Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
పచ్చి కూరలు తినండి ....వంటలు వెనకేయండి?
పచ్చి కూరలు తింటే వంటికి ఎంతో మంచిది. అయితే, వాటిని జీర్ణం చేసుకోగలిగి ఉండాలి. అయితే, కూరలు అన్ని రకాలు పచ్చిగా తినలేము. కొన్ని మాత్రమే తినగలం. ఈ కూరలు పచ్చివిగా ఇపుడే కాదు ప్రాచీన కాలంనుండి కూడా తినబడుతున్నాయి. వీటిని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొ రీతిలో తింటారు. బంగాళ దుంపలు పచ్చిగా తింటే....అవి విషంతో సమానం అంటారు. మరి కొన్ని వండితే గాని రుచి రాదు. బీన్స్ వంటివి పచ్చివైనా తినేయవచ్చు కాని రుచి రాదు. సలాడ్ కూరలు పచ్చివిగా తినేయవచ్చు. అవి ప్చివిగా మంచి రుచిని కూడా ఇస్తాయి. మరి మీ సలాడ్లకు మంచి రుచినిచ్చే కూరలేవో చూడండి.

సలాడ్లలో వేయదగిన పచ్చి కూరలు -
1. తోటకూర - పచ్చగా ఉండే ఈ ఆకు కూర సలాడ్లకు బాగా రుచినిస్తుంది. దీనిలో ఐరన్, బిటమిన్ బి 12 మరియు పీచు పుష్కలంగా ఉంటాయి.
2. కేరట్లు , బీట్ రూట్లు - వీటిలో లైకోపెన్ అనే పోషకం ఉంటుంది. ఇది కేన్సర్ నివారణకు పనిచేస్తుంది. కనుచూపు మెరుగుపరుస్తుంది. వీటిని వండితే, లైకోపెన్ అధికంగా అవుతుందని తాజా రీసెర్చి చెపుతోంది. అయితే, వీటిని పచ్చివిగా తింటే పీచు చాలా అధికం.
3. ఉల్లిపాయలు, టమాటాలు - ఉల్లిపాయల వాసన చాలామందికి ఇష్టంగా ఉంటుంది. వీటిలో ఫ్లేవనాయిడ్లు కూడా ఉంటాయి. ఇవి రక్తం గడ్డకట్టకుండా చేస్తాయి. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. రక్తనాళాలు గట్టిపడటం, లేదా సన్నపడటం వంటివి కూడా లేకుండా చేయవచ్చు. టమాటాలు కూడా చాలామంది పండువిగా తినేందుకు ఇష్టపడతారు.
4. బ్రక్కోలి - సూపర్ ఆహారాలలో బ్రక్కోలి ఇటీవలే చేరింది. దీనిలో పీచు అధికం. పచ్చగా ఉండి మంచి ఆరోగ్యం ఇస్తుంది. బ్రక్కోలి లో సల్ఫోరాఫేన్ అనే పదార్ధం ఉండి అది శరీరంలోని మలినాలు విసర్జించేందుకు సహకరిస్తుంది. చర్మం మెరుపు వస్తుంది. వయసు కనపడకుండా చేస్తుంది. బ్రక్కోలి పచ్చిది తింటే, దీనిలోని సల్ఫోరాఫేన్ అతి త్వరగా శరీరంలో చేరుతుంది.
5. బెల్ పెప్పర్ - కేలరీలు చాలా తక్కువ. కేన్సర్ ను నివారించే యాంటీ ఆక్సిడెంట్లు అధికం. విటమిన్ సి మరియు ఎ అధికంగా ఉంటాయి. పచ్చివిగా తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.
6. పొట్లకాయ, పచ్చి దోస - పొట్లకాయను, పచ్చి దోసాకాయను పచ్చిముక్కలుగా పెరుగులో కలిపి తినేయవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications