Latest Updates
-
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.!
ఆకలి అనిపించడం లేదా? ఐతే ఈ చిట్కాలను పాలోఅవ్వండి...
ఆకలి లేకపోవడం అనేది మనం చాలా మందిలో చూస్తూనే ఉంటాము. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. భోజనం చేయడానికి చాలా మారం చేస్తుంటాము. దాంతో పిల్లల్లో న్యూట్రీషయన్ లోపం ఏర్పడుతుంది. దాని ద్వారా పిల్లల్లో వ్యాధినిరోధకశక్తి త్వరగా తగ్గి వివిధ రకాల జబ్బులను ఎదుర్కోవల్సి వస్తుంది.
దాంతో పెద్దలు పిల్లల్ని తీసుకొని డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. వారి పిల్లలు భోజనం చేయడం లేదని వారికి ఆకలి పెరగడానికి అవసరం అయ్యే మందులను, టానిక్స్ ను సూచించమని కోరుతుంటారు. ఇలాంటి ఇంగ్లీష్ మందులను అనుసరించడం కంటే, కొన్ని నేచురల్ గా అందుబాటులో ఉండే హోం రెమెడీలను ఉపయోగించడం వల్ల ఆకలి పెరుగుతుంది మరియు ఆ వ్యాత్యాసాన్ని కూడా మీరు గమనించవచ్చు. పిల్లల్లో మార్పు వస్తుంది.
ముఖ్యంగా మీరు తీసుకొనే ఆహారంను ప్రత్యేకంగా గమనించినట్లైతే, అది ఖచ్చితంగా మీకు, లేదా పిల్లలకు ఇష్టంలేనివై కూడా ఉండవచ్చు. రెగ్యులర్ డైట్లో ఒకే విధమైన కూరలు, దుంపలు చేయడం వల్ల ఆకలి లేనట్లు ప్రదర్శిస్తుంటారు . ఇలాంటి పరిస్థితులను నిర్లక్ష్యం చేయకుండా, మీరు వెంటనే ఆకలి పెరగడానికి కొన్ని హోం రెమెడీల గురించి తెలుసుకోవాలి.
మందులు తీసుకోవడానికి బదులుగా కొన్నిసింపుల్ హోం రెమెడీస్ ను తీసుకోవడం వల్ల ఆకలిని పెంచుకోవచ్చు. . ఈహోం రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు . ఇది పూర్తిగా శరీరమొత్తం ఆరోగ్యానికి సహాయపడుతుంది.
మరి ఆకలి పెంచు ఆ ఉత్తమ సింపుల్ హోం రెమెడీస్ ఏంటో ఒక సారి తెలుసుకుందాం....

నిమ్మరసం:
జీర్ణక్రియకు ఇది చాలా మంచిది. ఇది శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ ను నివారిస్తుంది, దాంతో ఏదైనా తినాలనే కోరుక పెరుగుతుంది. ఒక గ్లాసు నీటిలో నిమ్మరసాన్ని పిండి, కొద్దిగా ఉప్పు లేదా కొద్దిగా తేనె మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం తీసుకోవాలి.

అల్లం:
అల్లం అజీర్తిని మరియు వికారాన్ని నివారించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . అంతే కాదు ఇది ఆకలిని పెంచడంలో ఉత్తమ హోం రెమెడీ . కాబట్టి, పచ్చి అల్లంను వంటలకు వాడం లేదా టీలో చేర్చడం లేదా అలాగే కొద్దిగా నమిలి తినడం ద్వారా ఉత్తమ ఫలితం ఉంటుంది.

ఫిగ్స్:
పచ్చి మరియు ఎండిన ఫిగ్స్ రెండు కూడా ఆకలిని పెంచడంలో బాగా సహాయపడుతాయి. వీటని నేచురల్ గా తీసుకవాలి. లేదా జ్యూస్ లా చేసి తీసుకోవాలి . లేదా సలాడ్స్ లేదా డిజర్ట్స్ లో చేర్చుకోవాలి.

ఖర్జూరం:
ఆకలి పెంచే మరో పదార్థం . దీన్ని నేచురల్ గా అలాగే నేరుగా తీసుకోవచ్చు. లేదా జ్యూసులు లేదా డిజర్ట్స్ లో చేర్చుకొని తీసుకోవచ్చు.

దాల్చిన చెక్క:
ఆకలి పెంచే మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ దాల్చిన చెక్క. ఆకలి కాకుండా నియంత్రించే వికారానికి మరియు వాంతులను నివారించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్కను పొడి చేసి, మీరు తినే గ్రేవీలలో మరియు టోస్ట్ లలో కొద్దిగా జోడించాలి . లేదా కొద్దిగా షుగర్ మరియు తేనెకు మిక్స్ చేసి నేరుగా తీసుకోవచ్చు.

చింతపండు:
ఆకలిపెంచే మరో హోం రెమెడీ ఆకలి కోరికను పెంచడానికి మరియు రుచి కలిగించడానికి దీన్ని చాలా వరకూ మన భారతీయ వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు . ఆకలిని క్రమంగా పెంచుకోవడానికి మీ చింతపండు మీరు తయారుచేసే వంటల్లో జోడించాలి.

ద్రాక్ష:
ద్రాక్షలో చాలా తక్కువగా యాసిడ్స్ ఉంటాయి మరియు పుల్లని రసం ఉంటుంది . ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు దాంతో ఆకలి పెరుగుతుంది . భోజనానికి భోజనానికి మద్య తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

మెంతులు:
మెంతులు పొట్టలో గ్యాస్ ను వదిలించడానికి సహాయపడుతుంది, దాంతో ఆకలి పెరుగుతుంది . కాబట్టి, ఒక చెంచా మెంతి పొడిని ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం లేదా వంటకాల్లో జోడించడం వల్ల ఫలితం మరింత బెట్టర్ గా ఉంటుంది.

కారమ్ సీడ్స్:
కారమ్ సీడ్స్ త్రేన్పులను నివారిస్తుంది మరియు మొత్తానికి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు దీన్ని ప్రతి భోజనానికి ముందు చిటికెడు ఉప్పు మిక్స్ చేసి తీసుకోవాలి . ఇది మీ టేస్ట్ బడ్స్ ను మరింత రుచికరంగా మార్చుతుంది.

కొత్తిమీర:
కొత్తమీరను ఉడికించిన నీటిని ఒకటి లేదా రెండు టీబుల్ స్పూన్లను తీసుకోవడం ద్వారా , వ్యాక్తిలో ఆకలి కోరికలు క్రమంగా రోజురోజుకు పెరుగుతుంది.

పుదీనా:
కొద్దిగా పొదీనాను పెరుగులో మిక్స్ చేసి, రెండు మూడు చిటికెలు బ్లాక్ పెప్పర్ పౌడర్ చిలకరించడం వల్ల ఆకలిని క్రమంగా పెంచుతుంది.

వెల్లుల్లి:
ఉడికించిన వెల్లుల్లి తిన్నా కూడా ఆకలి బాగా పెరుగుతుంది. ఆకలి పెరగడానికి ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.

దానిమ్మ:
మరో హెల్తీ ఫ్రూట్ దానిమ్మ. ఆకలిని పెరిగేట్లు చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications