Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
థైఫ్యాట్ ను కరిగించే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ...
మనషి అందంగా కనబడాలంటే, శరీరం యొక్క చర్మ ఛాయతో పాటు, శరీరం యొక్క కొలతలు కూడా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే చక్కటి శరీర సౌష్టవంతో పాటు, చర్మ ఛాయ కలిగి ఉన్నప్పుడే, పరిపూర్ణంగా అందంగా కనబడుతారు. శరీరంలో పొట్ట రాకూడదని చాలా మంది ఎన్నోడైట్ టిప్స్ మరియు వ్యాయామాలు, జిమ్స్ లు అని చేయనన్ని ప్రయత్నాలుండవు. అలాగే బరువు, ఎత్తుకు తగ్గట్టు, కాళ్ళ, చేతుల లావుకూడా అందాన్ని తెలుపుతుంది. ముఖ్యంగా మహిళలు నాజూగ్గా ఉండాలంటే కాళ్ళు చేతులు సన్నగా నాజూగ్గా కనబడాలి. కాళ్ళు సన్నగా కాంతివంతంగా ఉన్నప్పుడు వారు షార్ట్ డ్రెస్సులను వేసుకోవడానికి ఇష్టపడుతారు. అయితే, తొడల వద్ద కొవ్వు కరిగించుకోవడం కొంచెం కష్టమే అవుతుంది. నిజానికి బెల్లీ ఫ్యాట్ ఏర్పడిన తర్వాత తొడలలో కొవ్వు కరిగించడం కష్టం అవుతుంది. కాబట్టి, మీరు థై ఫ్యాట్ (తొడల వద్ద కొవ్వు)ను త్వరగా తగ్గించుకోవాలంటే డైట్ మరియు వ్యాయామాల యొక్క కాంబినేషన్ టిప్స్ ను తప్పనిసరిగా అనుసరించాలి.
థై ఫ్యాట్ కరిగించుకోవడానికి ఒక్క డైట్ లో మార్పులు చేసుకుంటే మీ లక్ష్యం అంతటి పూర్తి కాదు, డైట్ లో మార్పులు చేసుకొని మీరు వ్యక్తిగతంగా ఎంత ప్రయత్నించినా థై ఫ్యాట్ తగ్గదు. కాబట్టి, డైట్ లో మార్పులతో పాటు, థై ఫ్యాట్ కరిగించుకోవడానికి థై ఫ్యాట్ వ్యాయామాలను చేయాలి. కాబట్టి, జీవనశైలిలో మార్పులను తప్పనిసరిగా చేసుకొన్నట్లైతే తప్పకుండా థై ఫ్యాట్ తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.
అలాగే డైట్ లో మార్పు చేసుకోవడం వల్ల మీరు వ్యాయామంలో కోల్పోయిన శక్తిని మీ శరీరంలో నింపడానికి డైట్ గొప్పగా సహాయపడుతుంది. ముఖ్యంగా హైలీ న్యూట్రీషియన్ ఫుడ్ తీసుకోవడం వల్ల క్యాలరీలు తక్కువ. విటమిన్స్ ఎక్కువ. ఇది శరీరానికి అవసరం అయ్యే ఎనర్జీని అందిస్తాయి. ముఖ్యంగా లీన్ మీట్, చికెన్, టర్కీ వంటి వాటిలో ప్రోటీనులు అధికం మరియు క్యాలరీలు తక్కువ. కాబట్టి రెగ్యులర్ డైట్ లో ప్రోటీన్ ఫుడ్స్ చాలా అవసరం.
వీటితో పాటు ఫైబర్ ఫుడ్స్ చేర్చుకోవడం వల్ల ఫ్యాట్ కరిగించడంతో పాటు, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.టమ్మీ ఎలిమెంట్స్ నివారిస్తుంది. లోఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్, పాలు, టోఫు, పనీర్ వంటివి కూడా ఆరోగ్యరమే. ఇవిక్యాల్షియం కూడా అందిస్తాయి . వీటిని తినడం వల్ల ఎనర్జిటిక్ గా ఫీలవుతారు . ఇవి శరీరానికి ఎంతో అవసరం . . జిమ్ కు ప్లాన్ చేసుకొనే వారు ఈ 7 ఫుడ్స్ ను రెగ్యులర్ గా తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. థై ఫ్యాట్ త్వరగా బర్న్ చేస్తుంది. మరి థైఫ్యాట్ బర్న్ చేసే ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఏంటో చూద్దాం...

1. లీన్ మీట్:
మీ రెగ్యులర్ డైట్ లో చికెన్ తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. స్కిన్ లెస్ చికెన్ ను ఒక సర్వింగ్ కు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చికెన్ తో పాటు వెజిటేబుల్ సలాడ్ తీసుకోవడం వల్ల పొట్ట నిండుగా ఉంటుంది . చికెన్ సూప్ మరియు వెజిటేబుల్స్ ఫ్యాట్ ను కరిగించడానికి సహాయపడుతుంది.

2. సీఫుడ్స్:
ఆరోగ్యానికి ఫిష్ చాలా ఆరోగ్యకరం. సాల్మన్ ఫిష్ లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. సాల్మన్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలం మరియు ఇవి జిమ్ లో కోల్పోయిన క్యాలరీలను తిరిగి పొందేలా చేస్తుంది.

3. బీన్స్:
గ్రీన్ వెజిటేబుల్స్ బెస్ట్ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ . వీటిలో ప్రోటీనులు అధికంగా ఉంటాయి . మరియు వీటిలో క్యాలరీలు తక్కువ . అందుకు ఆరోగ్య నిపుణులు బీన్స్ ను అధికంగా మీల్స్ లో జోడించుకోమని సలహాలిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు ఫ్యాట్ కరిగించడంలో కూడా గ్రేట్. థైఫ్యాట్ కరుగుతుంది.

4. సోయా:
సోయాలో క్యాల్షియం మరియు ప్రోటీన్స్ ఎక్కువ. సోయా మిల్క్, సోయాబీన్స్ మరియు సోయా చుంక్స్ వంటి ఆరోగ్యానికి చాలా మంచిది . అయితే ఎక్కువ సోయా ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల వంద్యత్వానికి దారితీస్తుంది కాబట్టి, మితంగా తీసుకోవాలి.

5.లోఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్:
మీరు బరువు తగ్గించుకోవాలని చూస్తుంటే మీ రెగ్యులర్ డైట్ లో పనీర్, టోఫు స్లిమ్ మరియు లోఫ్యాట్ మిల్క్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. జిమ్ లో కోల్పోయిన క్యాలరీలను ఇలా డైరీప్రొడక్ట్స్ తో బ్యాలెన్స్ చేసుకోవచ్చు.

6. గుడ్లు:
ప్రోటీన్ ఫుడ్స్ లో గుడ్డు కూడా ఒకటి. ఎగ్ వైట్ మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ప్రతి రోజూ రెండు మూడు గుడ్లు తినడం వల్ల తొడల వద్ద ఫ్యాట్ కరిగిపోతుంది. శరీరానికి కావల్సిన ఎనర్జీ అందిస్తుంది.

7. నట్స్ అండ్ సీడ్స్:
నట్స్ అండ్ సీడ్స్ చాలా అరోగ్యకరమైనవి. నట్స్ లో ముఖ్యంగా బాదం ను బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవాలి. ముఖ్యంగా వాటర్ మెలోన్ మరియు మస్క్ మెలోన్ వంటి వి కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ . ఇవి శరీరానికి ఎనర్జీ అందివ్వడంతో పాటు ఫ్యాట్ బర్న్ చేయడానికి సహాయపడుతాయి.



Click it and Unblock the Notifications