Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
బెల్లీ ఫ్యాట్ పై ఫోకస్ చేసి.. కొవ్వు కరిగించే ఎఫెక్టివ్ హోం రెమిడీస్..!!
బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి డిఫరెంట్ టిప్స్ ఫాలో అయి విసిగిపోయారా ? ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. బెల్లీ ఫ్యాట్ మాత్రం కరగడం లేదా ? అయితే ఇప్పుడు సింపుల్ గా, ఇంట్లోనే ఉన్న వస్తువులను ఉపయోగించి.. ఎఫెక్టివ్ గా బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ ఖర్చులో బరువు తగ్గించుకునే సింపుల్ టిప్స్ ఇవి.
బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడం చాలా కష్టమైన టాస్క్. చాలా స్లిమ్మింగ్ ట్రిక్స్, డైటింగ్ హ్యాబిట్స్ ఫాలో అయినా ఫెయిల్ అవుతున్నాయి. వాటిని ఫాలో అయినా ఫలితం కనిపించనప్పుడు.. మధ్యలోనే వదిలేయడం కామన్ గా జరిగిపోతోంది. కానీ మెటబాలిజం ప్రక్రియ ఎలా జరుగుతుంది.. అది సక్రమంగా సాగేలా జాగ్రత్తపడేవాళ్ల బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిగిపోతుంది.
మెటబాలిక్ రేటు అనేది వయసు, జెండర్, మజిల్ మాస్ ని బట్టి ఉంటుంది. మహిళల్లో కంటే.. మగవాళ్లలలో మెటబాలిజం స్థాయి ఎక్కువగా ఉంటుంది. మగవాళ్లలో కండరాల సౌష్టవం బలంగా ఉంటుంది కాబట్టి వీళ్లో ఇది ఎక్కువగా ఉంటుంది. మెటబాలిజం రేటుని పెంచితే.. వయసు, జెండర్ తో సంబంధం లేకుండా.. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు.
అలా మెటబాలిజం స్థాయిని పెంచి.. వేగంగా బెల్లీ ఫ్యాట్ కరిగించే అమేజింగ్ ఇంగ్రిడియంట్స్ మీ వంటింట్లోనే ఉన్నాయి. ఇవి కేవలం బెల్లీ ఫ్యాట్ మీద ఫోకస్ చేసి.. బెల్లీ ఫ్యాట్ ని వేగవంతంగా, వెంటనే కరిగించడానికి సహాయపడతాయి.

నిమ్మరసం
అందరి ఇంట్లో అందుబాటులో ఉండే.. నిమ్మరసం బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో వండర్ చేస్తుంది. రోజుని ఒక గ్లాసు నిమ్మరసంతో ప్రారంభించడం. కొంతకాలంలోనే బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది. గోరు వెచ్చని నీళ్లు, తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.

అల్లం టీ
మీ రోజూ తీసుకునే టీలో అల్లం చేర్చుకుంటే.. బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది. అల్లంలో ఉండే థెర్మోజెనిక్ గుణాలు, బాడీ టెంపరేచర్ ని పెంచి.. ఫ్యాట్ ని ఎఫెక్టివ్ గా కరిగిస్తాయి.

వెల్లుల్లి
వెల్లుల్లి యాంటీ ఒబేసిటీ గుణాలు కలిగి ఉంటుంది. శరీరంలో ఫ్యాట్ పేరుకోకుండా అరికట్టడంలో వెల్లుల్లి సహాయపడుతుంది.

ఆల్మండ్స్
బెల్లీ ఫ్యాట్ తో పోరాడే సత్తా బాదాంలో ఉన్నాయని అధ్యయనాలు నిరూపించాయి. ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బరువు తగ్గడానికి సహాయపడతాయి.

పుదీనా
బెల్లీ ఫ్యాట్ ని తగ్గించడంలో పుదీనా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. గాల్ బ్లాడర్ లో పేరుకున్న పైత్యాన్ని మొత్తం తొలగించడంలో పుదీనా వండర్ చేస్తుంది. బైల్ శరీరంలో ఫ్యాట్ చేరడానికి సహాయపడుతుంది. పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, లో క్యాలరీలు న్యాచురల్ గా మెటబాలిక్ రేట్ ని మెరుగుపరుస్తాయి.

అలోవెరా జ్యూస్
చాలా త్వరగా బెల్లీ ఫ్యాట్ కరిగించాలని మీరు భావిస్తే.. ఆలో వెరా జ్యూస్ తాగడం మంచిది. అలోవెరా జెల్ అబ్డామినల్ ఫ్యాట్ తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

పుచ్చకాయ
పుచ్చకాయలో 91 శాతం నీళ్లేఉంటుంది. కొన్ని ముక్కల వాటర్ మిలాన్ ను.. భోజనానికి ముందు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ కలిగి.. తక్కువ ఆహారం తీసుకోవడానికి సహాయపడుతుంది.

బీన్స్
రెగ్యులర్ గా వివిధ పద్ధతుల్లో బీన్స్ తీసుకోవడం వల్ల.. బాడీ ఫ్యాట్ తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చాలా సమయం వరకు ఆకలి కాకుండా చూస్తాయి.

దోసకాయ
దోసకాయ రీఫ్రెషింగ్, లో క్యాలరీ ఫుడ్. వంద గ్రాముల దోసకాయలో 96 శాతం నీళ్లు ఉంటాయి. 45 క్యాలరీలు కలిగి ఉంటాయి. అలాగే మినలర్స్, ఫైబర్స్, విటమిన్స్ కలిగి ఉంటాయి.

టమోటాలు
ఒక పెద్ద టమోటాలో 33 క్యాలరీలుంటాయి. బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ చేసే గుణాలను టమోటాలు కలిగి ఉంటాయి. అలాగే ఒబేసిటీకి సంబంధించిన క్రోనిక్ డిసీజ్ లతోనూ ఇవి పోరాడతాయి.



Click it and Unblock the Notifications