Latest Updates
-
కూల్ డ్రింక్ సీసాలను ఇలా ఓపెన్ చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా.. ఈ పొరపాట్లు ఇకపై వద్దు.! -
గుత్తి వంకాయతో మసాలా చేసి బోర్ కొడితే ఇలా కొత్తగా ట్రై చేయండి.. వదలకుండా తినేస్తారు.! -
పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యంపై వయసు ప్రభావం.. ఎంతవరకు వాస్తవం.? -
పిల్లల ఫేవరెట్ ‘ఆలూ’.. రెస్టారెంట్ టేస్ట్‌తో అదరగొట్టే దమ్ బిర్యానీ.! -
వర్షాకాలంలో వీటిని తినే ముందు జాగ్రత్త.. లేదంటే వాంతులు, విరేచనాలు తప్పవు.! -
వర్షాకాలంలో జుట్టు విపరీతంగా రాలిపోతోందా? ఇలా చేస్తే నో టెన్షన్ -
చిల్ అవ్వడానికి చోటు ఏదైతేనేం.. భారీ వర్షంలోనూ ‘సిట్టింగ్’.. మందుబాబుల వైరల్ వీడియో.! -
పైన కరకర.. లోపల కరిగే చీజ్.. ఆహా అనిపించే పొటాటో చీజ్ బాల్స్..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
మీతో ఇతరులు హ్యాపీగా ఉండాలంటే.. ఈ 5 విలువైన సలహాలు పాటించాల్సిందే.! -
ఫౌండేషన్ తర్వాత ముఖం ఎందుకు నల్లగా మారుతుంది.. తెలిసీతెలియక చేసే పొరపాట్లు ఇవే.!
ఫ్లాట్ టమ్మీ పొందడానికి పవర్ ఫుల్ హోంమేడ్ డ్రింక్
ఫ్లాట్ బెల్లీ ఉండటం వల్ల స్మార్ట్ గా కనిపించడమే కాదు.. హెల్తీగా ఉండవచ్చని ఒక నమ్మకం ఉంది. నిజమే.. పొట్ట భాగంలో కొవ్వు పేరుకోవడం వల్ల.. దీర్ఘకాలికంగా.. అనేక దుష్ర్పభావాలు, వ్యక్తి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని.. అధ్యయనాలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ అంటే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. కేవలం చూడటానికే కాదు, దుస్తులు ధరించడానికే కాదు.. మొత్తం ఆరోగ్యంపైన దుష్ర్పభావం చూపుతుంది. అయితే లక్కీగా బెల్లీ ఫ్యాట్ ని ఫ్లాట్ మార్చే న్యాచురల్ రెమిడీస్ అందుబాటులో ఉన్నాయి.
న్యాచురల్ డ్రింక్ థెరపీని ఎంచుకోవడం వల్ల పొట్టలో పేరుకున్న ఫ్యాట్ ని కరిగించవచ్చని, దీనివల్ల ఎలాంటి హాని కలగదని.. అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఇవాళ తేలికగా తయారు చేసుకుని, సులభంగా బెల్లీ ఫ్యాట్ ని కరిగించే సింపుల్ హోంమేడ్ డ్రింక్ ని పరిచయం చేయబోతున్నాం.

చాలా అనుకూలంగా ఇంట్లోని వస్తువులతోనే ఈ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాల కోసం ఇంట్లో నుంచి అడుగు కూడా బయటపెట్టాల్సిన పనిలేదు. ఈ డ్రింక్ కోసం ఉపయోగించే పదార్థాలన్నీ.. బెల్లీ ఫ్యాట్ కరిగించే అద్భుతమైన గుణాలు కలిగి ఉంటాయి. అన్ని పదార్థాలు లో క్యాలరీలు కలిగి ఉంటాయి. హై ఫైబర్, వాటర్ కంటెంట్ కలిగి ఉంటాయి.
కావాల్సిన పదార్థాుల
1 దోసకాయ
అల్లం
3 నుంచి 4 టీస్పూన్ల నిమ్మరసం
4 నుంచి 5 పుదీనా ఆకులు
1 టీస్పూన్ సాల్ట్
3 నుంచి 4 తులసి ఆకులు

తయారు చేసే విధానం
దోసకాయను, అల్లంను చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలి
ఒక గ్లాసు నీటిలోకి అన్నింటినీ కలపాలి
అన్నీ బాగా కలిసేలా.. బాగా మిక్స్ చేయాలి
ఈ డ్రింక్ ని రోజంతా తాగుతూ ఉండాలి.
ఈ డ్రింక్ రెమిడీని.. మీకు కావాల్సిన ఫలితాలు పొందేవరకు తాగాలి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది. పొట్ట ఫ్లాట్ గా మారడానికి సహాయపడుతుంది.
గమనిక
ఒకవేళ మీరు ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే.. మీ డైటీషియన్ సలహా తీసుకుని.. ఈ ట్రీట్మెంట్ మొదలుపెట్టాలి. అలాగే కొంచెం పరిమాణంలో దీన్ని తీసుకుని.. శరీరంలో ఎలాంటి దుష్ర్పభావాలు లేకపోతే.. అప్పుడు ఈ డ్రింక్ ని రెగ్యులర్ గా తాగడం మొదలుపెట్టాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications