Latest Updates
-
ఇడ్లీ, దోసె పిండి బాగా పులిసిపోయిందా? పారేయకుండా ఈ చిట్కాలతో ఫ్రెష్ గా మార్చేయండి! -
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపుని లైట్ తీసుకుంటున్నారా? పక్షవాతానికి ముందస్తు హెచ్చరిక? -
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే -
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Chanakya Niti: మహిళలు ఈ 5 విషయాలను రహస్యంగా ఉంచితేనే జీవితంలో తిరుగుండదు! -
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు.. -
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా?
డైటింగ్ తక్కువ స్ధాయిలో చేయాలంటే?

నిదానమైన డైటింగ్ ఎలా?
చర్మం వేలాడటం - బరువు వేగంగా తగ్గిపోతే, మీ చర్మం వేలాడుతూంటుంది. దీనికి కారణం మీరు సరైన డైటింగ్ విధానాలు పాటించకపోవటమే. పచ్చి ఆహారాలు తినటం కూడా మీలోని విటమిన్ల అసమతుల్యత కలిగించి చర్మం నష్టపరుస్తుంది. తరచుగా తగినంత నీరు తాగుతూంటే, మీ చర్మ సంరక్షణకు అది తోడ్పడుతుంది.
ఒత్తిడి స్ధాయిలు - ప్రతిరోజూ ఆరోగ్యకరంగా తింటూవుంటే అది ఒత్తిడి తగ్గిస్తుంది. తినే విధానం కూడా సరైనదిగా వుండాలి. ఆహారంనములుతూ మెల్లగా తినండి. తినే ఆహారంమొదటి దశలో నోటిలోనే కొంత జీర్ణం అవుతుంది. జంక్ ఆహారాలు ఒకేసారి మానకండి. ఇది ఒత్తిడి అధికం చేస్తుంది. రెగ్యులర్ గా తింటూనే నూనె ఆహారాలు తగ్గిస్తే, బరువు తేలికగా ఏ ఒత్తిడి లేకుండా తగ్గిపోతుంది.
ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ - త్వరగా బరువు తగ్గాలని చాలామంది తమ బ్రేక్ ఫాస్ట్ మానేస్తారు. ఇది వారి సాధారణఅలవాటే. బ్రేక్ ఫాస్ట్ మానివేసినందువలన అది రోజంతా మీరు అధికంగా తినేలాచేస్తుంది. కనుక ఎంపిక చేయబడిన ఆహారాలు తింటూనే వ్యాయామాలు కూడాచేస్తే బరువు క్రమంగా తగ్గుతారు.
ద్రవాహారాలు - బరువు తగ్గాలంటే ద్రవాహారాలు ప్రయోజనకరం. వీటిలో వుండే పోషకాలు ఆరోగ్యంగా జీర్ణమైపోతాయి. ద్రవాహారాలు, తరచుగా రోజులో తీసుకోవాలి. తరచుగా తాగే నీరు కూడా మీకు రోజంతా ఎనర్జీ ఇస్తుంది. బరువు అధికంకాకుండా వుండేందుకు నీరు క్రమం తప్పకుండా తాగటం కూడా మంచి సాధనమే.
రోజూ వ్యాయామం - ప్రతిరోజూచేసే వ్యాయామం మంచి ఫలితాలనిస్తుంది. శారీరకంగ, మానసికంగా మంచి సామర్ధ్యం ఏర్పడుతుంది. నడక, జాగింగ్ వంటివి ప్రతిరోజూ కనీసం అరగంట చేస్తే చాలు మీ బరువు క్రమేణా తగ్గుతుంది. జిమ్ కు వెళ్ళినా పరవాలేదు. వ్యాయామాలు చేస్తే కేలరీలు ఆరోగ్యకరంగా ఖర్చవుతాయి. అది బరువు తగ్గిస్తుంది.
పోషకాలు కల ఆహారం - ప్రాధమిక పోషకావసరాలు లేని ఆహారాన్ని తిని త్వరగా బరువు తగ్గాలనుకుంటే అది హాని కలిగిస్తుంది. కనుక పోషకాలు కల ఆహారం తీసుకుంటూ ప్రతిరోజూ వ్యాయామాలుచేయండి. అది నిదానంగా మీరు బరువు తగ్గేలా చేస్తుంది. పండ్లు, కూరగాయలు మీకు శక్తి నిచ్చి బరువు కూడా తగ్గిస్తాయి. నూనెలు కొవ్వులు తగ్గించండి. ఏ బరువు తగ్గే ప్రణాళిక వేసినా పోషకాహారం తినటం ప్రధానమని గుర్తించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications