Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఆరోగ్యానికి మేలుచేసే హెల్తీ నట్స్
నట్స్: తక్కువ పరిమాణంలో ఉండి, కొద్దిసేపట్లోనే తినగలిగి ఎక్కువ శక్తిని ఇచ్చే పదార్థాలు నట్స్. ఎత్తులకు ఎక్కే పర్వతారోహకులు, స్కీయింగ్ చేసే క్రీడాకారులు వంటి వారు తమతో నట్స్‌నే ఆహారంగా ఉంచుకుంటారు. ఇవి తక్కువ స్థలాన్ని ఆక్రమించుకుని ఎక్కువ రుచికంగానూ, బలవర్థకంగానూ ఉండటం వల్ల వీటిని తమ ఆహారంలో ఎక్కువగా ఉపయోగించుకుంటుంటారు.

బాదాంలో: ఇందులో క్యాల్షియమ్ పాళ్లు ఎక్కువ. వైటమిన్-ఇ కూడా ఎక్కువే. అందుకే బాదాం గుండెకు మేలు చేస్తుంది. మన ఆహారనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణాశయానికి మంచి పెరుగు ఎంత మేలు చేస్తుందో, బాదాం చేసే మేలూ అంతకు తక్కువేమీ కాదు. శరీరంలో ఎక్కడైనా మంట, వాపులతో ఇన్‌ఫ్లమేషన్ ఉంటే బాదాం తినడం మంచిది. అప్పుడు అందులోని ఒమెగా-3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఆ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. కరోనరీ గుండెజబ్బులను నివారిస్తుంది.
పిస్తాలో: పిస్తా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్లు, ల్యూటిన్, జియాగ్జాంథిన్ అనే కెరొటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. పల్లీలు: మనం పల్లీలను తరచూ తింటూనే ఉంటాం. పల్లీల్లో ప్రోటీన్లు, పీచుపదార్థాలు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications