Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బరువు తగ్గించే ముత్యాలా గుమ్మ: దానిమ్మ
తినాలంటే ఓపిగ్గా గింజలు వలుచుకోవాలి... పోనీ కష్టపడి వలిచి తిందామా అంటే అద్బుతమైన రుచి కాదు. అర్ధమైంది కదా ఆపండెదో.... అవును, దానిమ్మ... కాని ఈ పండు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.చూడ ముచ్చటైన రూపం, లోపల ముత్యాలాంటి గింజలతో ప్రతి ఒక్కరికీ నచ్చే ఫలం ఏదంటే దానిమ్మ అని ఠక్కున చెప్పవచ్చు. కేవలం రుచిగా ఉండే ఫలంగానే కాక మనలోని అనేక రకాల రుగ్మతలను నివారించే ఓ దివ్య ఔషధంగా దానిమ్మ ఉపయోగపడుతుందని తెలిస్తే ఆశ్చర్యం వేయకమానదు.
దానిమ్మ లో పొటాషియం, విటమిన్ "ఏ" విటమిన్ "సి" విటమిన్ "బి 6", ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. తరచూ తింటే ఇందులో ఉండే యాంటి అక్షిడెంట్స్, బ్రెస్ట్ , ప్రోస్టేట్ , స్కిన్ కాన్సెర్ , రాకుండా కాపాడుతాయి. సహజ వయగ్ర లాగ పనిచేసి అంగస్తంబన సమస్యను నివారిస్తాయి. రోజుకో గ్లాసు దానిమ్మరసం గర్బినిలకు ఎంతో ప్రయోజనకారి. దానివల్ల కడుపులో బిడ్డకు కావలసినంత ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది.

క్రమం తప్పకుండ దానిమ్మ పండు తింటే చర్మం పై ముడతలు రాకుండా నివారిస్తుంది. నీళ్ళ విరేచినాలతో బాధపడుతున్నప్పుడు దానిమ్మరసం తాగితే త్వరగా ఉపసమనం లభిస్తుంది.
ఇందులో ఉండే యాంటి వైరల్, యాంటి బాక్టిరియాల్ గుణాలు గొంతు నొప్పులనూ నివారిస్తుంది. శరీరం లో కొవ్వు పేరుకోకుండా చూసేందుకు దానిమ్మ పండు చాల బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది. దానిమ్మ లో ఉండే యాంటి ఆక్సిడెంట్లు రొమ్ము ,పెద్ద పేగు ,ఊపిరి తిత్తుల కాన్సర్లు రాకుండా చూస్తుంది .
అనేక వ్యాధులతో పోరాడే శక్తివంతమైన దానిమ్మ:క్లిక్ చేయండి
దానిమ్మ రసం అధిక రక్తపోటు సమస్య తగ్గిస్తుంది .ఆస్ట్రియో పోరోసిస్ ,మధుమేహం ,గుండె జబ్బు ల బారిన పడకుండా కాపాడుతుంది .ఇది పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోనివ్వదు. దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వంద గ్రాముల దానిమ్మలో 83 కెలోరీలతో కూడిన సామర్థ్యం శరీరానికి లభిస్తుంది. ఇది ఆపిల్ కంటే అధికం. కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టే దానిమ్మలో పీచు పదార్థాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
100 గ్రాముల దానిమ్మలో నాలుగు గ్రాముల పీచు ఉంది. ఇది జీర్ణశక్తికి, ప్లేగు సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. ఇంకా బరువు తగ్గాలనుకునే వారు రోజుకో దానిమ్మను తీసుకోవచ్చు. దీనిని క్రమం తప్పకుండా తింటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. రక్త ప్రసరణ క్రమంగా ఉంటుంది. క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చు. విటమిన్ సి పుష్కలంగా ఉండే దానిమ్మలో ధాతువులు, క్యాల్షియం, కాపర్, పొటాషియం, మాంగనీస్‌లు కూడా ఉన్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications