Latest Updates
-
వేసవిలో కడుపుకు హాయినిచ్చే బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..5 నిమిషాల్లో దహీ పోహా ఎలా చేయాలంటే.. -
ఆంధ్రప్రదేశ్‌లో తప్పకుండా సందర్శించాల్సిన 10 అతి పురాతన శివాలయాలు -
12 ఏళ్ల తర్వాత కర్కాటకంలో గురు ఉచ్ఛ స్థితి: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీదే! -
ధనస్సు, మీన రాశుల వారికి గురు గ్రహ అనుగ్రహం.. ఎవరికి ధన లాభం? - గురువారం, 04 జూన్ 2026 -
బరువు త్వరగా తగ్గాలంటే ఎక్సర్ సైజ్ ఏ టైమ్ లో చేయాలి? -
భర్త/భార్య పక్కనే ఉన్నా 'నాకు అర్థమయ్యే వాళ్లెవరూ లేరు' అనిపిస్తోందా? కారణం ఇదే -
నెలాఖరులో డబ్బు తక్కువైనప్పుడు భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడతారో తెలుసా? -
సమ్మర్లో చల్లచల్లగా మిల్క్‌షేక్, మాక్‌టెయిల్.. ఈ ఫ్రూట్స్‌తో స్పెషల్ డ్రింక్స్ -
కొవిడ్ తెచ్చిన కష్టాలు.. యువతలో పెరుగుతున్న తుంటి మార్పిడి సర్జరీలు.! -
కళ్లలో నీళ్లు తిరుగుతున్నా ఆపకుండా తినేంత టేస్టీ..మహారాష్ట్ర స్పెషల్ తేచ్చా చికెన్..ఈజీగా ఎలా చేయాలంటే..
పరుగెత్తడం మొదలు పెట్టండి పది లాభాలు పొందండి...!
ప్రస్తుత కాలంలో ఆరోగ్యం అనేది అందరికీ అవసరమే. ఇంటి పని, ఆఫీస్ పనితో సతమతమయ్యే వారు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. శరీరం అనుకున్న షేప్ కు రావాలన్నా, మంచి ధృఢత్వం కలిగి వుండాలన్నా జాగింగ్ మంచి వ్యాయామం. కేలరీలు ఖర్చవటమే కాదు శరీరం, మైండ్ అన్నీ ఆరోగ్యంగా వుంటాయి. రకరకాల వ్యాయామాలు చేసే కంటే జాగింగ్ చేస్తే చాలనుకుంటారు చాలామంది. జాగింగ్ వల్ల శరీరంలోని కండరాలు అన్నీ ఎంతో అధికంగా శ్రమిస్తాయి. జాగింగ్ అనేది గుండె సంబంధితంగా కూడా బాగా పనిచేస్తుంది. గంటలతరబడి నడవటం కంటే కూడా శారీరక ఫిట్ నెస్ కనుక అనుమతిస్తే, జాగించేయటం మెరుగైన వ్యాయామంగా భావించాలి.
చాలామంది శరీరాన్ని, మనసుని కంట్రోల్లో ఉంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అనేక వ్యాయామాలు చేస్తున్నారు. అందులో భాగమే జాగింగ్. తెల్లవారు జామునే దగ్గర్లో ఉన్న పార్క్‌ల్లోను, లేకపోతే ఆసమయంలో రోడ్లు ఖాళీగా ఉంటాయి కనుక రోడ్లమీద, వాకింగ్, జాగింగ్‌లు చేస్తూవుంటారు. రోడ్ల మీద కన్నా, చెట్లూ, పచ్చని లాన్‌లు ఉన్న పార్క్‌ల్లో చేస్తే మంచి ఫలితంత ఉంటుంది. కానీ, మన శరీరసౌష్టవాన్ని బట్టి ఎంత సేపు జాగింగ్ చేయాలి, ఎన్ని రౌండ్లు చేయాలి అనే విషయాలు ముందుగా తెలుసుకోవడం మంచిది. మన రక్తప్రసరణ, బరువు ఏస్థాయిలో ఉన్నాయో నిపుణులతో సంప్రదించి వారు చెప్పిన పద్దతిని పాటిస్తే ఆరోగ్యం మన చెప్పుచేతల్లో ఉంటుంది.
జాగింగ్ ను వల్ల మరో మహత్యం ఏంటంటే ఈ వాయామాన్ని మధ్యవయస్సు దాటిన తర్వాత చేయడం తగదు. మధ్యవయస్సు దాటినవారికి ఎక్కువ శ్రమకలిగించే వ్యాయామం చేయడం కుదరు. యవ్వనస్తులకు మరియు పెద్దవారికి జాగిగ్ చాలా ఉత్తమం. యవ్వనంలో జాగింగ్ చేయడం వల్ల శరీరం ఫిట్ నెస్ వయస్సు మళ్లిత తర్వాత కాపాడుకోవచ్చు. దాంతో పాటు చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చు. మరి జాగింగ్ వల్ల కలిగే ఆరోగ్యం ప్రయోజనాలు చూడండి...

బరువు తగ్గిస్తుంది: జాగింగ్ చేయడం వల్ల ఖచ్చితంగా వరువు తగ్గుతారు. నడక కంటే పరుగెత్తడం వల్ల కొవ్వు ఎక్కువ శాతం కరుగుతుంది. అందులో సందేహం లేదు. జాగింగ్ తో పాటు మరికొన్ని వ్యాయామాలు మరియు మంచి డైయట్ ఫాలో ఐతే చాలు తప్పనిసరిగా మంచి ఫలితం ఉంటుంది.

ఒత్తిడి: ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడిని నివారించవచ్చు. వ్యాయామంలో జాగింగ్ ఉత్తమమైనది. జాగింగ్ ఒత్తిడిని తగ్గించే ఒక మంచి ఉపాయం. మైండ్ ప్రశాంతంగా పెట్టుకుంటూ శరీర కదలికలు పై దృష్టి పెడితే శరీరానికి అలసట తగ్గి మనస్సు ప్రశాంతమవుతుంది. నేటి రోజులలో ఒత్తిడి సర్వ సాధారణమైంది.

మెదడుకావల్సిన శక్తిని అందిస్తుంది: మన చేసే పని మీద మనస్సు ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. కాబట్టి ప్రతి రోజూ జాగింగ్ చేయడం వల్ల జ్ఝాపకశక్తిని పెంచడంతో పాటు మైండును ప్రశాంతంగా ఉంచుతుంది. దాంతో ఎంత కష్టమైన పనైనా సులభంగా అధిగమించి శక్తిని, పొందుతారు.

సామర్థ్యాన్నిపెంచుతుంది: జాగింగ్ చేయడం వల్ల అలసట తగ్గుతుంది. జాగింగ్ చేయడం వల్ల శరీరంలో సత్తువను పెంచి శరీరానికి కావల్సినంత సామర్థ్యాన్ని అందిస్తుంది.

వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది: జాగింగ్ చేయడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేందుకు, ఎటువంటి వ్యాధులనైనా ఎదుర్కొనే శక్తిని పెంచుతుంది. కాబట్టి ప్రతి రోజూ జాగింగ్ చేయడం వల్ల చిన్న జబ్బులు జలుబు,దగ్గు, జ్వరం మొదలకుని క్యాన్సర్ వరకూ పోరడగలిగే వ్యాధినిరోధక శక్తిని పొందవచ్చు.

ఎముకలను బలంగా ఉండేలా చేస్తుంది: జాగింగ్ చేయడం వల్ల కండాలమీద, ఎముకలమీద ఒత్తిడి ఎక్కువై ఎముకల సాంద్రత పెరుగుతుంది. వేగంగా నడవటం, జాగింగ్, ఏరొబిక్స్, డాన్స్ చేయడం, ఆటలు ఆడటం లాంటివి మంచి వ్యాయామం.

ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది: జాగింగ్ చేయడం వల్ల శరీరానికి మాత్రమే కాదు, మన మనస్సు మీద కూడా ప్రభావం చూపెడుతుంది. ఏ పనిచేయాలన్నా ఒక గోల్ సెట్ చేసుకొనే అవకాశాన్ని స్పూర్తిని పెంచుతుంది.

అనారోగ్యాన్ని తగ్గిస్తుంది: వయస్సు పెరిగే కొద్ది ఎదురయ్యే అనారోగ్య సమస్యలు మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సమస్యలు మరియు ఇతర రోగాలు పెరుగుదలను తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తం శరీరం అంతట సరఫరా అవ్వడానికి సహాయపడి అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది.

ఆత్రుత(ఉద్వేగాన్ని)ను తగ్గిస్తుంది: క్రమంగా జాగింగ్ చేయడం వల్ల ఆత్రుత లేదా ఆరాట పడటానికి ఉపయోగపడే హార్మోనులను తగ్గించడానికి సెరోటినైన్ కు సహాయపడుతుంది. మనస్సు నియంత్రణలో ఉంచడానికి దోహదపుడుతుంది.

సంతోషంగా ఉండేదుకు సహాయపడుతుంది: జాగింగ్ చేయడం వల్ల మనం సంతోషంగా ఉండేదుకు ఉత్పత్తి అయ్యే హార్మోన్లను (ఎండ్రోఫిన్స్) సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications