Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
7రోజుల్లో బరువు తగ్గించే ఎఫెక్టివ్ ఫ్రూట్ జ్యూసులు
మహిళలు ఎల్లప్పుడూ వారి అందం మరియు శరీర బరువు మీద మనస్సు పెడుతుంటారు. ముఖ్యంగా బాడీ మాస్ ఇండెక్స్ (శరీర బరువును తెలిపే సూచిక)మీద వారి దృష్టి పెడుతుంటారు. ముఖ్యంగా బరువు సమస్యలు మహిళల యొక్క మానసిక సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఏమైన కొద్ది మొత్తంలోనైనా బరువు పెరిగితే చాలు అప్పుడు ఆమె కంగారుపడుతూ ఎంత బరువు పెరగాము అన్ని కొలతలు మొదలెట్టేస్తుంటారు. ప్రస్తుత రోజుల్లో మోడ్రన్ మహిళలందరూ బరువు పెరుగుతామన్న భయంతో ముందు జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టేశారు.
అంతే కాదు, రెగ్యులర్ డైట్ లో మార్పులు, వ్యాయామాలు కూడా చేస్తూ వారి బరువును సమతుల్యంగా ఉంచుకోవడానికి అనేక మార్గాలు వెతుక్కుంటున్నారు. అయితే ఈ ప్రణాళికలు కొన్ని నెలలు మాత్రమే ఫలితాన్ని ఇచ్చినా తర్వాత తిరిగి అదే స్థాయికి చేరుకుంటారు. కాబట్టి, నిపుణుల అభిప్రాయం ప్రకారం మహిళల్లో ఏర్పడే ఆ అదనపు బరువు తగ్గించుకోవడానికి మహిళలు తమంతట తాము నిజంగా బరువు తగ్గడానికి ఎఫెక్టివ్ గా పనిచేసే డైట్ ను మాత్రమే అనుసరించాలని చెబుతున్నారు.
ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు బరువు తగ్గాలని కోరుకుంటారు, అందుకు, బరువు తగ్గించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. అంతే కాదు, బరువు తగ్గించే పరికరాలు కూడా మార్కెట్లో అనేకం ఈ రోజు అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో ఉంటూనే బరువు తగ్గించే పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. బరువు తగ్గించే ఈ మార్గాలే కాకుండా, బరువు తగ్గించేందుకు మరొక ఉత్తమ జ్యూస్ డైట్ ఉన్నది. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
మెత్తగా, తాజాగా, జ్యూసీగా ఉండే పండ్లతో తయారు చేసే తాజా జ్యూసులు మీ పొట్టను నిండుగా ఉండేలా చేయడమే కాకుండా, ఆకలి కోరికలను అరికట్టేందుకు సహాయపడేవిగా ఉన్నాయి. ముఖ్యంగా గుర్గుంచుకోవల్సిన మరొక ముఖ్య విషయమేంటంటే మీరు బరువు తగ్గాలనే విశ్వాసం మరియు లక్ష్యం పెట్టుకోగలిగినప్పుడే అది సాధ్యం అవుతుందని తెలుసుకోవాలి. మరి బరువు తగ్గించే కొన్ని ఫ్రూట్ జ్యూసులున్నాయి. వాటిని పరిశీలించి ఆ బరువు తగ్గించే జ్యూసులు మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని నాజూగ్గా తయారవ్వండి.

పుచ్చకాయ జ్యూస్:
బరువు తగ్గించే, డైట్ ఫ్రూట్ అని చాలా మందికి తెలియదు. కానీ, బరువు తగ్గించడంలో ఇది ఒక బెస్ట్ ఫ్రూట్ . తాజాగా ఉండే వాటర్ మెలోన్ గింజలు లేకుండా జ్యూస్ ను తయారు చేసి రోజుకు మూడు సార్లు భోజనానికి ముందు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనం పొందవచ్చు.ఇందులో 80 శాతం కంటె ఎక్కువ నీరు ఉంటుంది. అందువల్ల ఇది దాహాన్ని తీర్చి, డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. పుచ్చకాయలో శక్తి చాలా తక్కువ. ప్రోటీన్ తక్కువ. కొవ్వు తక్కువ. కొలెస్టరాల్ అసలు ఉండదు. పిండి పదార్థాలు ఎక్కువ. పీచు పదార్థాలు ఎక్కువ. సోడియం తక్కువ. విటమిన్లలో విటమిన్-ఎ, ఫోలేట్, విటమిన్-సిలు ఎక్కువ. 90 శాతం నీరు వుండే కాయ పుచ్చకాయ. దాహార్తిని తీర్చడం తోపాటు బరువు తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది.

పైనాపిల్ జ్యూస్:
పైనాపిల్ జ్యూస్ ఎనర్జీని అంధించడంలో మరో అద్భుతమైన పండు. అంతే కాదు శరీరానికి కావల్సిన న్యూట్రీషియన్స్ ను పుష్కలంగా అందిస్తుంది. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది. ఇంకా మీ శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. దాంతో బరువు తగ్గడం తేలికవుతుంది. ఈ జ్యూస్ ను మరీ చిక్కగా కాకుండా పల్చగా తయారు చేసి, బాగా ఆకలిగా ఉన్నప్పుడు తీసుకోవాలి.

అవొకాడో జ్యూస్:
అవొకాడో జ్యూసులో చాలా హెల్త్ మరియు స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి రోజూ అవొకాడో జ్యూస్ ను త్రాగితే మంచి ఆరోగ్యంతో పాటు, కాంతివంతమైన చర్మ ఛాయను పొందుతారు. బరువు తగ్గాలనుకొనేవారు తప్పకుండా తీసుకోవల్సిన బెస్ట్ ఫ్రూట్ ఇది. అవొకాడో జ్యూస్ లో తేనే మిక్స్ చేసి తాగడం వల్ల టమ్మీ తగ్గుతుంది .

టమోటో జ్యూస్:
టమోటో లో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. ఇది ఆరోగ్యం మాత్రమే కాదు, న్యూట్రీషియన్స్ కూడా పుష్కలమే. టమోటోలో ఉన్నలైకోపిన్ మొత్త ఆరోగ్యానికే మేలు చేస్తుంది. వారంలో మీరు బరువు తగ్గాలంటే టమోటో డైట్ జ్యూస్ మొదలుపెట్టాల్సింది. మూడు టమోటోలను ఉడికించి, గ్రైండ్ చేసి, అందులో బ్రౌన్ షుగర్ జోడించి రోజుకు మూడు సార్లు, వారం మొత్తం తాగితే మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మ జ్యూస్:
లెమన్ జ్యూస్ మరో రిఫ్రెషింగ్ డ్రింక్. ఈ జ్యూస్ మీ శరీరాన్ని, చర్మాన్ని హైడ్రేషన్లో ఉంచడమే కాదు, బరువును కూడా తగ్గిస్తుంది. నిమ్మరసంకు ఉప్పు చేర్చి, కొద్దిగా తేనె మిక్స్ చేసి తాగడం వల్ల శరీరంలో అధనపు వేడిని తగ్గిస్తుంది. మీ ఫ్లాట్ టమ్మీని తగ్గించాలంటే ఇది బెస్ట్ జ్యూస్.

గ్రేఫ్ ఫ్రూట్ జ్యూస్:
గ్రేఫ్ ప్రూట్ లో విటమిన్స్ మరియు మంచి సాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగి ఉంటాయి. ఒక వారంలో బరువు తగ్గేలా చేస్తుంది. గ్రేప్ ఫ్రూట్ మీ చర్మానికి కూడా చాలా మంచిది. ఇది చర్మం మెరిసేలా చేస్తుంది.

ఆరెంజ్ జ్యూస్:
నారింజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. చర్మం ముడుతలు పడకుండా, టైట్‌గా ఉంచే కొలాజిన్ ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక నారింజను తినడం మంచిది. రోజుకు రెండు వందల గ్రాముల విటమిన్ సి అవసరమవుతుంది. నారింజ జ్యూస్ తాగడం కన్నా పండు రూపంలో తినడమే మంచిది.

గ్రేప్ జ్యూస్:
ఇందులో విటమిన్స్, మినిరల్స్, క్యాల్షియం, కాపర్, ఐయోడిన్ ఫాస్ఫరస్ మరియు పొటాషియం వంటివి ఫుష్కలంగా ఉంటాయి. అంతే కాదు ఇందులో గుండె ఆరోగ్యానికి, గౌట్, కీళ్ళనొప్పులకు, లివర్ సమస్యలకు, హెమరాయిడ్స్ మరియు ఇతర అలెర్జీలను పోగొట్టేందుకు సహాయపడే మరికొన్ని అధనపు ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

జామకాయ జ్యూస్:
జామకాయలో విటమిన్ 'ఏ' మరియు విటమిన్ 'సి' నిల్వలు అధికంగా ఉంటాయి. వీటి గింజలు కూడా ఒమేగా-3, ఒమేగా-6 కరుగని కొవ్వు ఆవ్లూలు, పీచు పదార్థాలు ఎక్కవగా కలిగి ఉంటాయి. ఒక జామపండులో విటమిన్ 'సి' నిల్వలు ఒక నారింజపండులో కన్నా నాలుగురెట్లు అధికంగా ఉంటాయి. జామకాయలో వుండే పోషకాలు ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి ఎంతో మేలు చేస్తా యి. ఆరోగ్య సంబంధిత వ్యాధులు నయమవుతాయి. క్రమంగా చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

బెర్రీ జ్యూస్ లు:
కొన్ని పౌండ్స్ బరువును తగ్గించుకోవాలా? అయితే ఈ పుల్లని తియ్యని జ్యూస్ త్రాగాల్సిందే. అంతే కాదు ఇది యూరినరీ ఇన్ఫెక్షన్ కు దారితీసే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.బెర్రీస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దాంతో అవసరమైన క్యాలొరీలను పొందవచ్చు. ఒక కప్పు స్ట్రాబెర్రీ జ్యూస్ తాగడం వల్ల వెంటనే తాజా అనుభూతిని పొందవచ్చు.



Click it and Unblock the Notifications











