Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బెల్లీ ఫ్యాట్ రాకుండా ముందు జాగ్రత్తగా వీటికి దూరంగా ఉండండి..!?
మన శరీరంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం పొట్ట. ఎందుకంటే చాలా త్వరగా కొవ్వు ఏర్పడి, శరీరంలో మార్పు కనిపించే మొదట పొట్ట ఉదరంలోనే . అంతే కాదు ఈ బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవాలంటే చాలా కష్టం.
ఈ బెల్లీ ఫ్యాట్ కారణంగా బాడీకున్న షేప్ పోతుంది. దాంతో చూడటానికి అందవిహీనంగా కనబడుతారు. అందాన్ని మాత్రమే హరించడం కాదు, అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.
దీనికి బెస్ట్ సొల్యూషన్ బెల్లీప్యాట్ కు కారణమయ్యే బ్యాడ్ హ్యాబిట్స్ ను మానుకోవడమే...
బెల్లీ ఫ్యాట్ కు కారణమయ్యే 10 బ్యాడ్ హ్యాబిట్స్ కొన్ని ఉన్నాయి. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ప్రస్తుత మీ ఫ్ స్టైల్ కు సంబంధించినవిగా ఉంటాయి కాబట్టి, వీటిని దూరంగా ఉంటే బెల్లీ ఫ్యాట్ సమస్య ఉండదు,.
మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల నడుము చుట్టూ చేరిన చెడు కొలెస్ట్రాల్ ను నివారించుకోవచ్చు. బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి మీరిదివరే ప్రయత్నాలను ప్రారంభించినట్లైతే ఇది ఒక బెస్ట్ టైమ్. ఇంకెందుకు ఆలస్యం బెల్లీ ఫ్యాట్ రాకుండా ముందు జాగ్రత్తగా ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటో తెలుసుకు వాటికి దూరంగా ఉందాం..

సెడెంట్రీ లైఫ్ స్టైల్ :
చాలా బిజీ షెడ్యూల్ . వర్క్ ప్రెజర్ తో బాడీ మీద స్ట్రెస్ పెరుగుతుంది. సమయపాలన లేకుండా భోజనం, నిద్ర, వ్యాయామం లేకపోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ కు కారణమవుతుంది . ఎక్స్ ట్రా ఫ్యాట్ బెల్లీ చూట్టూ చేచడం వల్ల బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది.

నిద్రలేమి సమస్యలు :
నిద్రలేమి సమస్యలు బెల్లీ ఫ్యాట్ కు దారితీస్తుంది. సరైన సమయానికి నిద్రపోకపోవడం వల్ల శరీరంలో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది. దాంతో షుగర్ మరియు జంక్ ఫుడ్స్ మీద ఎక్కువ కోరికలు కలిగిస్తుంది. దాంతో నడుము చుట్టుకొలత కాస్త పెరుగుతుంది.

కార్బోనేటెడ్ డ్రింక్స్ :
రెగ్యులర్ గా కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగే వారిలో బెల్లీ ఫ్యాట్ ప్రమాధం ఉంది. కార్బోనేటెడ్ డ్రింక్స్ లో షుగర్ ఎక్కువ ఉంటుంది. దాంతో బాడీలో క్యాలరీలు పెరుగుతాయి. క్రమంగా నడుము చుట్టూ కొవ్వు బెల్లీ ఫ్యాట్ కు కారణమవుతుంది.

లేట్ నైట్ డిన్నర్:
మనం రాత్రి తీసుకునే భోజనం జీర్ణమవ్వకపోతే, అది కొవ్వు గా మారుతుంది. దాంతో నడుము చుట్టుకొలత పెరుగుతుంది . కాబట్టి లేట్ నైట్ డిన్నర్ వద్దు. రెండు గంటల మందే భోజనం చేయడం మంచిది . భోజనం చేసిన తర్వాత స్ట్రెస్ కు గురికాకూడదు.

ప్రోటీన్ లోపం:
హెల్తీ అడల్ట్స్ కు 20నుండి 25గ్రాముల ప్రోటీన్ మీల్స్ అవసరమవుతుంది. ప్రోటీన్స్ బ్లడ్ షుగర్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇన్సులిన్ లెవల్స్ తగ్గిస్తుంది. బాడీ మెటబాలిక్ రేట్ పెంచుతుంది. ప్రోటీన్స్ హార్మోన్స్ ను కంట్రోల్ చేస్తుంది . ఆకలిని పెంచుతుంది.

లో ఫ్యాట్ ఫుడ్స్ :
లోఫ్యాట్ ఫుడ్ ఎంత తీసుకున్నా పర్వాలేదు కొవ్వు పెరగదనుకుంటారు. కానీ ఇది నిజం కాదు, లోఫ్యాట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫ్యాట్ పెరుగుతుంది.

భావోద్వేగంతో తినడం:
భోజనం చేసే సమయంలో ప్రశాతంత ఉండాలి. ప్రశాంతమైన వాతావరంలో తీసుకునే ఆహారం ఇష్టంగా తినాలి. తిన్నది కొద్దిగైనా, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. కోపతాపాలతో తిన్న ఆహారం జీర్ణ శక్తిని తగ్గిస్తుంది. దాంతో విస్ట్ లైన్ పెరుగుతుంది.

క్కువ ఆహారాలను తీసుకోవడం:
పెద్ద ప్లేట్స్ ఉంటే ఆహారం ఎక్కువ పెట్టుకుంటారు. కాబట్టి, ప్లేట్స్ చిన్నవి ఎంపిక చేసుకోవాలి. దాంతో త్వరగా తినడం ముగించేస్తారు. ఎక్కువ ఆహారాలను తీసుకోరు . అంటే తక్కువ తింటారని కాదు, మరో సారి వండిచుకోకుండా ఉండేందుకు ఇది సహాయపడుతుంది.

భోజనం స్కిప్ చేయడం:
బ్రేక్ ఫాస్ట్ , భోజనం స్కిప్ చేయడం వల్ల అత్యంత బరువు పెరుగుతుంది. నడుము చుట్టుకొలత పెరగడంలో అంత్యంత ప్రమాదరమైనది భోజనం తినకపోవడం. ఒక్క సారి భోజనం తినకపోవడం వల్ల రెండవసారి తినే సమయంలో తెలియకుండానే ఎక్కువగా తీసేసుకోవడం వల్ల బాడీలో క్యాలరీలు పెరుగుతాయి. దాంతో నడుము చుట్టుకొలత పెరుతుంది.

ఎక్కువ ఆహారాలు జంక్ ఫుడ్స్ తీసుకోవడం:
బెల్లీ ఫ్యాట్ కు ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ మాత్రమే కాదు . బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్ కూడా. అందుకే వెంటనే మానేయాలి. తినే ఆహారం పరిమాణం తగ్గించి బాగా నమిలి తినాలి. ఎక్కువ ఆహారం పెట్టుకొన్నప్పుడు ఫాస్ట్ గా తినేయడం వల్ల జీర్ణక్రియ ఆలస్యం అవుతుంది. దాంతో క్యాలరీలు పెరిగిపోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది.



Click it and Unblock the Notifications