Latest Updates
-
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.!
బాడీఫ్యాట్ కరిగించి, కొన్ని పౌండ్ల బరువు తగ్గించే బెస్ట్ ఫుడ్స్
మీరు బరువు తగ్గించే డైట్ ప్లాన్ లో ఉన్నారా? ఊబకాయం, అధిక బరువు తగ్గించుకోవడానికి కొన్ని వందలు కాదు, కాదు కొన్ని వేల మంది ఉన్నారు. అలాంటి వారు బరువు తగ్గించుకోవడానికి, శరీరంలో క్రొవ్వు కరిగించుకోవడానికి అనేక రకాల ఆహారాలున్నాయి. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో క్రొవ్వు కరిగిపోతుంది. కాబట్టి మీరు చాలా త్వరగా అందంగా కనబడాలంటే ఈ ఆహారాలను తీసుకోవాల్సిందే.
శరీరంలో కొవ్వు కరిగించుకోవాలంటే మీరు ప్రతి రోజూ తీసుకొనే ఆహారంతో పాటు ఈ ఆహారాలను కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఉదాహారణకు : మీ రెగ్యులర్ భోజనంతో పాటు పచ్చి ఉల్లిపాయ ముక్కలను తీసుకోవడం వల్ల కొన్నిక్యాలరీలను శరీరం నుండి కరిగించుకోవచ్చు. పచ్చి ఉల్లిపాయల్నాగే శరీరంలో క్రొవ్వు కరిగించే మరికొన్ని అటువంటి ఆహారాలున్నాయి .
ఎవరైతే బరువు తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నారో, అటువంటి వారికి వ్యాయామాలు బాగా పనిచేస్తాయి. అయితే, బరువు తగ్గుతూ, యథావిధిగా శరీరంలో కొవ్వు కరిగించే ఆహారాలు, అధిక ప్రోటీనులు మరియు ఫైబర్ పుష్కలంగా కలిగి ఉండి, బాడీ ఫ్యాట్ ను కరిగించడానికి అద్భుతంగా సహాయపడుతాయి. బాడీ ఫ్యాట్ కరిగించే అటువంటి ఆహారాల లిస్ట్ ను బోల్డ్ స్కై మీకోసం అంధిస్తోంది. ఇవి కొవ్వు కరిగించడంతో పాటు, మీకు అసరం అయ్యే ఎనర్జీని కూడా అంధిస్తుంది.
బాడీ ఫ్యాట్ కరిగించేందుకు సహాయపడే ఆహారాలు:

1. పచ్చి ఉల్లిపాయ :
మీ భోజనంతో పాటు, సైడ్ లో పచ్చిఉల్లిపాయ ముక్కలు కూడా తినండి . ఉల్లిపాయలోని రసం శరీరంలో కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేసి, కొవ్వును కరిగిస్తుంది.

2. తేనె:
రెండు చెంచాలా పంచదార కంటే అరచెంచా తేనె ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతుంది. మీ శరీరంలోని కొవ్వు కరిగించుకోవాలంటే, తేనె ఒక అద్భుత ఔషధంగా మీరు తీసుకొని బాడీని స్లిమ్ గా మార్చుకోవచ్చు.

3. పసుపు:
పసుపు వర్ణంలో ఉండే ఈ ఇండియన్ మసాలా దినుసు, మన ఇండియాలో ప్రతి ఇంట్లోనూ వివిగా ఉపయోగిస్తుంటారు. పసుపులో ఔషధగుణాలతో పాటు యాంటీబ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉండి మీ శరీరంలోని కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేసి,కొవ్వును కరిగిస్తుంది.

4. యాలకలు:
ఇండియన్ మసాలా దినుసుల్లో ఇది ఒకటి. ఇది జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. మీరు హెవీ మీల్స్ తీసుకొన్నప్పుడు, ఒక పీస్ యాలకను నోట్లో వేసుకొని నమలండి.

5. పచ్చిమిర్చి:
త్వరగా బరువు తగ్గాలనుకొనే వారికి పచ్చిమిర్చి బాగా సహాయపడుతుంది. మీ రెగ్యులర్ డైట్ లో పచ్చిమిర్చిలను తీసుకోవాలి, పచ్చిమిర్చిలోని పెప్పైన్ కంటెంట్ కొవ్వు కరగించడానికి అద్భుతంగా సమాయపడుతుంది.

6. వెల్లుల్లి:
మీ శరీరంలో కొవ్వును కరిగించుకోవాలనుకుంటే, మీరు ప్రతి రోజూ మీ వంటల్లో తప్పనిసరిగా వెల్లుల్లిని చేర్చడం మర్చిపోకండి . వెల్లుల్లిలో కొవ్వు కరిగించే కొన్ని యాసిడ్స్ పుష్కలంగా ఉండి, ఇన్సోలబుల్ ఫ్యాట్స్ ను కరిగిస్తుంది.

7. ఓట్ మీల్:
బరువు తగ్గించే ప్లాన్ లో మీరు ఉన్నప్పుడు ఓట్ మీల్ చాలా అద్భుతమైన ఆహారం. ఓట్స్ ఫ్యాట్ ను కరిగించడం మాత్రమే కాదు. బరువు పెరగకుండా కంట్రోల్ చేస్తుంది.

8. రాగులు:
మీ శరీరంలో బరువు తగ్గించుకోవాలని నిర్ణయించుకొన్నప్పుడు రాగులు ఒక అద్భుత పరిష్కార మార్గం. ఒక కప్పు రాగుపిండి మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే కొన్ని పౌండ్ల బరువు తగ్గించుకోవచ్చు.

9. క్యాబేజ్:
తాజాగా ఉండే క్యాబేజ్ ను రోజులో ఒక సారి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. త్వరగా బరువు తగ్గాలనుకొనే వారు, క్యాబేజ్ జ్యూస్ బాగా హెల్ప్ అవుతుంది.

10. గుడ్లు:
ఉడికించి గుడ్లు ఒక ఆరోగ్యకరమైన ఆహారం. ప్రతి రోజూ లేదా వారంలో మూడు సార్లు ఉడికించిన గుడ్డు యొక్క తెల్లని పదార్థ తీసుకోవడం వల్ల ఇది కొన్న టన్నుల ఎనర్జీని మీకు అంధిస్తుంది. దాంతో పాటు బరువును కూడా తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications