Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
10 రోజుల్లో ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే వాటర్ డైట్
బరువు చాలా త్వరగా తగ్గించుకోవాలనుకుంటారు. త్వరగా తగ్గించుకోవాలంటే, ఆరోగ్యకరమైన మార్గంలో ఎలా తగ్గించుకోవాలి?అలా అతి త్వరగా బరువు తగ్గించే మార్గాల్లో ఒకటి వాటర్ డైట్. పది రోజు వాటర్ డైట్ కొన్ని కిలోల బరువును ఆరోగ్యకరంగా తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. బరువు తగ్గించుకోవాలని ఖచ్చితంగా నిర్ధారించుకొనే వారు, వాటర్ డైట్ ను కఠినంగా పాటిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. కఠినంగా వాటర్ డైట్ ను పాలో అయితే, అదనపు కిలోల బరువు తగ్గించుకోవడంతో పాటు, టాక్సిన్స్ ను తొలగిస్తుంది మరియు మరో ముఖ్యమైన విషయం ఇది మిమ్మల్ని ఫిట్ గా ఉంచతుంది.
ఆరోగ్యనిపుణుల అభిప్రాయం ప్రకారం, త్వరగా బరువు తగ్గించుకోవాలనుకొనే వారు వాటర్ డైట్ కంటే మరింత ఎఫెక్టివ్ మార్గం మరోటి ఉండదని నిపుణుల అభిప్రాయం. మీరు వాటర్ డైట్ ఫాలో అవ్వాలనుకున్నప్పుడు కొద్దికొద్దిగా నీళ్ళు మరియుు లిక్విడ్స్(ఫ్రూట్ జ్యూస్)లు తీసుకోవాలి . ఘనపదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలి.
రెగ్యులర్ గా నీరు త్రాగడం వల్ల పొందే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్:క్లిక్ చేయండి
ఆరోగ్య నిపుణుల ప్రకారం బరువు తగ్గించే ఈ వాటర్ డైట్ ప్లాన్ వల్ల మరికొన్ని ఇతర హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంటున్నారు . ఇది బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. కంటిచూపును క్లియర్ చేస్తుంది మరియు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా రక్షిస్తుంది (నీళ్ళు క్యాన్సర్ కణాలను బ్రెస్ట్ మరియు చర్మంలోని క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా సహాయపడుతుంది). మరీ ముఖ్యంగా వాటర్ డైట్ నుండి ఫుడ్ మరియు ఎన్విరాన్ మెంట్ పొల్యూషన్ వల్ల మన శరీరాన్ని రక్షించుకోవచ్చు.
ఉదయాన్నేలెమన్ వాటర్ తాగితే: గొప్ప ప్రయోజనాలు: క్లిక్ చేయండి
10 డేస్ వాటర్ డైట్ వల్ల మరో ఉత్తమ ప్రయోజనం ఖర్చు లేని ఎఫెక్టివ్ మార్గం. మరి వాటర్ డైట్ ఫాలో అవ్వాలంటే ఈ క్రింది పద్దతులు అనుసరించాలి...

డే 1-నీళ్ళు
పది రోజుల్లో బరువు తగ్గించుకోవాలనుకొనే వారికి మొదటి రోజు ప్లెయిన్ వాటర్ (సాధరణంగా ఉండే మంచి నీళ్ళు)తీసుకోవాలి. రెండు గంటలు విరామం ఇస్తూ ప్రతి రెండు గంటలకొకసారి నిధానంగా నీళ్ళు త్రాగాలి.

డే 2-గ్రీన్ వాటర్
గ్రీన్ వాటర్ అంటే గ్రీన్ టీ. గ్రీన్ టీని రెండవ రోజున తీసుకోవాలి. గ్రీన్ టీని తీసుకోవడం వల్ల టాక్సిన్స్ ను శరీరం నుండి తొలగిస్తుంది. 10 డేస్ వాటర్ డైట్ లో ఖచ్చితంగా అనుసరించాల్సిన మార్గం గ్రీన్ టీ ని ఖచ్చితంగా తీసుకోవాలి.

డే 3- ఐస్ వాటర్
బరువు తగ్గించుకోవడానికి సరైన వాటర్ డైట్ ప్లాన్ లో ఐస్ వాటర్ కూడా సహాయపడుతుంది . మన శరీరంలోని మెటబాలిజం రేటును క్రమబద్దం చేస్తుంది.

డే -4 -బెల్లం నీళ్ళు
డే 4(నాల్గవ రోజున) కనీసం 5లీటర్ల నీళ్ళు త్రాగాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల బెల్లంను మిక్స్ చేసి త్రాగడం వల్ల శరీరంలో ఎనర్జీ తగ్గిపోకుండా ఉంటుంది.

డే 5--సూప్ వాటర్
బరువు తగ్గాలి, కానీ హెల్తీగా తగ్గాలి. కాబట్టి, మన శరీరానికి తగినన్ని ప్రోటీనులు, మరియు విటమిన్లు శరీరానికి అందే విధంగా చూసుకోవాలి. అందుకు సూప్ వాటర్ బాగా సహాయపడుతుంది. కాబట్టి 5వ రోజున సూప్ వాటర్ డైట్ కు ప్రాధాన్యత ఇవ్వండి. సూప్ వాటర్ వాల్ల మీ పొట్ట ఫుల్ గా ఉండేట్లు చేస్తుంది మరియు ఆకలి కోరికలను తగ్గిస్తుంది.

డే 6-ఫ్రూట్ వాటర్(జ్యూస్)
బరువు తగ్గించే పది రోజుల వాటర్ డైట్ ప్లాన్ లో మరో ముఖ్యమైన అంశం ఫ్రూట్ డైట్. ఫ్రూట్స్ తో తయారుచేసిన పండ్ల రసాలను తీసుకోవాలి.

డే 7- స్వీట్ వాటర్
స్వీట్ వాటర్ అంటే గ్లాసు నీళ్ళలో చిటికెడు పంచదార మరియు చిటికెడు ఉప్పు మిక్స్ చేసి ఏడవ రోజున తీసుకోవాలి . బరువు తగ్గించేందుకు ఈ స్వీట్ వాటర్ కూడా సహాయపడుతుంది . ఇలా స్వీట్ వాటర్ త్రాగడం వల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది.

డే 8--వేడి నీళ్ళు
బరువు తగ్గించుకోవాలని ఖచ్చితంగా నిర్ణయించుకొన్నప్పుడు అందులో తప్పనిసరిగా హాట్ వాటర్ డైట్ ఉండాలి. ఎందుకంటే పొట్టలో చేరిన అదనపు కొవ్వును కరిగించడానికి హాట్ వాటర్ బాగా సహాయపడుతుంది.

డే 9--హెర్బల్ వాటర్
హెర్బల్ వాటర్ శరీరంలోని టాక్సిన్స్ ను తొలిగించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇలా కొవ్వు కరిగించి, టాక్సిన్స్ తొలగించే గుణాలు హెర్బల్ టీలో మెండుగా ఉంటాయి. కాబట్టి, 9వ రోజున హెర్బల్ టీకి ప్రాధాన్యత ఇవ్వండి.

డే 10 --లెమన్ వాటర్
బరువు తగ్గించుకోవడంలో లెమన్ వాటర్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అయితే, గోరువెచ్చని నీరు, లెమన్ జ్యూస్ మిక్స్ చేసి అందులో తేనె మరియు చిటికెడు దాల్చిన చెక్క పొడి మిక్స్ చేసి తీసుకోవడం వల్ల అదనపు బరువును ఎఫెక్టివ్ గా తగ్గించేస్తుంది.



Click it and Unblock the Notifications