Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
బ్రిలియంట్ ఐడియా: 7 రోజుల్లో 7 కేజీలు తగ్గే ఛాన్స్.. !
కుంకుబర్ డైట్ తో బరువు తగ్గడం చాలా తేలికైన పని. ఎందుకంటే.. 7 రోజుల్లో 7 కేజీలు తగ్గేయచ్చట. డైలీ డైట్ లో రోజూ దోసకాయను చేర్చుకుంటే.. బరువు తగ్గడం తేలికని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. తింటుంటే తినాలనిపించే ఈ దోసకాయ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
వ్యాధులు నయం చేయడానికి, చర్మ సౌందర్యానికి, ఫేస్ మాస్క్ లకు దోసకాయ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అసలు దోసకాయ డైట్ ఎలా ఫాలో అవాలి ? దోసకాయ డైట్ ఫాలో అయితే ఖచ్చితంగా బరువు తగ్గుతామా ? అనేగా మీ డౌట్. ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే.. నీటి శాతం ఎక్కువగా ఉండే.. ఈ కుకుంబర్ డైట్ సరైన పద్ధతిలో ఫాలో అయితే... 7 రోజుల్లో 7 కేజీలు తగ్గేయచ్చు. ఈ డైట్ ఎలా ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం..

దోసకాయ ప్రయోజనాలు
దోసకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే.. ఇది అవయవాలన్నింటినీ ప్యూరిఫై చేసి, మెటబాలిజం పెంచుతుంది. అలాగే డైజెస్టివ్ ట్రాక్ ని క్లీన్ చేస్తుంది. అలాగే ఎక్సెస్ వాటర్ ని బయటకు పంపుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు దోసకాయ తింటే చాలా మంచిది కూడా.

బ్రేక్ ఫాస్ట్
ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి 2 ఉడకబెట్టిన కోడిగుడ్లు, ఒక ప్లేట్ దోసకాయ సలాడ్ తీసుకోవాలి.

లంచ్
ఒక ముక్క వీట్ బ్రెడ్ టోస్ట్ చేసుకుని తీసుకోవచ్చు. దాంతో పాటు ఒక గిన్నె కుకుంబర్ సలాడ్ తీసుకోవాలి.

స్నాక్స్
ఒక యాపిల్ లేదా 1 పీచ్ తీసుకోవాలి. ఇవి 200 గ్రాముల కంటే తక్కువ మోతాదు ఉండాలి.

కుకుంబర్ డైట్ సలాడ్ తయారు చేసుకునే విధానం
కుకుంబర్ సలాడ్ తయారు చేసుకోవడానికి 400 గ్రాముల దోసకాయలు, 200 మిల్లీ లీటర్ల పాలు లేదా పెరుగు, కొద్దిగా సాల్ట్, కొన్ని ఉల్లిపాయలు తీసుకోవాలి. ముందుగా దోసకాయ చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో ఉప్పు కలిపి బాగా మిక్స్ చేయాలి. తర్వాత పెరుగు లేదా పాలు కలిపి మిక్స్ చేయాలి. ఉల్లిపాయలు కలుపుకుని తీసుకోవాలి.

కుకుంబర్ షేక్
స్నాక్స్ రూపంలో కుకుంబర్ షేక్ అయినా తీసుకోవచ్చు. దీనికి 1 దోసకాయ, 1 యాపిల్, గుప్పెడు స్పినాచ్ తీసుకోవాలి. అన్నింటినీ కలిపి మిక్సీ పట్టాలి. తర్వాత కొద్దిగా అల్లం ముక్కలు కలిపి బాగా మిక్స్ చేయాలి. ఫ్రెష్ గా ఉన్నప్పుడే తాగేయాలి.

డిన్నర్
రాత్రి భోజనానికి ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు. అది 300 గ్రాములు మాత్రమే తీసుకోవాలి.

నియమాలు
కుకుంబర్ డైట్ ఫాలో అయ్యేటప్పుడు శారీరకంగా చాలా యాక్టివ్ గా ఉండాలి. కాబట్టి వ్యాయామం చేయాలి. లేదంటే కనీసం వాకింగ్ చేయాలి. అయితే ఏది చేసినా చెమటలు వచ్చే వరకు చేయాలి.



Click it and Unblock the Notifications