Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
కాఫీ అసలు ఎందుకు మానాలి?
చాలామంది సాధారణంగా కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదంటారు. దీనికి కారణం బహుశ అందులో వుండే, కెఫైన్ అనే మత్తు పదార్ధం అయివుండవచ్చు. కాఫీ అధికంగా తాగితే అనారోగ్యమే. కేఫైన్ నిద్రను తగ్గిస్తుంది. శరీరంలో డీహైడ్రేషన్ కలిగిస్తుంది. కనుక, కాఫీ తక్కువ తాగాలి. అయితే, వేడి వేడి ఈ కాఫీ పానీయం వెనుక కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి. కనుక అసలు కాఫీ ఎందుకు తాగాలనేది పరిశీలిద్దాం.

కాఫీ తాగటం ఎందుకు వదిలేయరాదు?
కాఫీ గుండెకు మంచిది. చాలామంది రీసెర్చర్లు, తగు మాత్రంగా అంటే రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు కాఫీ తీసుకుంటే గుండెకు ఆరోగ్యం అని చెపుతారు. కాఫీ గుండె సంబంధిత వ్యాధులు అరికడుతుంది. కాఫీలో వుండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలలో మంటలను అరికట్టి రక్త సరఫరా మెరుగుపరుస్తాయి. కాఫీ తాగిన వెంటనే మీలో రక్తపోటు, గుండె కొట్టుకునే రేటు పెరుగుతాయి. అయితే దీర్ఘకాలంలో మీ ఈ స్ధాయిలు యాంటీ ఆక్సిడెంట్లలో వున్న నైట్రిక్ యాసిడ్ కారణంగా నియంత్రించబడతాయి.
తలనొప్పి తగ్గిస్తుంది - తలనొప్పి అధికంగా వుందా? వేడి వేడి కాఫీ ఒక కప్పు తాగండి. అందులో కొద్దిగా క్రీమ్ కూడా కలిపి ప్రతి సిప్ ఆనందించండి. మరి ఇంత మేలు చేసే కాఫీ ఎందుకు వదలాలి? ఎపుడైనా మీకు బద్ధకం లేదా తలనొప్పి వుంటే, దానికి జవాబు ఒక కప్పు కాఫీ మాత్రమే. కాఫీలో వుండే కేఫైన్ కనుక మెదడుకు చేరితే, మీరు చాలా చురుకైపోతారు. మీ తలనొప్పి నియంత్రించబడుతుంది. ఎందుకంటే, కేఫైన్ మీ బ్రెయిన్ సెల్స్ ని చురుకు పుట్టించి బద్ధకాన్ని పారద్రోలుతుంది.
నిద్రను కూడా నియంత్రిస్తుంది - రాత్రిపూట లేట్ గా పని చేసుకోవాలి. కాని నిద్ర ముంచుకు వచ్చేస్తూంటుంది. అటువంటపుడు ఒక కప్పు కాఫీ తాగేయండి. మీ మైండ్ ఎంతో అలర్ట్ అయిపోతుంది. దీనికి కారణం కేఫైన్. కొద్ది గంటలవరకు నిద్ర పోరాదంటే ఒక కప్పు కాఫీ చాలు. మీరు రాత్రివేళ నిద్ర ఆపుకుంటూ ఎంత చదవాలనుకున్నా లేదా పనులు చేసుకోవాలన్నా, రెండు కప్పుల కాఫీకి మించి తాగకండి.
జ్ఞాపక శక్తి బలపరుస్తుంది - మీ మెమొరీ పవర్ పెరగాలని ఉందా? ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కప్పులు కాఫీ తాగండి. కేఫైన్ అల్జీమర్స్ మరియు పార్కిన్ సన్ వంటి వ్యాధులకు కూడా పరిష్కారం. కాఫీలో వుండే యాంటీ ఆక్సిడెంట్లు, న్యూరో ట్రాన్స్ మిటర్లపై బాగా పనిచేస్తాయి.
ప్రొస్టేట్ కేన్సర్ నివారణ - పురుష ప్రొస్టేట్ గ్రంధిలో వచ్చే ఒక కేన్సర్ ను ప్రొస్టేట్ కేనన్సర్ అంటారు. కాఫీ కేఫైన్ తో తాగినే కేఫైన్ లేకుండా తాగినా సరే అది పురుషులలోని ప్రొస్టేట్ కేన్సర్ ను నివారిస్తుంది. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు మంట కలిగించని గుణాలు వుండి శరీరంలో వివిధ మంటలనను తగ్గించి ఉపశమనమిస్తుంది. కనుక పురుషులు రోజుకు కనీసం ఒక కప్పు కాఫీ అయినా తాగాలి.
మరి కాఫీ ఎందుకు మానేయ రాదు? అనేదానికి ఈ కారణాలు మీకు చాలు. ఈ పానీయం ఇచ్చే ఈ కొద్దిపాటి ఆరోగ్య ప్రయోజనాలు మీకు ఎంతో మేలు చేస్తాయి. అయితే, కాఫీ అధికంగా తాగితే, ఆరోగ్యానికి హాని అని గుర్తించండి. దానిని నియంత్రించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications