Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బాడీ మరియు మజిల్స్ బిల్డ్ చేయడానికి హెల్తీ మార్గాలు
బరువు పెరగడానికి మరియు మజిల్ పెంచుకోవడానికి కొన్ని ఆరోగ్యకరమైన మార్గాలున్నాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది వారి మజిల్స్ పెంచుకోడానికి ఇష్టపడుతున్నారు . ఆలా బరువు, కండలా పెంచుకోవాలనే ఉత్సుకత ఉన్నావారు తరచూ జిమ్ కు వెళ్ళడం, కొన్ని స్టెరాయిడ్స్ వంటి డ్రగ్స్ తీసుకోవడం చేస్తుంటారు. జిమ్ కు వెళ్ళడం మంచిదే, అయితే, బాడీ బిల్డింగ్ డ్రగ్స్ ఉపయోగించడం వల్ల ఆరోగ్యాన్నిదొంగదెబ్బతీస్తుంది.
కాబట్టి, మజిల్స్ బిల్డ్ చేయడానికి హానికరమైన పద్ధతులను అనుసరించడం కంటే నేచురల్ మార్గాలు చాల ఉన్నాయి . అసమతుల్య ఆహారాపద్దతులు వారి జీవనశైలి మీద ప్రభావం చూపుతుందన్న విషయం చాలా మందికి తెలియదు.READ MORE: ఫస్ట్ టైమ్ బాడీ బిల్డ్ చేసేవారు గుర్తుంచుకోవల్సిన విషయాలు
జిమ్ కు వెళ్ళడం మాత్రమే కాదు, వెయిట్ లిప్టింగ్ మరియు ఇతర హెల్తీ మార్గాలను ఎంపిక చేసుకోవడం ద్వారా బాడీని బిల్డ్ చేయవచ్చు , బాడీ బిల్డ్ చేయడానికి ఈ క్రింది తెలిపిన చిట్కాలను అనుసరించాలి.
త్వరగా మరియు సురక్షితంగా మజిల్స్ ఎలా పెంచుకోవాలి అని ?ఈ రోజు బోల్డ్ స్కై మీకోసం కొన్ని హెల్తీ మార్గాలను అందిస్తున్నది. ఈ చిట్కాలను పరిశీలించి, ఇంట్లో ప్రయత్నించవచ్చు...

మీరు తీసుకొనే డైట్ లో ఎక్కువ క్యాలరీలను జోడించాలి:
మీరు బాడీ బిల్డ్ చేయడానికి ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నట్లైతే, మీరు నార్మల్ గా తీసుకొనే దానికంటే ఎక్కువ క్యాలరీలను తీసుకోవాలి . ఈ ఎక్సట్రా క్యాలరీలు మజిల్ బిల్డ్ అవ్వడానికి సహాయపడుతాయి. కాబట్టి మీరు 300 నుండి 500 వరకూ క్యాలరీలను ప్రతి రోజూ తీసుకోవచ్చు . అందుకు డార్క్ చాక్లెట్, నట్స్, మరియు పీనట్ బటర్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి . మజిల్స్ పెంచుకోవడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.

భోజనం స్కిప్ చేయకూడదు:
మీల్స్ స్కిప్ చేయకూడదు. బాడీ బిల్డింగ్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు రాత్రి భోజనం త్వరగా ముగించాలి. మీరు ఎక్కువగా తినడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. కాబట్టి, మీరు ఫ్యాట్ స్టోరేజ్ గురించి భయపడాల్సిన పనిలేదు. ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల బాడిబిల్డింగ్ కు అవసరం అవుతుంది . ఒక రోజుకు 6 నుండి 7 మీల్స్ ను తీసుకోవాలి.

సరైన ఆహారం:
మీ తీసుకొనే రెగ్యులర్ డైట్ లో ప్రోటీనులు, కార్బోహైడ్రేట్స్ మరియు తక్కువ ఫ్యాట్స్ ను తీసుకోవాలి. మీరు వెయిట్ ట్రైనింగ్ లో ఉన్నట్లైతే 50-60గ్రాముల ప్రోటీనులను తీసుకోవాలి 50-90గ్రాముల కార్బోహైడ్రేట్స్ ను ప్రతి రోజూ తీసుకోవాలి. ఫ్యాట్ కంటెంట్ 5-10గ్రాముల కంటే తక్కువగా తీసుకోవాలి . ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి మరియు మజిల్స్ బిల్డ్ చేయడానికి ఇది ఒక హెల్తీ మార్గం.

ప్రోటీనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి:
బాడీబిల్డింగ్ లో ప్రోటీనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి . ఇవి బాడీ బిల్డింగ్ ను నేచురల్ పద్దతిలో పెరగడానికి సహాయపడుతాయి . కాబట్టిప్రోటీనులు మీరు సాధారణంగా తీసుకొనే కంటే దానికి డబుల్ గా తీసుకోవాలి. అప్పుడే మజిల్స్ బిల్డ్ అవుతాయి . చికెన్, గుడ్లు, బీఫ్, ఫిష్ వంటి ప్రోటిన్ రిచ్ ఫుడ్స్ రెగ్యులర్ డైట్ లో ఒక భాగంగా అలవర్చుకోవాలి.

ప్రోటీన్ డ్రింక్స్:
మజిల్స్ బిల్డ్ చేయడానికి మీరు చాలా సీరియస్ వెయిట్ ట్రైనింగ్ తీసుకొనేటప్పుడు, మీరు ఖచ్చితంగా ప్రోటీన్ డ్రింక్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. అయితే ప్రోటీన్ డ్రింక్స్ కు తేనె చేర్చి వెంటనే త్రాగేయాలి.

నీళ్ళు:
వ్యాయామం చేసేవారికి మరయు వెయిట్ లిఫ్ట్ చేసేవారికి నీరు ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరం. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది టిష్యు క్వాలిటి పెంచుతుంది మరియు కండరాల యొక్క రెసిస్టెన్స్ ను పెంచి కండారాలు గాయపడకుండా రక్షణ కల్పిస్తుంది . వెయిట్ ట్రైనింగ్ లో ఎక్కువ నీళ్ళు త్రాగడం అత్యంత అవసరం.

కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవాలి:
మన శరీరానికి ఎనర్జీని అందివ్వడానికి కార్బోహైడ్రేట్స్ చాలా అవసరం అవుతాయి. వ్యాయామం చేసేవారికి ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. ఈ ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ ద్వారా పొందవచ్చు . కాబట్టి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి.

ఫాస్ట్ అండ్ స్లో కార్బో హైడ్రేట్స్:
స్లో కార్బోహైడ్రేట్స్ చాలా నిధానంగా మరియు అవసరమైనప్పుడు ఎనర్జీని అందివ్వడానికి సహాయపడుతాయి . అందుకు మీరు ఫ్రూట్స్ మరియు త్రుణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి మీరు వ్యాయామం చేయడానికి అరగంట ముందు మీకు తగినంత ఎనర్జీని అందిస్తాయి. బేక్ చేసిన బంగాళదుంప మరియు వైట్ బ్రెడ్ తీసుకోవడం వల్ల చాలా త్వరగా ఎనర్జీని అందిస్తుంది.

ఒకే రకమైన డైట్ ను మెయింటైన్ చేయాలి:
బరువు పెరగడానికి మరియు మజిల్స్ పెంచుకోవడానికి ఇంట్లో ఏంచేయాలి?వ్యాయామం చేయని రోజు కూడా ప్రతి రోజూ తీసుకొనే డైట్ నే మెయింటైన్ చేయాలి. లేదంటే ఇది బాడీ బిల్డింగ్ ప్లాన్ ను పాడు చేస్తుంది . ఎక్కువ ప్రోటీనులు మరియు కార్బోహైడ్రేట్స్ రెగ్యులర్ గా తీసుకొన్నట్లే ఆరోజు కూడా తీసుకోవాలి.

మీల్స్:
ఒక రోజుకు 6సార్లు భోజనం చేయాలి . ట్రైనింగ్ డేస్ లో శరీరానికి 19-21క్యాలరీలు అవసరం అవుతాయి. వ్యాయామం చేయని రోజుల్లో ఒక పౌండ్ కు 13-15 అవసరం అవుతాయి. ఇది మజిల్ పెంచడానికి ఒక ఉత్తమ మార్గం.



Click it and Unblock the Notifications