Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
వేగంగా బరువు తగ్గించే బెస్ట్ ఆయుర్వేదిక్ రెమిడీస్
లైఫ్ స్టైల్, బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవకపోవడం, వ్యాయామం నిర్లక్ష్యం చేయడం వంటి అలవాట్ల ద్వారా సరైన బరువు ఉండటం చాలా కష్టం. దీనివల్ల శరీరంలో ఫ్యాట్ పేరుకుంటుంది. దీనికి చక్కటి పరిష్కారం.. మన పూర్వీకులు ఉపయోగించిన మెడిసిన్. అదే ఎఫెక్టివ్ ఫలితాలు అందించే ఆయుర్వేదం..!!
ఆయుర్వేద అనే పదం.. ఆయు, వేద అనే పదాల ద్వారా వచ్చింది. ఆయు అంటే జీవితం అని, వేద అంటే.. నాలెడ్జ్ అని అర్థం. ఆయుర్వేద అంటే.. మన పూర్వీకుల రహస్యాలు అని అర్థం. జీర్ణక్రియ సరిగా ఉండటం, మలినాలు తొలగించడం ఇవన్నీ ఆయుర్వేదం చాలా ఎఫెక్టివ్ గా ఎదుర్కొంటుంది.

ఆయుర్వేదం ప్రకారం మనం పాటించే అలవాట్లు సజావుగా లేకపోతే.. బరువు పెరగడానికి కారణమవుతుంది. దీనివల్ల రకరకాల సమస్యలు ఎదురవుతాయి. ఈ శరీరం మూడు రకాలు. వాత, పిత్త, కఫ. ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరం ఈ మూడు భాగాల ద్వారా ఏర్పడుతుంది. అంటే మనం హెల్తీ డైట్ ఫాలో అయితే.. ఇవి మనకు సరిగ్గా సూట్ అవుతాయి.
ఆయుర్వేద పరిష్కారాల ద్వారా బరువు తగ్గించుకోవడం తేలిక. వీటి ద్వారా బరువు తగ్గించుకోవడం చాలా తేలికవుతుంది. మరి అవేంటో చూద్దామా..

త్రిఫల
త్రిఫల అనేది బరువు తగ్గడానికి ఎఫెక్టివ్ గా పనిచేసే హెర్బ్. ఇందులో ఉసిరి, కరక్కాయ, తానికాయలు అనే మూడు మూలికలు ఉంటాయి. ఈ మూలికల్లో క్లెన్సింగ్, డెటాక్సిఫైయింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల పోషకాలు అందుతాయి. అలాగే ఆకలిని తగ్గిస్తుంది.
తీసుకునే విధానం
ఒక స్పూన్ త్రిఫల పౌడర్ తీసుకుని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా ఒక నెలరోజులు పాటిస్తే.. మంచి ఫలితం ఉంటుంది.

అలోవెరా
అలోవెరాను చర్మానికి, డైజెషన్ కి ఉపయోగిస్తారు. అలాగే బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. డెటాక్సిఫై, మెటబాలిజంకు ఇది సహాయపడుతుంది. దీనివల్ల బరువు తగ్గడం తేలికవుతుంది.
తీసుకునే విధానం
అలోవెరా జ్యూస్ ని, నిమ్మరసం, నీళ్లు, తేనె కలపాలి. దీన్ని బరువు తగ్గాలనుకునేవాళ్లు తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

కరివేపాకు
కరివేపాకు ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్. ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. బరువు తగ్గించడంతో పాటు, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. అలాగే యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలుంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవాళ్లకు ఇది చక్కటి పరిష్కారం.
ఉపయోగించే విధానం
పప్పు, కూరల్లో కరివేపాకు ఆకులను యాడ్ చేసుకోవాలి. అలాగే వేడినీటిలో ఉడికించి.. గోరువెచ్చగా ఉన్నవప్పుడు అవి తాగాలి. అలాగే కరివేపాకును నమలడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మెంతి
ప్రతి ఇండియన్ వంటింట్లో మెంతులను, మెంతి ఆకులను తరచుగా వాడుతూ ఉంటారు. అయితే బరువు తగ్గించడానికి మెంతి ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని కొంతమందికే తెలుసు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్యాట్ ని కరిగిస్తుంది.
తీసుకునే విధానం
ఒక స్పూన్ మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. దాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవాలి. అలాగే మెంతులను కొద్దిగా వేయించి..సలాడ్స్, పెరుగుతో కలిపి తీసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
