Latest Updates
-
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.!
వెజిటబుల్ జ్యూస్ మరింత రుచికరంగా...?
వెజిటబుల్ జ్యూస్ లేదా పచ్చి కూరల రసం ఎలా తయారు చేస్తారు? తాజా కూరగాయలు అంటే పొట్ల, బీర, దోస, కేరట్ వంటి వాటిని రసంతీసి అందులో నిమ్మరసం లేదా తేనె వంటివి లేదా రుచికరమైన కొన్ని పండ్లు కలిపి తాగేటందుకు రుచికరంగా చేస్తారు.ఇది రోజూ తాగితే శరీరానికి మంచి ఆరోగ్యాన్నిస్తుంది. ప్రొటీన్లను సమకూర్చి, ఎంతో శక్తినిస్తుంది. ఇది ఒక చక్కని పోషకాలు కల ఆరోగ్య పానీయం.

వెజిటబుల్ జ్యూస్ ను బయట కొనుగోలు చేసేకంటే, ఇంటిలో తాజాగా తయారు చేసుకోవడం మంచిది. తక్కువ వేగంకల మిక్సర్ పై తయారు చేస్తే, తయారీ లో ఉండే వేడి లేదా ఆక్సిడేషన్ కారణంగా పోషకాలు లోపించకుండా ఉంటాయి. వెజిటబుల్ జ్యూస్ లో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యకర జీవితం కలిగిస్తాయి. ఎంతో శక్తినిస్తాయి. ప్రతి కూరగాయకు ఒక లాభం ఉంటుంది. కనుక ఒకే సారి అన్ని కూరల లాభాలు ఈ జ్యూస్ లో వచ్చేస్తాయి. ఈ వెజిటబుల్ జ్యూస్ వారానికి కనీసం మూడు సార్లు తాగితే మంచిది. మరి ఇది మరింత రుచికరంగా తాగాలంటే, మరి కొన్ని ఫ్లేవర్లు కలపాలి. రోగులు త్వరగా కోలుకోవాలంటే, వైద్యులు కూడా వెజిటబుల్ జ్యూస్ తాగమని సలహా ఇస్తారు. ఇది తాగితే మంచి ఆకలి కూడా అవుతుంది.
తాజా కూరగాయలు ఒక మంచి ఆహారంగా ఏ రకంగానైనా తీసుకోవచ్చు. కనుక రేపటి ఆరోగ్యం కొరకు నేటినుండే వెజిటబుల్ జ్యూస్ తాగటం ఒక అలవాటుగా చేసుకోండి. ఈ జ్యూస్ లో సుగంధాలు, నిమ్మ, మిరియం పొడి, యాలుకల పొడి, లవంగాలు మొదలైనవి కూడా రుచి కొరకు కలుపవచ్చు. ఏ విధంగా తయారు చేసినప్పటికి కూరగాయలలోని పోషక విలువలు పోకుండా చూసుకోవాలి. ఈ జ్యూస్ తాగుతూ, ఏవేని ఇతర కూరలు కూడా తినవచ్చు. ఏ ఆహారం తినినప్పటికి అది కంటికి ఇంపుగా, తినేందుకు తేలికగా ఉండాలి. కనుక మీ జ్యూస్ ను నిమ్మ, ఐస్ క్రీమ్, చెర్రీ పండు వంటి వాటితో అలంకరించి తాగేయండి. కూరగాయలను ఉడికించి కూడా రసంగా తయారు చేయవచ్చు. వివిధ రకాలుగా చేసినప్పటికి వాటిలోని పోషకాలో పోకుండా చూడాలి.
జ్యూస్ తీపిగా ఉండాలంటే, ఆపిల్, మామిడి, అరటిపండు వంటివి కూడా వేసి రసంగా చేయండి. ఇంటికి వచ్చిన అతిధులకు లేదా ఇతర కుటుంబ సభ్యులకు మండు వేసవిలో లేదా సెలవులలో అందిస్తూంటే తప్పక అభినందిస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications