Latest Updates
-
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది!
వేగంగా.. ఖర్చులేకుండా.. శ్రమలేకుండా.. బరువు తగ్గాలా ?
బరువు తగ్గాలని చాలా బలంగా ప్రయత్నిస్తున్నారా ? రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయారా ? వ్యాయామం, డైట్ ఫాలో అయ్యి.. లాభం లేదని ఢీలాపడుతున్నారా ? అయితే మీకో చక్కటి ఈజీ ఉపాయం దొరికింది. సింపుల్ గా వేడి నీటి డైట్ ఫాలో అయితే చాలు.. ఈజీగా బరువు తగ్గేయవచ్చు అంటున్నారు.. ఎక్స్ పర్ట్స్. ఖర్చులేకుండా దొరికే నీటితో.. బరువు తగ్గించుకునే ప్రయత్నం ఇక వెంటనే మొదలుపెట్టేయండి.
వేడినీళ్ళు: అద్భుతమైన-ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు
సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో హాట్ వాటర్ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే.. ఇది బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుందని చాలా మందికి తెలియకపోవచ్చు. శరీరంలోని ప్రతి కణానికి నీళ్లు అవసరం. ఎందుకంటే.. మంచి న్యూట్రియంట్స్ ని అందించి.. చెడు పదార్థాలను బయటకు పంపిస్తుంది. అందులోనూ వేడినీళ్లు లేదా గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల మరింత ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

శరీరంలో పేరుకున్న క్రిములను చల్లటి నీటి కంటే.. వెచ్చటి నీళ్లు చాలా ఈజీగా తొలగిస్తాయి. ఇది బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో ఉండే ఫ్యాట్ ని హాట్ వాటర్ తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడతాయి. క్యాలరీలను చాలా వేగంగా కరిగడానికి వేడినీళ్లు ఉపయోగపడతాయి.
ఎర్లీ మార్నింగ్ తేనె -నీళ్ళు తాగడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు
భోజనానికి 15 నిమిషాల ముందు ఒక గ్లాసు వేడినీళ్లు తాగడం వల్ల ఆకలిని తగ్గించి.. తక్కువ ఆహారం తీసుకోవడానికి సహాయపడుతుంది. అలాగే 13 శాతం కాలరీ ఫుడ్ తీసుకోకుండా.. ఈ చిన్న టిప్ సహాయపడుతుంది. అంతేకాదు.. ఉదయాన్నే అల్పాహారానికి ముందు ఒక గ్లాసు వేడినీళ్లు తాగడం వల్ల.. రోజంతా క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోగలుగుతామని అధ్యయనాలు నిరూపించాయి.

ఉదయం వేడినీళ్లు తాగడం వల్ల అన్ హెల్తీ ఫుడ్ తీసుకోకుండా.. ఫ్యాట్ ఫుడ్ కి దూరంగా ఉంచడంతోపాటు.. మన పొట్ట నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది. చల్లటి నీళ్లు తాగడం కంటే.. వేడినీళ్లు తాగడం వల్ల ఆకలి చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి.. చల్లటి, నార్మల్ వాటర్ ప్లేస్ లో.. వేడి లేదా గోరువెచ్చని నీళ్లు తాగితే.. బరువు తగ్గడం చాలా ఈజీ. కాబట్టి ఆలస్యం చేయకుండా.. వెంటనే.. ఈ హాట్ వాటర్ డైట్ ఫాలో అయిపోండి.. స్లిమ్ గా తయారవండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
