Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
మేలుకో....సహజత్వాన్ని సంతరించుకో...!

ప్రతి ఒక్కరూ మంచి చెప్పే వారే. మీరు తినేవి, తాగేవి అన్ని ఆహారాలు మంచివేనని బహుళ జాతి సంస్ధల ప్రకటనలు ప్రతిరోజూ, ప్రతి క్షణం మీకు తెలుపుతూనే వుంటాయి. కాని వాస్తవాలను గ్రహించటంలో మనలో కదలికలేదు. నిద్రలో నడుస్తూనే వున్నాం. అనారోగ్య జీవన విధానాలు ఆచరిస్తూనేవున్నాం. మనకి మనం అబధ్ధాలు చెప్పుకుంటూ మోసగించుకుంటున్నాం. అందులో మనన సమర్ధతలను తక్కువగా అంచనా ఏమాత్రం వేసుకోవటం లేదు. మనకి మనం మోసగించుకోవటమే కాక, మన చుట్టుపక్కల వున్నవారిని సైతం మోసం చేస్తున్నాం. అంతర్గత అవగాహన లేకుండా రాజకీయ, ఆర్ధిక పర్యావరణాల అవగాహనలు ప్రయోజనంలేదు. బయటి అవగాహనలు లేకుండా అంతర్గత అవగాహన ప్రయోజనం లేనిది.
ఇదంతా చదివే మీరు కలలు కంటున్నారు. నిద్ర నుండి లేవాలనే గట్టి నిర్ణయం చేసుకోండి. నేటిసమాజంలో ప్రతి అంశం, మరియు మన చుట్టూ వున్న ప్రతి ఒక్కరూ కూడా మనల్ని మరోమారు నిద్ర పుచ్చటానికే నడుం కట్టారు. ఇక మీరు ఏర్పరచుకొనే అవగాహన చాలా ఇరుకైనది. దానిలో ఎవరూ నడవలేరు. కనుక మనం చేయగలిగిందల్లా ఇప్పటికే ముందుకు వెళుతున్న వారి అడుగుజాడలలో నడవటమే. అందులోనే మనం ఎదగాలి. మనం తినే ఆహారాలను తయారుచేసుకొని తినాలి. అది ముందుగానే తయారు చేయబడి, కొనబడే ఆహారం కాదు. ఒకరు తినేది మరొకరికి విషం కావచ్చు.
మన జీవితాలను మనం గమనించాలి. మన ప్రయత్నం లేకుండా మన పెదాలు కదులుతున్నాయంటే, మనం అబద్ధంచెపుతూ మనల్ని మనం మోసగించుకుంటున్నాం. బయటిది ఏదీ మనను సంతృప్తి పరచలేదు. వాస్తవం లేదా నిజం ఎపుడూ తియ్యగా వుండదు, మన దైనందిన జీవితానికి స్నేహపూరితంగా వుండదు. మనకుమనం తయారు చేసుకున్నమరియు ఇంకా తయారు చేస్తూవున్న ప్రపంచాన్ని చూడండి, మనం కనుక వాస్తవాలను తెలుసుకోలేకుంటే మన అజాగ్రత్తలు మనలను నాశనం చేస్తాయి. గ్రహించగలిగితే, అవి మనలను శక్తివంతులను చేస్తాయి. కాని దానికి ఎంతో ధైర్యం కావాలి. అసలు రహస్యం ఏమిటంటే, రహస్యం అనేది లేకపోవటమే.
ఈ తప్పుడు అవగాహనలు, బోధనలు మన అహంకారంనుండి వచ్చి బలపడి కూర్చున్నవే. ఇవి శక్తివంతం కానివని శాశ్వతం కానివని గ్రహించాలి. అపుడే మనకు మనం నిద్ర లేవగలం. కాని అది చాలా కష్టమైన పని. కష్టం కాదని ఎవరైనా అంటే అది ఒక తియ్యటి అబద్ధమే అవుతుంది. కనుక మీకు మీరే మేల్కొనండి. ఒక మానవుడిగా మీ జీవన విధానం మీరు ఆచరించండి. ప్రకృతి అందించిన సహజ ఆహారాలు తింటూ ఆరోగ్యవంతులుగా వుండండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications