలను రహస్యంగా ఉంచితేనే జీవితంలో తిరుగుండదు! -
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు.. -
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి!
ఎండ తీవ్రతనుండి రక్షించే ఆహారాలు!
మన శారీరక అందం చర్మంపైనే కాదు కనపడేది? అది మనలోపలకూడా వుంటుంది. ఎంత మేకప్ చేసుకున్నా, అలసిన, జీవంలేని కళ్ళు మనను ఆరోగ్యంగా చూపలేవు. అదే రకంగా ఎండనుండి రక్షణ అంటే, సన్ స్క్రీన్ లోషన్లు ముఖంపై రాయటమే కాదు లేదా టోపీలు పెట్టుకోవటం, చేతులకు గ్లోవ్స్ వంటివి వేసుకోవటం మాత్రమే కాదు. మీరు శరీరానికి లోపలినుండి కూడా రక్షణనివ్వాలి. మేము చెప్పే కొన్ని ఆహారాలు కనుక మీరు తింటే, ఎండ వేడి మీ చర్మానికి లోపలినుండి మంచి రక్షణ కల్పిస్తుంది. మీరు ఆరోగ్యవంతులుగా కనపడేలా చేస్తుంది.

ఎండవేడినుండి రక్షించే ఆహారాలు -
1. గ్రీన్ టీ - చాలామంది టీ, కాఫీల ప్రభావాన్ని ఎండాకాలంలో గ్రహించలేరు. మరి వాటి ప్రభావం ఎండాకాలంటో బాగుండాలంటే, గ్రీన్ టీ తాగాలి. దీనిలో వుండే పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్లు, మీకు కావలసినంత శక్తినిస్తాయి. వయసు కనపడకుండా, కేన్సర్ వంటి వ్యాధులు కూడా రాకుండా చేస్తుంది. కనుక గ్రీన్ టీ తాగి శరీరానికి రక్షణ కల్పించండి.
2. కొబ్బరి నీరు - తాగితే చాలు శరీరం చల్లబడుతుంది. ఎండ దెబ్బలు తగలరాదు, మూత్రం సమస్యలుండరాదు అంటే, కనీసం రోజుకు ఒక కొబ్బరి బొండాం నీరు తాగాలి. ఎండలో మధ్యాహ్నం బయటకు వచ్చారా? తప్పకుండా ఒక కొబ్బరి బొండాం నీరు తాగి శరీరాన్ని చల్లగా వుంచండి.
3. కోకో - ఎండనుండి రక్షణకు కోకో మంచి ఆహారం. కోకో లో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ఇవి చర్మ కేన్సర్ రాకుండా చేస్తాయి. మంట కలుగనివ్వవు. వేసవిలో శరీరం హాయిగా వుంటుంది. తీపిలేని కోకో కలిపిన పాలు లేదా చల్లని నీరు మీ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
4. పచ్చటి కూరలు - పచ్చటి కూరగాయలు ఎప్పటికి ఆరోగ్యానికి మంచివే. వీటిలో, ఐరన్, విటమిన్లు, మినరల్స్, వంటివి మిమ్మల్ని ఆరోగ్యంగా వుంచటమే కాదు, ఎండనుండి కూడా రక్షిస్తాయి. అమెరికాలోని జాన్స్ హాప్ కిన్స్ యూనివర్శిటీ బ్రక్కోలి సన్ స్క్రీన్ గా బాగా పనిచేస్తుందని తన పరిశోధనలో నిరూపించింది. పరిశోధన మేరకు ప్రతిరోజూ బ్రక్కోలి తింటే, స్కిన్ కేన్సర్ కూడా రాదట.
5. చేప - చేపలో వుండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు ఆరోగ్యం ఇవ్వటమే కాదు, అవి మీకు చర్మ రక్షణ కూడా కలిగిస్తాయి. చేప నూనెలు స్కిన్ కేన్సర్, మెలనోమా వంటివాటినుండి రక్షణ కల్పిస్తాయి. కనుక సీ ఫుడ్ మరియు చేపలు వంటివి మిమ్మల్ని ఎండదెబ్బనుండి కాపాడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications